Pawan Kalyan News In Telugu: హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో జనసేన (Janasena) నిలిచింది. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారం చేశారు. ఆదివారం రాత్రి కూకట్ పల్లిలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రేమ్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో దాదాపు 400 పైగా ఉన్న పోలింగ్ బూత్ లలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. 


మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లో బీజేపీకి ఒక్క బలమైన నాయకుడు లేరన్నారు. కార్యకర్తలే నాయకులుగా ఎదిగారని చెప్పారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి బలమైన నేతలు బీజేపీలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడ్డారని, కానీ, పదేళ్లు గడిచినా యువత ఆశలు నెరవేరలేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ తెలంగాణలోనే ఏర్పాటు అయిందని, ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలో నిలిచామన్నారు. ఇక్కడ తమకు మద్దతు తెలిపేందుకు సభకు వచ్చిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు జనసేనాని ధన్యవాదాలు తెలిపారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను పవన్ కళ్యాణ్ కోరారు.






కూకట్‌పల్లిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ, జనసేన సభ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తల అత్యుత్సాహంతో ఇది జరిగింది. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ జనసైనికులు ముందుకు దూసుకురావడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని అదుపు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంత సమయానికే పరిస్థితి అదుపులోకి వచ్చింది. 


జనసేనతో కలిసి బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల తలరాత మార్చుతుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీఆర్ఎస్ ఓటమికి జనసేన, బీజేపీ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో జనసేన బరిలోకి దిగింది. నియంత పాలనకు చరమగీతం పలికేందుకు బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుందని, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Also Read: Telangana Elections 2023: 'ఫాం హౌజ్ లో నిద్రపోయే సీఎం మనకు అవసరమా.?' - సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమ


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply