Warangal CP Alert On Rallies and celebrations after Results: వరంగల్: ఆదివారం (డిసెంబర్ 3వ తేదీన) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది. అయితే ఎన్నికల ఫలితాల విడుదలయ్యే ఆదివారం నాడు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. నిబంధనలను అనుసరించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ఆమలులో ఉన్నందున ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలను నిర్వహించ వద్దని చెప్పారు.
బాణా సంచా కాల్చడం, డిజే వినియోగించడం, ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇతర ర్యాలీలతో పాటు, సంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, గుంపులు తిరగడంపై నిషేధం ఉందన్నారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలతో పాటు ఓటమి పాలైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం సమన్వయంతో వ్యవహరిస్తూ పోలీసులకు పూర్తి సహకరించాలని వరంగల్ సీపీ సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply