TS Lok Sabha Election Results 2024 Live Updates: తెలంగాణలో కాంగ్రెస్ Vs బీజేపీ - గాంధీ భవన్లో కాంగ్రెస్ సంబరాలు
Telangana Lok Sabha Election Results 2024 Live Updates: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 24 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పనిలేదు.
బీజేపీ 8 సీట్లు గెలువడంలో BRS ఫెయిల్యూర్ మాత్రమే. కేసీఆర్ ఇక్కడి రైతులను పట్టించుకోకపోవడం వల్లనే బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కలేదని బీజేపీ నేతలను వ్యాఖ్యానిస్తున్నారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు టపాకాయలు కాల్చి, డ్యాన్స్‌లు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వలేదని ఆనందం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కంచుకోటైనా మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ రావు 33 వేల మెజారిటీతో గెలుపొందారు.
కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ అత్యధిక మెజారిటీ సాధించారు. మరో 4 రౌండ్లు ఉండగానే 2006లోని కేసీఆర్ రికార్డును, 2014లో వినోద్ రికార్డులను బండి సంజయ్ బీట్ చేశారు.
బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న అంటూ ఈటల రాజేందర్ తెలిపారు. మల్కాజ్‌గిరిలో ఆయన భారీ ఆధిక్యంతో విజయాన్ని సాధించారు.
ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్‌లో ఐదోసారి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. మాధవీ లత గట్టిపోటీ ఇచ్చినా.. బీజీపికి ఓటమి తప్పలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. నాలుగు స్థానాల్లో గెలుపొందింది. భాజపా 7 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. ఓ స్థానంలో గెలుపును పొందింది.
కంటోన్మెంట్లో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది.
2009 తర్వాత జహీరాబాద్‌లో గెలిచిన కాంగ్రెస్. సురేష్ షెట్కార్ విజయంతో కాంగ్రెస్ మళ్లీ జహీరాబాద్‌లో గెలిచింది. 2019లో స్వల్ప తేడాతో ఎంపీ సీటును చేజార్చుకుంది.
మెదక్ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజారిటీతో దూసుకుపోతున్నారు. 29వేల పైచిలుకు ఓట్లతో గెలుపునకు చేరువయ్యారు.
హైదరాబాద్‌లో ఎంఐఎం మరోసారి తన సత్తా చాటింది. 59 వేల ఆధిక్యంతో తన సత్తాను చాటుకుంది. బీజీపీ అభ్యర్థి మాధవీ లతాపై అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీని పొందారు.
హైదరాబాద్‌లో ఎంఐఎం మరోసారి తన సత్తా చాటింది. 59 వేల ఆధిక్యంతో తన సత్తాను చాటుకుంది. బీజీపీ అభ్యర్థి మాధవీ లతాపై అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీని పొందారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మంలో గెలుపు ఖరారైంది. కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని సాధించారు.
మల్గాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడవ రౌండ్ ముగిసే సరికి.. బీజేపీ1,33,783 ఓట్లతో లీడ్‌లో ఉంది. ఈటెల రాజేందర్ రెడ్డి గెలుపు దగ్గర్లో ఉన్నారు.
సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 32 వేల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు.
సికింద్రాబాద్ - సనత్ నగర్ సెగ్మెంట్ తొమ్మిదవ రౌండ్ ముగిసే సరికి.. కిషన్ రెడ్డి 21,112 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. మొత్తంగా 40,842 ఓట్లు బీజేపీ వచ్చాయి.
జహీరాబాద్‌లో 15వ రౌండ్ ముగిసేసరికి.. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 13,705 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ 81,689తో ఉండగా.. బీజేపీ 2,11,948 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 2,25,653 ఓట్లతో లీడ్‌లో ఉంది.
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు ఆధిక్యత కలిగిన ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ఆ ఒక్క సీట్‌ని కూడా కోల్పేయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ 8, కమలం 8 స్థానాల్లో ఉన్నాయి.
మెదక్‌లో ఇప్పటివరకు బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండగా.. మూడో రౌండ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం రఘునందన్ రావు 1731 ఓట్ల మెజరాటీలో (65386 ఓట్లతో) ఉన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, కమలం మధ్య గట్టి పోటి నడుస్తోంది. కాంగ్రెస్ 8 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. 7 స్థానాల్లో కమలం ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ 1, ఎమ్ఐఎమ్ ఒక స్థానాల్లో మెజారిటీలో ఉన్నాయి.
Telangana Loksabha Election Results 2024: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1,05,472 ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి 1,48,091, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందురు రఘువీర్ రెడ్డి 1,42,695 లీడింగ్ లో ఉన్నారు.
Telangana Loksabha Election Results 2024: కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్ లో ఉన్నారు. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 25 వేల పైచిలుకు లీడ్ లో ఆయన కొనసాగుతున్నారు.
Telangana Loksabha Election Results 2024: తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెరో స్థానంలో కొనసాగుతున్నారు. మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అటు, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అలాగే, మెదక్ లో బీఆర్ఎస్, హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది.
మెదక్‌లో పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి తొలుత వెనుకంజలో ఉన్నా ఇప్పుడు లీడ్ లో కొనసాగుతున్నారు.
తెలంగాణలో ఎనిమిది లోక్ సభ స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 11 వేల లీడ్ లో ఉన్నారు.
మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు.
నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో ఉన్నారు. అటు, మహబూబాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు.
భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, వరంగల్ లో బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ముందంజలో ఉన్నారు. అటు, హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలత వెనుకంజలో ఉన్నారు.
హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు.
పెద్దపల్లిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. వంశీకృష్ణ 816 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. అటు, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనుండగా.. ఉదయం 8:30కు ఈవీఎంల లెక్కింపు ప్రారంభిస్తారు.
Background
Telangana Lok Sabha Election Results 2024 Live Updates: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, 8:30 గంటలకు ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది బరిలో నిలిచారు. రాష్ట్రంలో 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 10 వేల మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోగా.. వీటి లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటల వరకూ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లు.. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు ఉండనుంది.
పటిష్ట భద్రత
కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో నాలుగంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని చెప్పారు. లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లు, సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగించుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి లెక్కింపు కేంద్రం వరకూ పటిష్ట భద్రత ఉంటుందని అన్నారు. కేంద్రంలోని ప్రతి చోటూ కవర్ చేసేలా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. మద్యం దుకాణాలు బంద్ చేసేలా కఠిన చర్యలు చేపట్టామన్నారు.
అభ్యర్థుల్లో ఉత్కంఠ
అటు, గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పోటీ అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 10 స్థానాలకు పైగానే ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు, కాంగ్రెస్ నేతలు సైతం కచ్చితంగా 12 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు సైతం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -