Aswaraopeta News: 2023 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది. గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గంలోలో కాంగ్రెస్ పట్టు సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రావు బీఆర్‌ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ఇక్కడ పొత్తుల్లో భాగంగా ఈ సీటును బీజేపీ జనసేనకు కేటాయించి ఆ పార్టీ తరఫున ఎం ఉమాదేవి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 


ఈ నియోజకవర్గం గత చరిత్ర పరిశీలిస్తే... 2018లో ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచించింది. తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ గెలిచిన సీట్లలో ఇదొకటి. ఖమ్మం జిల్లా నుంచే ఇంకొక సీటు టీడీపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం టీడీపీ ఎక్కడా పోటీ చేయలేదు. చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ పోటీకి దూరంగా ఉంది. అప్పడు టీడీపీ తరఫున పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు బీఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై 13వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 


కొన్ని రోజుల తర్వాత టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు అభ్యర్థులు మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు అదే స్థానం నుంచి కారు గుర్తుపై పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు ఓటమి చవి చూశారు. అంతకు ముందు  ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో ఆయన మూడు గుర్తులపై పోటీ చేశారు.