Telangana Election Results 2023 LIVE: ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Telangana Assembly Election Results 2023 LIVE Updates: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎల్పీ సమావేశం ముగియగా సీఎం ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

ABP Desam Last Updated: 05 Dec 2023 09:13 AM

Background

Telangana Elections Results 2023: మరికొన్ని గంటల్లో ఉత్కంఠ వీడనుంది. తెలంగాణ ప్రజలు ఎవరి పక్షాన నిలబడ్డారో.? తేలిపోనుంది. 119 స్థానాలున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 60 స్థానాల్లో గెలిచి తీరాల్సిందే. డిసెంబర్ 3న (ఆదివారం) మధ్యాహ్నానికి...More

ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కొసరత్తు కొనసాగుతోంది. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రతినిధులు సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. తమ అభిప్రాయాలు మరింత గట్టిగా చెప్పేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ వెళ్లారు. కాసేపట్లో ఖర్గేతో అంతా కలిసి సమావేశం కానున్నారు. సీఎం పేరును ఖరారు చేసి సాయంత్రానికి సీల్డ్ కవర్‌లో తీసుకురానున్నారు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత సీఎం పేరు అందరి సమక్షంలో ప్రకటించనున్నారు. సీఎం పేరు ప్రకటన తర్వాత ఎల్లుండి ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.