Andhra Pradesh News: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండోజాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది. రెండో జాబితాలో చోటు సంపాదించుకున్న అభ్యర్థులు వీళ్లే

1.నరసన్నపేటభగ్గు రమణమూర్తి
2.గాజువాక పల్లా శ్రీనివాసరావు
3.చోడవరంకేఎస్‌ఎస్‌ఎస్‌రాజు
4.మాడుగులపైలా ప్రసాద్
5.ప్రత్తిపాడుపరుపుల సత్యప్రభ
6.రామచంద్రపురంవాసంశెట్టి సుభాష్‌
7.రాజమండ్రి రూరల్‌గోరంట్ల బుచ్చయ్య జౌదరి
8. రంపచోడవరంమిర్యాల శిరీష
9.కొవ్వూరుముప్పిడి వెంకటేశ్వరరావు
10.దెందులూరు చింతమనేని ప్రభాకర్
11.గోపాలపురం (ఎస్సీ)మద్దిపాటి వెంకటరాజు
12.పెదకూరపాడుభాష్యం ప్రవీణ్
13.గుంటూరు వెస్ట్‌పిడుగురాళ్ల మాధవి
14.గుంటూరు ఈస్ట్‌ మహమ్మద్‌ నజీర్ 
15గురజాలయరపతినేని శ్రీనివాసరావు
16కందుకూరుఇంటూరు శ్రీనివాసరావు
17మార్కాపురంకందుల నారాయణ రెడ్డి
18గిద్దలూరు అశోక్ రెడ్డి
19ఆత్మకూరుఆనంరామనారాయణ రెడ్డి
20కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 
21వెంకటగిరి కురుకొండ్ల లక్ష్మీ ప్రియ.
22కమలాపురంపుత్తా చైతన్యరెడ్డి
23ప్రొద్దుటూరువరదరాజుల రెడ్డి
24నందికొట్కూరుగిత్తా జయసూర్య 
25ఎమ్మిగనూరుజయనాగేశ్వరరెడ్డి
26మంత్రాలయంరాఘవేంద్రరెడ్డి
27పుట్టపర్తిపల్లె సిధూరారెడ్డి
28కదిరికందికుంట యశోదా దేవీ
29మదనపల్లిషాజహాన్ బాషా 
30పుంగనూరుచల్లా రామచంద్రారెడ్డి(బాబు)
31చంద్రగిరిపులివర్తి వెంకట మణి ప్రసాద్(నాని)
32శ్రీకాళహస్తిబొజ్జల వెంకటసుదీర్‌రెడ్డి
33సత్యవేడు కోనేటి ఆదిమూలం 
34పూతలపట్టుకలికిరి మురళి మోహన్ 

 

టీడీపీ రిలీజ్ చేసిన రెండో జాబితాలో 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు ఇద్దరు ఉన్నారు. 36 నుంచి 45 వయసు మధ్య ఉన్న వాళ్లు 8 మంది ఉన్నారు. 46 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు 19 మంది ఉన్నారు. 61-75 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు ముగ్గురే ఉన్నారు. 75 ఏళ్లకు పైబడిన వాళ్లు ఇద్దరు ఉన్నారు. 

రెండో జాబితాలో పురుషుల సంఖ్య 27 మంది ఉన్నారు... స్త్రీలు ఏడుగురు ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో పీహెచ్‌డీ చేసిన వాళ్లు ఒకరుంటే.. పీజీ చేసిన వాళ్లు 11 మంది ఉన్నారు. డిగ్రీ మాత్రమే చదివిన వాళ్లు 9 మంది ఉన్నారు. ఇంటర్‌తో చదువు ఆపేసిన వాళ్లు 8 మంది ఉన్నారు. అంతకంటే తక్కువ చదివిన వాళ్లు ఐదుగురు మాత్రమే ఉన్నారు