Mizoram Election Results:
లల్దుహోమదే విజయం..
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ (Zoram People's Movement) మెజార్టీ (Mizoram Election Results 2023) సాధించింది. బీజేపీ మిత్రపక్షమైన మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) ఈ సారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. ఇప్పుడు జెడ్‌పీఎమ్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ లల్దుహోమ (Lalduhoma) పేరు బాగా వినిపిస్తోంది. ఆయనే ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. అధికార MNFపై (Mizo National Front) అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు వాటిని నిరూపించడంలోనూ సక్సెస్ అయ్యాలు లల్దుహోమ. అందుకే సులువుగా విజయం సాధించగలిగారు. దీంతో పాటు మద్యపాన నిషేధం అనే హామీని విస్తృతంగా ప్రచారం ( Who is Lalduhoma) చేశారు. ఇది కూడా కొంత వరకూ ZPMకి కలిసొచ్చింది. జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీని స్థాపించింది ఆయనే. సెక్యులరిజమే ఎజెండాగా పార్టీని ముందుకు నడిపించారు. 74 ఏళ్ల లల్దుహోమ...IPS అధికారిగా తన కెరీర్‌ని మొదలు పెట్టారు. గోవాలో IPSగా సేవలందించారు. ఆ తరవాత అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా పని చేశారు. ఈ సమయంలోనే ఆయనకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. 1980ల్లో కాంగ్రెస్‌లో చేరారు. 1984లో మిజోరం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొంది చరిత్ర సృష్టించారు. 1985లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. రెండేళ్ల తరవాత Zoram Nationalist Party (ZNM) పార్టీని స్థాపించారు. ఇది మిజోరం పాలిటిక్స్‌లో గేమ్‌ఛేంజర్ అయింది. 2017లో స్థానికంగా 6 పార్టీలను కలుపుకుని Zoram People's Movement కూటమిని ఏర్పాటు చేశారు లల్దుహోమ.
ప్రత్యామ్నాయంగా ఎదిగిన ZPM..
1984లో లల్దుహోమ లోక్‌సభలో ఎంట్రీ ఇచ్చారు. అనుకున్నంత సులువుగా ఆయన పొలిటికల్ జర్నీ కొనసాగలేదు. ఎంపీ అయిన కొద్ది రోజులకే సవాళ్లు ఎదురయ్యాయి. ఫిరాయింపుల చట్టం కింద అనర్హతా వేటుకి గురయ్యారు. ఇలా అనర్హతకు గురైన తొలి ఎంపీగా రికార్డుకెక్కారు. 2020లోనూ ఫిరాయింపుల చట్టం కిందే మిజోరం అసెంబ్లీ ఆయనపై అనర్హతా వేటు వేసింది. అయినా సరే పంతం వీడలేదు లల్దుహోమ. సెర్చిప్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లలో 6 స్థానాల్లో గెలిచింది ZPM.2019లో ఈ కూటమి అధికారికంగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. నిజానికి అప్పటి వరకూ ఉన్న మిజోరం రాజకీయాలు లల్దుహోమా ఎంట్రీతో చాలా ఆసక్తికరంగా మారాయి. అప్పటి వరకూ ముఖ్యమంత్రి అభ్యర్థులు అంటే...కాంగ్రెస్ తరపున లాల్ తన్హ్‌వాలా (Lal Thanhwala), MNF నుంచి జోరంతంగ (Zoramathanga) పేర్లు మాత్రమే వినిపించేవి. కానీ...ఇప్పుడు లల్దుహోమా కూడా ఈ రేస్‌లోకి వచ్చారు. ఆ స్థాయిలో అక్కడి రాజకీయాల్ని ప్రభావం చేయగలిగారు. దాదాపు మూడు దశాబ్దాల తరవాత మిజోరంకి కొత్త ముఖ్యమంత్రిగా లల్దుహోమ పరిచయం అవబోతున్నారు. దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇన్నాళ్లూ మరో ఆప్షన్ లేదనుకున్న ఓటర్లకు..బెస్ట్ ఆప్షన్‌గా తమ పార్టీని రేసులో నిలబెట్టారు. అందుకే...ఈ సారి మెజార్టీ మార్క్ సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోయింది జెడ్‌పీఎమ్.
Also Read: Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM