Telangana Assembly Election 2023:  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94  శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా మెదక్ జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.97  శాతం పోలింగ్‌ నమోదైంది.  సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ జరిగింది.

మధ్యాహ్నం  5 గంటల వరకూ పోలింగ్ ముగిసే సమయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 63.94

వరుస సంఖ్య జిల్లా పేరు  పోలింగ్ శాతం 
1 ఆదిలాబాద్   73.58%
2 భద్రాద్రి 66.37%
3 హైదరాబాద్ 39.97%  
4 జగిత్యాల 74.87%
5 జనగామ  80.23%
6 భూపాలపల్లి  76.10%
7 గద్వాల 73.60%
8 కామారెడ్డి 71%
9 కరీంనగర్ 69.22%  
10 ఖమ్మం 73.77% 
11 కుమరంభీం 71.63%
12 మహబూబ్‌ నగర్‌ 77.50%  
13 మంచిర్యాల 70.71%
14 మెదక్ 80.28%
15
మేడ్చల్ మల్కాజిగిరి

49.25%
16 ములుగు       75.02%
17 నాగర్ కర్నూల్  70.83%
18 నల్గొండ    75.72%
19 నిజామాబాద్    68.30%  
  నారాయణపేట  67.70%
20 నిర్మల్ 71.47%
21 పెద్దపల్లి       69.83%
22  రాజన్న సిరిసిల్ల  71.87%
23 రంగారెడ్డి  53.03%
24 సంగారెడ్డి   73.83%
25 సిద్దిపేట  77.19%
26 సూర్యాపేట      74.88%
27 వికారాబాద్     69.79%
28 వనపర్తి  72.60%
29 వరంగల్    52.2%
30 యాదాద్రి భువనగిరి  78.31%

3 గంటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 36.68

మధ్యాహ్నం 3గంటల  వరకు సుమారు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలో 70.48శాతం పోలింగ్‌ నమోదు కాగా..  అత్యల్పంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 20.09 శాతం నమోదైంది. 

1 గంటకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 36.68

అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8 శాతం
అత్యల్పంగా హైదరాబాద్ లో  20.79 శాతం

ఆదిలాబాద్  41.88%   , భద్రాద్రి       39.29%, హైదరాబాద్  20.79%  , జగిత్యాల  46.14%, జనగామ  44.31%, భూపాలపల్లి 49.12%, గద్వాల  49.29%, కామారెడ్డి  40.78%, కరీంనగర్  40.73%  , ఖమ్మం   42.93% , కుమరంభీం   42.77%, మహబూబ్‌ నగర్‌ 46.89%  , మంచిర్యాల 42.74%, మెదక్   26.00%, మేడ్చల్ మల్కాజిగిరి 50.80%, ములుగు      45.69%, నాగర్ కర్నూల్ 39.58%, నల్గొండ   42.50%  , నిజామాబాద్  39.66%  , నారాయణపేట 42.60%, నిర్మల్       41.74%, పెద్దపల్లి       44.49%, రాజన్న సిరిసిల్ల 39.07%, రంగారెడ్డి   18.07%  , సంగారెడ్డి  42.17%, సిద్దిపేట     44.35%, సూర్యాపేట    44.14%, వికారాబాద్    44.85%, వనపర్తి  40.40%, వరంగల్      42.0%  , యాదాద్రి భువనగిరి 45.07%

11 గంటలకు రాష్ట్ర వ‌్యాప్తంగా  20.64% పోలింగ్

అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు మినమా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ మొత్తం 20.63 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 12.39 శాతం ఓటింగ్ నమోదయినట్టు ఈసీ తెలిపింది.అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read: హైదరాబాద్ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారిందా - 11 అయినా 12 శాతమే పోలింగ్!

హైదరాబాద్ లోనే తక్కువ

ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్ నగరవాసులు ఓటేయడానికి ఆసక్తి చూపడం లేదు. పోలింగ్ మొదలైనప్పటి నుంచీ అత్యల్ప ఓటింగ్ హైదరాబాద్ లోనే నమోదవుతోంది.ఉదయం 9 గంటల వరకూ హైదరాబాద్ లో 4.57 శాతం మాత్రమే ఓటింగ్ నమోదవగా..ఈ శాతం 11 గంటలకు 12.39 శాతం, ఒంటిగంటకు  20.79 శాతం నమోదైంది, 3 గంటలకు హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదవగా...5 గంటలకు అంటే పోలింగ్ ముగిసే సమయానికి హైదరాబాద్ లో 39.97% శాతం పోలింగ్ నమోదైంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply