తెలంగాణ మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో మొదటి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 119 సీట్లకుగాను 63 స్థానాలు గెలుచుకొని కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా... సీఎం కేసీఆర్‌ ముందస్తు  ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018లో ఎన్నికలు జరిగాయి. 2018 ఎన్నికల్లో మొదటిసారి కంటే 25 సీట్లు ఎక్కువగా గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది టీఆర్‌ఎస్‌. 88 సీట్లు  సాధించి గులాబీ జెండా ఎగురవేసింది. రాష్ట్రంలో విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడిగా బీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేకపోయాయి. ఆ తర్వాత.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)  కాతా... భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారింది. పేరు మార్పు తర్వాత 2019లో ఎన్నికలు ఎదుర్కోబోతోంది.


2014లో జరిగిన తొలి ఎన్నికల్లో 119 సీట్లకుగాను 63 సీట్ల గెలుచుకున్న టీఆర్‌ఎస్‌... 34.04 శాతం ఓట్లు సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ 21 స్థానాలకే పరిమితం కాగా... టీడీపీ  15, ఎంఐఎం 7, బీజేపీ 5, వైఎస్‌ఆర్‌సీపీ 3, బీఎస్పీ 2, సీపీఐ, సీపీఎం చొరక స్థానం, ఇండిపెండెంట్ల ఒకటి గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 25.02 శాతం ఓట్లు  రాగా... టీడీపీ 14.55శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. అలాగే బీజేపీకి 7.03 శాతం, ఎంఐఎంకు 3.74 శాతం, వైఎస్‌ఆర్‌సీపీ 3.36శాతం , బీఎస్పీ 1.35శాతం, సీపీఐ 0.89, సీపీఎం  1.55, ఇండిపెండెంట్లకు 5శాతం ఓట్లు వచ్చాయి.


ఇక, 2018 ఎన్నికల్లో 88 సీట్ల గెలిచి విజయదుంధుబి మోగించింది టీఆర్‌ఎస్‌. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 సీట్లు, ఎంఐఎం ఏడు, టీడీపీ రెండు, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఒక  స్థానాన్ని గెలుచుకున్నాయి. సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఇక, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సీట్లే కాదు.. ఓట్ల శాతం మరింత పెరిగింది.  2014 కంటే 12శాతం ఎక్కువగా... 46.87 ఓటు శాతం దక్కించుకుంది టీఆర్‌ఎస్‌. ఇక, కాంగ్రెస్‌ 28.44, బీజేపీ ఏడు శాతం ఓట్లను సొంతం చేసుకున్నాయి. ఎంఐఎంకు 2.71  శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ 3.51, ఇండిపెండెంట్లు 3.26 ఓట్లు దక్కించుకోగా... సీపీ 0.4, సీపీఎం 0.44, బీఎస్పీకి 2.07 శాతం ఓట్లు వచ్చాయి.


2014 లోక్‌సభ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు గాను 11 గెలుచుకుని 34.67 శాతం ఓట్లు కైవసం చేసుకుంది. అయితే.. 2019లో ఎంపీ స్థానాలు తగ్గాయి.. కానీ ఓట్ల శాతం పెరిగింది.  2019లో 9 ఎంపీ స్థానాలను గెలుచుకుని 41.30 శాతం ఓట్లు దక్కించుకుంది టీఆర్‌ఎస్‌. 2014 లోక్‌సభ ఎన్నికల కంటే 2019లో 2 సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతం మాత్రం 8శాతం  వరకు పెరిగింది. 


గత రెండు ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 2014లో నాలుగో స్థానంలో ఉన్న ఎంఐఎం... 2018లో మూడో స్థానానికి చేరింది. టీడీపీ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక బీజేపీ.. 2014లో ఐదో స్థానంలో ఉంది.. కానీ 2018లో ఆరో స్థానానికి పడింది. ఈమధ్య తెలంగాణలో బీజేపీ రెండో స్థానంలోకి వచ్చేసింది అనుకునేలోపే... కమలం పార్టీ గ్రాఫ్‌ పడిపోయిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పార్టీ ఉన్నా... 2023 ఎన్నికల్లో తెలంగాణ ముఖచిత్రం ఎలా మారబోతుందో చూడాలి.