Telangana Congress cm candidate announcement live updates: తెలంగాణ కొత్త సీఎం ఎవరనే సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. దాంతో రాజ్ భవన్ లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. జిఎడి, ఐ అండ్ పీఆర్, పోలీసులు సోమవారం రాత్రి రాజ్ భవన్ నుంచి వెళ్లిపోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎం చేయకూడదని కొందరు సీనియర్లు గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్ లో అప్పుడే సంక్షోభం మొలైనట్లు కనిపిస్తోంది.


కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సీఎల్పీ నేతగా ఎవరనేది తేలలేదు. సీఎం వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఢిల్లీలోనే విషయం తేల్చేందుకు అధిష్టానం సిద్ధమైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. దాంతో డీకే సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్తున్నారు. డీకేతో పాటు మరో నలుగురు పరిశీలకులను ఢిల్లీకి పిలిచింది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్, ఏఐసీసీ అగ్ర నేతలు మంగళవారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. 


రేవంత్ ను సీఎంగా అంగీకరించడం లేదా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తరువాత నెలకొన్న పరిస్థితులే తెలంగాణలో రిపీట్ అవుతున్నాయి. అక్కడ సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉండగా.. చివరికి మాజీ సీఎం సిద్ధరామయ్యను సీఎంగా, శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. తెలంగాణలో అదే విధంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. బయటి నుంచి మద్దతున్నా సీనియర్ల నుంచి రేవంత్ కు సపోర్ట్ లేదన్న వాదన వినిపిస్తోంది. రేవంత్ ను సీఎంగా అంగీకరించేది లేదని కొందరు సీనియర్లు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిల్ల శ్రీదర్ బాబు, దామోదర్ రాజనర్సింహ, భట్టి తదితర నేతలు మధ్యలోనే వెళ్లిపోయారని పార్టీ శ్రేణుల సమాచారం. 



నిన్న డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠ్రాకే, రేవంత్, ఉత్తమ్, మల్లు రవి నేతలతో కూడిన కాంగ్రెస్ బృందం గవర్నర్ తమిళిసైని కలిసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు సోమవారం రాత్రిలోగా హైదరాబాద్ చేరుకుంటారని సోమవారం ఉదయం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ఎమ్మెల్యేలు చర్చించి సీఎం ఎవరన్నది తేల్చేస్తారని శివకుమార్ ఆదివారం రాత్రి చెప్పారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మె్ల్యేలు ఇందులో పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఎంపికపై చర్చ జరిగింది. 


ఏఐసీసీ నియమించిన పరిశీలకులు పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. సీఎల్సీ నేత ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో నిర్ణయం అధిష్టానానికి వదిలేశారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ విజయం సాధించాక సీఎల్పీ భేటీలో శాసనసభాపక్షనేతను ఎంపిక చేయకుండా, అధిష్టానానికి నిర్ణయం వదిలేస్తూ ఏకవాక్య తీర్మాణం చేయడం తెలిసిందే. ఆపై కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్, సిద్ధరామయ్యలను ఢిల్లీకి పిలిచించి చివరికి శివకుమార్ కు సర్దిచెప్పి.. సీఎంగా చేసిన అనుభవం ఉన్న సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించింది.