Election Bettings:  పోటీ ఏదైనా  బెట్టింగ్ ఖాయం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థిత ిమారిపోయింది.  తెలంగాణ ఎన్నికలపైనా అదే విధమైన బెట్టింగ్‌లు జరుగుతున్నయి.   క్రికెట్‌, ఇతరత్రా పోటీలపై బెట్టింగులు నిర్వహించిన ఆన్​లైన్ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వాటి కన్ను పడింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బరిలోకి దిగిన పందెం రాయుళ్లు… కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నారు. ఈ సారి పలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు వేస్తున్నారు. వందకు వెయ్యి, వెయ్యికి లక్ష అంటూ బెట్టింగ్ బంగార్రాజులు పందేలు కాస్తున్నారు.                        


 పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందన్న పందేలు కూడా కాస్తున్నారు. లక్షలు కాదు.. కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. రాష్ట్రంలో ఎవరిని చూసినా ఇదే చర్చ. ఊరు వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గల్లిలోనూ ఏ నలుగురు గుమిగూడినా ఇదే చర్చ. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల్లో ఏ పార్టీ, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంచనాలపై వేర్వేరు బెట్టింగ్‌ సంస్థలు పందేలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు ప్రచారకర్తలుగా ఆయా సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లకు విస్తృత ప్రచారం కల్పిస్తుండటం, వెబ్‌సైట్లు, బస్టాపులు, ఆటోలపై వారి ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు.                     


బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి.. ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటాయి. అంటూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సంస్థలు ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని.. పందెంలో గెలిచిన వారు అంతకంత డబ్బు సంపాదించుకోవచ్చని ఊరిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిత్యం రకరకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే బెట్టింగ్‌ సంస్థలు అంతకు మించి హడావుడి పెంచాయి.                   


తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సర్వేలు చేయించి మరీ పందాలు కాస్తున్నారు బుకీలు. కేసీఆరే సీఎం అవుతారని.. హంగ్ వస్తుందని.. కాంగ్రెస్ గెలుస్తుందంటూ కోట్లాది రూపాయల్లో బెట్టింగులు కాస్తున్నారు.  బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దాని పైన కూడా పందాలు  జరుగుతున్నాయి.  రేవంత్ రెడ్డి రెండు చోట్ల గెలుస్తాడా... కేసీఆర్ కు ఎంత మెజార్టీ వస్తుంది..  కోమటిరెడ్డి బ్రదర్స్, మైనంపల్లి  గెలుస్తారా లేదా అన్న అంశాలపైనా బెట్ిటంగ్ జరుగుతోంది.  మూడో తేదీ లోపు వేల కోట్ల బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా .