Telangana Polling 2023 LIVE Updates: తెలంగాణలో గెలిచేది ఎవరు.? నిలిచేది ఎవరు.? - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఫలితాలు

Telangana Assembly Election 2023 LIVE updates: నేడు తెలంగాణ ఎన్నికలు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో జరుగుతున్న పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడ లైవ్‌లో చూడవచ్చు.

ABP Desam Last Updated: 30 Nov 2023 11:48 PM
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 70.60 శాతం ఓటింగ్

తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 70.60 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలవనుంది. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కానుంది.

ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి స్పెషల్ లీవ్: వికాస్ రాజ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 29, 30 తేదీలలో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక సెలవు ప్రకటించారు. స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని వికాస్ రాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Exit Polls Effect: రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు

తెలంగాణలో ఎన్నికలు ముగియడం, అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు వస్తాయని రావడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు.

తెలంగాణలో ఇప్పటివరకూ 68 శాతం పోలింగ్

తెలంగాణలో ఇప్పటివరకూ 68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు, కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ముగిసి, ఈవిఎంలు సీల్ చేసి, స్ట్రాంగ్ రూంలకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంత రాత్రైనా పోలింగ్ ఎంత శాతం నమోదైందన్న వివరాలను ఎన్నికల సంఘం ఈ రోజే వెల్లడించాలన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈసీ ని డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 






 

తెలంగాణలో ఇప్పటివరకూ 64.26 శాతం పోలింగ్

తెలంగాణలో ఇప్పటివరకూ 64.26 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్, చేవెళ్ల మండలం ఆలూరు వంటి చోట్ల పోలింగ్ సాగుతుండగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం అవకాశం ఉందని తెలిపారు.

ఆలూరులో కొనసాగుతోన్న పోలింగ్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరులో పోలింగ్ కొనసాగుతోంది. ఆలూరూలోని 286, 287 బూత్ ల్లో పోలింగ్ సాగుతోంది. అలాగే, రాజేంద్రనగర్ పరిధి కిస్మత్ పురాలోనూ పోలింగ్ కొనసాగుతోంది.  

90 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా - కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 'నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎర్రబెల్లి ఓటమి ఖాయం. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం కుదిరింది. కార్యకర్తల పోరాటం వృథా కాలేదు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ లాంటి వారే ఓడారు. కేసీఆర్ ఓ లెక్కా. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోబోతున్నారు. కాంగ్రెస్ మార్క్ పాలన చూపిస్తాం.' అని తెలిపారు.

ఆదిలాబాద్ లో రాత్రి 10 గంటల వరకూ పోలింగ్.?

ఆదిలాబాద్ జిల్లాలో పలు కాలనీల్లో ఇంకా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో అక్కడ రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, షాద్ నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ లో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. అక్కడ 217, 219 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.

కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి - పోలీసుల లాఠీఛార్జ్

సైదాబాద్ లో మలక్ పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ పై దాడి జరిగింది. పోలింగ్ ముగిసిన తర్వాత జకీర్ హుస్సేనీ కాలనీలో ఎంఐఎం అభ్యర్థి బలాలా, మరో స్వతంత్ర అభ్యర్థి దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. ఆ ఇద్దరు అభ్యర్థులపై షేక్ అక్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణలో మెజార్టీ ఆ పార్టీదే - ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఏం చెబుతోందంటే.?

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 38 - 54, కాంగ్రెస్ కు 49 -65 సీట్లు వస్తాయని ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. బీజేపీకి 5 నుంచి 13, ఇతరులు 5 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వచ్చినా, హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ కు 40.7 శాతం, బీఆర్ఎస్ కు 38.8 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతమవుతుంది - టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతమవుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. 'డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు. ఆయన త్యాగంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. మలి తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారికి ఘన నివాళి అర్పిస్తున్నా. బీఆర్ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం. ప్రజలంటే వారికి చిన్నచూపు. కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు నుంచే సంబురాలు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల సమస్యలు చూపే స్వేచ్ఛ మీడియాకు ఉంటుంది.' అని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమా.? - రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఏం చెబుతోందంటే.?

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ 46 - 56 స్థానాలు, కాంగ్రెస్ 58 - 68 స్థానాలు, బీజేపీ 4 - 9 స్థానాలు, ఇతరులు 5 - 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

తెలంగాణ ఎన్నికల్లో విజయం ఆ పార్టీదే - పోల్ స్ట్రాట్, స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ 48 - 58, కాంగ్రెస్ 49 - 59, బీజేపీ 5 - 10, ఇతరులు 6 - 8 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. అలాగే స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీఆర్ఎస్ 24 - 36, కాంగ్రెస్ 70 - 82, బీజేపీ 3 - 8 స్థానాలు, ఇతరులు 6 - 8 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు అంచనా వేసింది.

తెలంగాణ ఎన్నికలు - ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!

తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 31 - 47, కాంగ్రెస్ 63 - 79, బీజేపీ 2 - 4, ఇతరులు 5 - 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని స్థానాలంటే.? - జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇదే

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 - 55 స్థానాలు, కాంగ్రెస్ 48 - 64 స్థానాలు,  బీజేపీ 7 - 13 స్థానాలు, ఇతరులు 4 - 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎన్ని స్థానాలంటే.? - సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఈసారి 48 స్థానాలు, కాంగ్రెస్ 56, బీజేపీ 10 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది.

మధ్యప్రదేశ్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.? - ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇదే!

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్‌కి గత ఎన్నికల్లో 114 సీట్లు గెలుచుకోగా, ఈసారి ఆ సంఖ్య 125 వరకూ పెరిగే అవకాశమున్నట్లు తెలిపింది. గత ఎన్నికల్లో బీజేపీ 109 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి 9 స్థానాలు తగ్గిపోయి 100 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకోగా, ఈసారి కూడా అదే 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. మొత్తంగా కాంగ్రెస్‌కి 113 - 137 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ 88 - 112 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. 

తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే.? - పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!

తెలంగాణలో బీఆర్ఎస్ 35 - 46, కాంగ్రెస్ 62 -72 స్థానాలు, బీజేపీ 3 -8 స్థానాలు, ఎంఐఎం 6 - 7, ఇతరులు 1 - 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

రేస్ ఎగ్జిట్ పోల్స్ - అధికారం ఎవరికి దక్కుతుందంటే.?

తెలంగాణలో కాంగ్రెస్ 62 స్థానాలకు పైగా, బీఆర్ఎస్ 48 స్థానాలకు పైగా, బీజేపీ 3, ఎంఐఎం 6, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు రేస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను ఓడించబోతున్నారు - రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను ఓడించబోతున్నట్లు చెప్పారు. అధికారం శాశ్వతం అని కేసీఆర్ నమ్మారని పేర్కొన్నారు. ఓడిపోతామని తెలిసినప్పుడల్లా కేసీఆర్ నియోజకవర్గం మారుతారని అన్నారు.  

70 సీట్లకు పైగా గెలుస్తాం - కేటీఆర్

తెలంగాణ ఎన్నికల్లో 70 సీట్లకు పైగా గెలుస్తామని బీఆర్ఎస్ కార్య నిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. గతంలోనూ చాలా ఎగ్జిట్ పోల్స్ చూశామని, ఆ ఫలితాలు చూసి కార్యకర్తలు అధైర్య పడొద్దని సూచించారు. వంద శాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. 

తెలంగాణలో అధికారం ఈ పార్టీదే - ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 38 - 54, కాంగ్రెస్ కు 49 -65 సీట్లు వస్తాయని ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. బీజేపీకి 5 నుంచి 13, ఇతరులు 5 నుంచి 9 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణలో కాంగ్రెస్ కే పట్టం - ఆ సర్వే ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!

తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 21 - 31 సీట్లు, కాంగ్రెస్ 67- 78 సీట్లు, బీజేపీ 6 - 9 స్థానాలు, ఎంఐఎం 6 - 7 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.

రాజస్థాన్ లో కాంగ్రెస్ షాక్.? - ఏబీపీ ఎగ్జిట్ పోల్ అంచనా ఇదే!

రాజస్థాన్ లో అధికార కాంగ్రెస్‌ 81 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో, ఈసారి దాదాపు 20 స్థానాలు కోల్పోనుందన్నది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా. అటు బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పుంజుకుంటుందని తెలిపింది. పోయిన ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 104 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 6 స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ఈ సారి మాత్రం ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. మొత్తంగా కాంగ్రెస్‌కి ఈ సారి 71 - 91 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 94 - 114 సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. 

మిజోరంలో MNFదే అధికారం - ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

మిజోరం ఎన్నికల ఫలితాలపై ABP CVoter Exit Poll 2023 ఆసక్తికర అంచనాలు వెలువరించింది. మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్య 18కి పడిపోయే అవకాశముందని అంచనా వేసింది ఎగ్జిట్ పోల్. కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకోగా.. ఈసారి కూడా 5 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇక ZPM (Zoram Peoples Moment) పార్టీ ఈసారి 15 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇతరులు 1-2 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది ఏబీపీ సీఓటర్‌ ఎగ్జిట్ పోల్. ఈ ఎన్నికల్లో MNF 15-21 స్థానాల్లో గెలుచుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కి 2-8 సీట్లు, ZPM 12-18 సీట్లలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

ఛత్తీస్ గఢ్ లో అధికారం ఈ పార్టీదే - ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

ఏబీపీ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 41-53 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ 36-48 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇతరులు 0-4 వరకూ గెలుచుకుంటారని వెల్లడించింది. గతేడాది కాంగ్రెస్‌ 68 స్థానాలు సాధించింది. ప్రస్తుత అంచనాల మేరకు 47 సీట్లకే పరిమితం కానుంది. ఇక బీజేపీ మాత్రం బాగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 42 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

ఆరా సంస్థ సర్వే - తెలంగాణలో అధికారం ఈ పార్టీదే

తెలంగాణలో బీఆర్ఎస్ కు 39.58 శాతం ఓట్లు వస్తాయని 41 - 49 సీట్లు సాధించే అవకాశం ఉందని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్ 41.13 శాతం ఓట్లతో 58 -63 సీట్లు సాధిస్తుందని, బీజేపీ 5 -7 సీట్లు ఇతర పార్టీలు 8.82 శాతం ఓట్లతో 7 - 9 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది.

5 గంటల వరకూ 63.94 శాతం పోలింగ్ నమోదు - మెదక్ జిల్లాలోనే అత్యధికం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 39.97 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. 

బీజేపీ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో పని చేశారు - కిషన్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా తమ పార్టీ కార్యకర్తలు పని చేశారని, వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టించినా తమ పార్టీ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారని అన్నారు. అనేక చోట్ల తమ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు.

డిసెంబర్ 3న ఎన్నికల రిజల్ట్స్ - ఎగ్జిట్ పోల్స్ పై పెరిగిన ఉత్కంఠ

తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ గురువారంతో ముగిసింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. మరోవైపు, గురువారం సాయంత్రం 5:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడించవచ్చని ఈసీ తెలిపింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు సహా ప్రజలు సైతం వీటి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

వరంగల్ ఈస్ట్ లో ఉద్రిక్తత - సమయం ముగిసిందంటూ పోలింగ్ కు అనుమతించని పోలీసులు

వరంగల్ ఈస్ట్ పెరకవాడలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ ముగిసే ముందు భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. అయితే, పోలింగ్ టైం ముగిసిందంటూ పోలీసులు వారిని అనుమతించలేదు. ఈ క్రమంలో ఓటర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరగ్గా, ఇద్దరికి గాయాలయ్యాయి.

బూటు చూపించిన బీఆర్ఎస్ అభ్యర్థి - గ్రామస్థుల ఆగ్రహం, పోలీసులు లాఠీఛార్జ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఏడుళ్ల బయ్యారం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు పోలింగ్ కేంద్రం సందర్శనకు వెళ్లగా, ఆ గ్రామస్థులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సహనం కోల్పోయిన రేగా కాంతారావు, కోపంతో బూటు చూపించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆయన మీదకు దూసుకురాగా, పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

తెలంగాణలో ముగిసిన పోలింగ్ - క్యూలో ఉన్న వారికి ఓటేసే ఛాన్స్

తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కాగా, కొన్ని చోట్ల ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. కాగా, కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు క్యూలో ఇబ్బంది పడుతున్నారు. అటు, హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఓటు వేయాలని ఎన్నికల సంఘం, పలువురు ప్రముఖులు ఎంత అవగాహన కల్పించినా మార్పు రాలేదు. సమస్యాత్మక కేంద్రాల్లో 13 నియోజకవర్గాల్లోనే పోలింగ్ ముగిసింది.

కవాడీగూడలో ఈవీఎంల మొరాయింపు - మందకొడిగా పోలింగ్

కవాడీగూడలోని విద్యా విహార హైస్కూల్లో ఉన్న 88, 89 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఈవీఎంలు తరచూ మొరాయిస్తుండడంతో ఓటర్లు గంటల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓటర్లు లేక పోలింగ్ బూత్స్ వెలవెలబోతున్నాయి. 

ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు - ఆమెనే ఆదర్శం

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో 102 ఏళ్ల వృద్ధురాలు కస్తూరమ్మ ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఎన్నికల్లోనూ తాను ఓటు కచ్చితంగా వేస్తానని తెలిపారు.

కాగజ్ నగర్ లో ఉద్రిక్తత - పోలింగ్ కేంద్రం బయట బీజేపీ, బీఎస్పీ నేతల ఆందోళన

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని 90వ నెంబర్ పోలింగ్ బూత్ బయట బీజేపీ, బీఎస్పీ నాయకులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి చెందిన ఏజెంట్లు ఏకపక్షంగా ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం వారికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.

సాయంత్రం 5 గంటలకు క్లోజ్ - ప్లీజ్ వచ్చి ఓటెయ్యండి!

తెలంగాణలో కొద్దిసేపట్లో పోలింగ్ ప్రక్రియ ముగియనుండగా, ఓట్లేసేందుకు ఓటర్లు తరలిరావాలని ఎన్నికల అధికారులు పిలుపునిస్తున్నారు. సాయంత్రం 5 గంటల్లోపు వచ్చి అంతా ఓటెయ్యాలని సూచించారు.





జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు సీఈవో వికాస్ రాజ్

హైదరాబాద్ జిల్లా జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూంను సీఈవో వికాస్ రాజ్ తాజాగా పరిశీలించారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పరిశీలించారు. మొత్తం 1800 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, నాంపల్లి, గోషామహల్ పై ప్రత్యేక దృష్టి సారించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో ముఖం చాటేసిన ఓటర్లు

ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో 40 శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్ శాతం పెరగలేదు.

మంథనిలో ముగిసిన పోలింగ్ - భారీ భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

పెద్దపల్లి జిల్లా మంథనిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యాత్మక ప్రాంతం కావడంతో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా, 4 గంటల లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. మంథనిలో 288 పోలింగ్ స్టేషన్స్ ఉండగా, 2,36,442 మంది ఓటర్లున్నారు. మొత్తం 82 శాతం పోలింగ్ నమోదు కాగా 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా గత ఎన్నికల్లో 85.14 శాతం పోలింగ్ నమోదైంది. భారీ భద్రత నడుమ ఈవీఎంలను పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని జేఎన్టీయూ కాలేజీ స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు.

మల్కాజిగిరిలో ఉద్రిక్తత - ఇరువర్గాల మధ్య ఘర్షణ

మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాల సాయంతో ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఆ 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్ - క్యూలో ఉన్న వారికే ఓటేసే ఛాన్స్

రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లోని మొత్తం 600 కేంద్రాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, పినపాక, ఇల్లందు, భద్రాచలం, సిర్పూర్ టీ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, అశ్వారావుపేట, కొత్తగూడెం, ములుగులో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే, క్యూలో ఉన్న వారిని ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.

Polling Percentage upto 3PM: మధ్యాహ్నం 3 గంటల వరకూ 51.89 శాతం పోలింగ్ - జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు

రాష్ట్రంలో 3 గంటల వరకూ 51.89 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం నమోదైనట్లు చెప్పారు. ఆదిలాబాద్ 62.3, భద్రాద్రి 58.3, హన్మకొండ 49, హైదరాబాద్ 31.17, జగిత్యాల 58.6, జనగాం 62.2, భూపాలపల్లి 64.3, గద్వాల్ 64.4, కామారెడ్డి 59, కరీంనగర్ 56, ఆసిఫాబాద్ 59.62, మహబూబాబాద్ 65.05, ఖమ్మం 63.6, మహబూబ్ నగర్ 58.8, మంచిర్యాల 59.1, మేడ్చల్ 38.2, ములుగు 67.8, నాగర్ కర్నూల్ 57.5, నల్గొండ 59.9, నారాయణపేట 57.1, నిజామాబాద్ 56.5, నిర్మల్ 60.3, పెద్దపల్లి 59.2, సిరిసిల్ల 56.6, రంగారెడ్డి 42.4, సంగారెడ్డి 56.23, సిద్దిపేట 64.9, సూర్యాపేట 62.07, వికారాబాద్ 57.6, వనపర్తి 60, వరంగల్ 52.2, యాదాద్రి 64 శాతంగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. కాగా, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తి కానుంది.

Polling Percentage Upto 3PM: మధ్యాహ్నం 3 గంటల వరకూ 51.89 శాతం పోలింగ్ - మెదక్ జిల్లాలోనే అత్యధికం

తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 51.89 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల పోటాపోటీ నినాదాలు - కొడంగల్ లో ఉద్రిక్తత

కొండగల్ నియోజకవర్గంలోని రేగిడి మైలారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా, పోలీసులు ఎంట్రీతో గొడవ సద్దుమణిగింది.

వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కు చేదు అనుభవం

వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కు నిరసన సెగ తగిలింది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో పోలింగ్ పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఎమ్మెల్యే వెనుదిరిగారు.

ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన తమ్మినేని వీరభద్రం

ఓటర్ కార్డులో తప్పు వల్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తన ఓటును వేయలేకపోయారు. పాలేరులో ఆయనకు ఓటు ఉంది.

కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం  3గం. వరకు ఓటింగ్ పర్సెంటేజ్ ఇలా

కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం  3గం. వరకు  నియోజక వర్గాల వారీగా నమోదైన ఓటింగ్ పర్సెంటేజ్  
కరీంనగర్             -  53.71%
మానకొండూరు     - 62.75%
హుజూరాబాద్      - 55.16%
చొప్పదండి.           - 54.15%

పోలీసుల లాఠీఛార్జ్ - ముగ్గురికి గాయాలు

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గోపులారం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు నచ్చచెప్పినా వెనక్కు తగ్గకపోవడంతో లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఇంకా 2 గంటలే - ఓటెయ్యాలని మేయర్ విజ్ఞప్తి

హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఎన్ బీటీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటేశారు. 'ఓటేసేందుకు ఇంకా 2 గంటలే సమయం ఉంది. త్వరగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోండి.' అంటూ ట్వీట్ చేశారు.

పోలింగ్ బూత్ వద్ద తోపులాట - నలుగురికే అనుమతి

దేవరకొండ నియోజకవర్గంలోని ఎర్రగొండపల్లిలో ఓటర్లు ఓటేసేందుకు పోటెత్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓట్లు వేసేందుకు నలుగురిని మాత్రమే అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు. నలుగురు ఓటర్లు పోలింగ్ బూత్ లోకి రాగానే తలుపులు వేసి, వారు ఓటు వేసి బయటకు వెళ్లాకే మరో నలుగురికి అనుమతిస్తున్నారు.

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉరుముల శ్రీనివాస్ కి చెందిన ఏజెంట్ ఖలీద్ పై దాడికి యత్నం

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉరుముల శ్రీనివాస్ కి చెందిన ఏజెంట్ ఖలీద్ పై దాడి కి ప్రయత్నించారు మంత్రి గంగుల కమలాకర్ అనుచరులు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసు నమోదు చేస్తున్నారంటూ ఉరుముల శ్రీనివాస్ వర్గీయులు ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం

రంగారెడ్డి జిల్లా లో 29.79 శాతం పోలింగ్‌ నమోదు
రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం
రంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం 1 గంటలకు నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం వివరాలు:


ఇబ్రహీంపట్నం: 39.13 శాతం


ఎల్బీనగర్‌: 24.05శాతం


మహేశ్వరం: 33.16శాతం


రాజేంద్రనగర్‌: 23.50శాతం


శేరిలింగంపల్లి: 29.15శాతం


చేవెళ్ల (ఎస్సీ): 29.50శాతం


కల్వకుర్తి: 39.50శాతం


షాద్‌నగర్‌: 31.30శాతం

బీఆర్ఎస్ అభ్యర్థితో కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ - నారాయణ్ పేటలో ఉద్రిక్తత

నారాయణ్ పేటలో పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.  పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలను తీసుకొచ్చారంటూ ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రామ్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ - వరంగల్ జిల్లా నారాయణతండాలో ఉద్రిక్తత

వరంగల్ జిల్లా నారాయణ తండాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారని ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ - వరంగల్ జిల్లా నారాయణ తండాలో ఉద్రిక్తత

వరంగల్ జిల్లా నారాయణ తండాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారని ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

గొంగిడి సునీత భర్త కారుపై రాళ్ల దాడి - బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ

యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని కొలనుపాకలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్ కు వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు.  ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగ్గా ఘర్షణ జరిగింది. మహేందర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.

చెన్నూరులో కాంగ్రెస్ గో బ్యాక్ నినాదాలు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఇరు వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. గడ్డం వివేక్ తనయుడు ఏజెంట్ పాస్ తో పోలింగ్ బూత్ లోకి వెళ్లబోతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వాగ్వాదం జరగ్గా, పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు.

పార్టీ కండువాతో ఓటు - మంత్రి అల్లోలపై కేసు నమోదు

నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ కండువాతో ఓటు వేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు నిర్మల్ గ్రామీణ పీఎస్ లో కేసు నమోదైంది.

కమలాపూర్ లో ఓటేసిన ఈటల రాజేందర్

మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన గజ్వేల్, హుజూరాబాద్ నుంచి బరిలో నిలిచారు. మరోవైపు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రామ్ నగర్ లోని వీజే హైస్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆయన ఓటేశారు.

పటాన్ చెరులో ఇరువర్గాల మధ్య వాగ్వాదం - చెదరగొట్టిన పోలీసులు

పటాన్ చెరులో ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ సతీమణి సుధ పోలింగ్ కేంద్రం పరిశీలించడంపై బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా, పోలీసులు నేతలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం చుట్టూ ఉన్న వారిని అక్కడి నుంచి పంపించేశారు. 

ఎన్నికల సంఘానికి కిషన్ రెడ్డి లేఖ - బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. బీఆర్ఎస్ నేతలు కోడ్ ఉల్లంఘించారని, నియోజకవర్గాల్లో వందల మంది బీఆర్ఎస్ నేతలు గుమిగూడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. జనగామలో జరిగిన ఘటనను ఉదాహరణగా చూపించారు. చాలా నియోజకవర్గాల్లో అధికారులు బీఆర్ఎస్ నేతలకు సహకరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్ - నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

భాగ్యనగరంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 20.79 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 22 శాతం, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 23.5, మేడ్చల్ లో 28.25 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్ లో విషాదం - ఓటేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులు మృతి

ఆదిలాబాద్ పట్టణంలో విషాదం నెలకొంది. ఓటెయ్యడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావలకు చెందిన తోకల గంగమ్మ (78) ఓటేసేందుకు బూత్ వద్దకు రాగా పిట్స్ వచ్చాయి. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. అలాగే, భుక్తాపూర్ కు చెందిన రాజన్న (65) ఓటేసేందుకు లైన్లో నిలబడి స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఒంటిగంట వరకూ 36.68 శాతం పోలింగ్ - జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

తెలంగాణలో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్  - 41.88%, భద్రాద్రి - 39.29, హన్మకొండ 35.29, హైదరాబాద్ 20.79, జగిత్యాల 46.14, జనగామ 44.31, భూపాలపల్లి 49.12, గద్వాల్ 49.29, కామారెడ్డి 40.78, కరీంనగర్ 40.73, ఖమ్మం 42.93, కుమురం భీం 42.77, మహబూబాబాద్ 46.89, మహబూబ్ నగర్ 44.93, మంచిర్యాల 42.74, మెదక్ 50.80, మేడ్చల్ 26.70, ములుగు 45.69, నాగర్ కర్నూల్ 39.58, నల్గొండ 39.20, నారాయణపేట 42.60, నిర్మల్ 41.74, నిజామాబాద్ 39.66, పెద్దపల్లి 44.49, సిరిసిల్ల 39.07, రంగారెడ్డి 29.79, సంగారెడ్డి 42.17, సిద్ధిపేట 44.35, సూర్యాపేట 44.14, వికారాబాద్ 44.85, వనపర్తి 40.40, వరంగల్ 37.25, భువనగిరి 45.07 శాతంగా నమోదయ్యాయి.

మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 36.68 శాతం పోలింగ్ నమోదు - అత్యధికంగా ఈ జిల్లాలోనే!

తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా 20.79 శాతం నమోదైనట్లు చెప్పారు.

'నేను ఓటేశాను.. మీరు కూడా వచ్చి ఓటెయ్యండి' - హీరో విజయ్ దేవరకొండ

అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని నటుడు విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. 'నేను నా కుటుంబంతో వచ్చి ఓటేశాను. ఇళ్ల నుంచి బయటకొచ్చి అంతా ఓటెయ్యండి. మన ఉద్యోగాలు మంచిగా చేసుకుంటూ ప్రశాంత జీవనం గడపాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి.' అని పేర్కొన్నారు.

మొరాయించిన ఈవీఎం - ఓటెయ్యకుండానే వెనుదిరిగిన ఓటర్లు

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఈవీఎంల మొరాయింపుతో గందరగోళం నెలకొంది. ద్వారకానగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్ వద్ద గల పోలింగ్ బూత్ నెంబర్ 63లో గత 2 గంటలుగా ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు ఓటెయ్యకుండానే వెనుదిరుగుతున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహిళల ధర్నా - తమకు డబ్బులివ్వలేదని ఆందోళన

భద్రాద్రి జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహిళలు ధర్నాకు దిగారు. కొందరికి డబ్బులిచ్చిన వార్డు కౌన్సిలర్లు తమకు ఇవ్వలేదని పలు వార్డుల మహిళలు నిరసన తెలిపారు.

సెలవు అనుకుని పడుకొనే వాళ్లందరూ ఓటెయ్యండి - అల్లు అరవింద్, శేఖర్ కమ్ముల

ఓటు వేయడం మన బాధ్యత అని సినీ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. 'ఓటు వేయకుండా ప్రభుత్వాలను విమర్శించే హక్కు మీకు లేదు. సెలవు అనుకుని పడుకునే వాళ్లందరూ లేచి వచ్చి ఓటెయ్యండి. ఓటు వేయడం మన బాధ్యత.' అని పేర్కొన్నారు. వారు ఓటేసిన అనంతరం మాట్లాడారు. మరోవైపు, నటుడు మంచు మనోజ్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, యాంకర్ గాయత్రి భార్గవి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ అభ్యర్థి - పోలీసులతో వాగ్వాదం

హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి, సీఐ రవికుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. సైదిరెడ్డి గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి రాగా, సీఐ కండువా తీయాలని సూచించారు. అయితే, అది చేతి రుమాలని ఆయన సమర్థించుకున్నారు. దీంతో సైదిరెడ్డి, సీఐ మధ్య వాగ్వాదం జరగ్గా, చెప్పినా వినకపోవడంతో సీఐ వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో గులాబీ కండువాతోనే సైదిరెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.

మణికొండలో డబ్బులు పంచుతున్నారని ఘర్షణ - ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

హైదరాబాద్ మణికొండలో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ దగ్గర డబ్బులు పంచుతున్నారంటూ ఇరు పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ - ఈసీ కీలక ప్రకటన

కేంద్ర ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని మార్చింది. సాయంత్రం 5:30 తర్వాతే విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. గతంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ కు అనుమతి ఇవ్వగా తాజాగా సవరించింది.

Police Lottycharge in Rajendranagar: రాజేంద్రనగర్ లో టేబుల్స్, కుర్చీలతో దాడి - పోలీసుల లాఠీఛార్జ్

హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరగ్గా, టేబుల్స్, కుర్చీలు పడేసి దుర్భాషలాడుతూ, ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. 

తాండూరులో ఉద్రిక్తత - ఇరువర్గాల నేతల మధ్య వాగ్వాదం

వికారాబాద్ జిల్లా తాండూరులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.  పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ పై జనసేన అభ్యర్థి ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల నేతల మధ్య వాగ్వాదం జరగ్గా, పోలీసులు సద్దిచెప్పారు.

ఖమ్మం జిల్లాలో ఘర్షణలు - కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నాయకన్ గూడెం, జల్లేపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం ఇరు వర్గాలను చెదరగొట్టారు.

FIR on MLC Kavitha Comments: కవిత వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు - తెలంగాణ సీఈవో

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఫిర్యాదు అందినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు నివేదించామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు తెలిపారు. చెదురు మదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించగా కొత్త వాటిని మార్చినట్లు స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఈవో వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు కలిసి, ఎన్నికల నియమావళిని రేవంత్ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా మాట్లాడారని ఈసీ దృష్టికి తెచ్చారు.

99 ఏళ్ల వయసులో ఓటు వేసిన విద్యావేత్త చుక్కా రామయ్య

విద్యానగర్ లోని హిందీ మహా విద్యాలయంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఓటు వేశారు. 99 ఏళ్ల వయసులోనూ ఓటు వేసి ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఓటింగ్ ఇప్పటి నుంచి పెరగొచ్చు - సీఈవో వికాస్ రాజ్

తెలంగాణ పోలింగ్ సరళిపై సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. 11 గంటల వరకూ 20కి పైగా పోలింగ్ శాతం నమోదు కాగా, అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచి ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. కొన్ని కేంద్రాల వద్ద ఘర్షణలపై స్పందించిన ఆయన, డీజీపీతో మాట్లాడారు. ఎలాంటి ఘటనలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులు, పోలీసులను ఆదేశించారు.

పాతబస్తీలో ఉద్రిక్తత - ఎంబీటీ, ఎంఐఎం నేతల మధ్య వివాదం

హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురలో ఉద్రిక్తత నెలకొంది. ఎంబీటీ, ఎంఐఎం నేతల మధ్య వివాదం నెలకొంది. యాసిన్ అరాఫత్, కాలేద్ మధ్య గొడవ జరగ్గా పోలీసులు వారిని పోలింగ్ స్టేషన్ నుంచి పంపేశారు. 

Voting Percentage upto 11 AM: తొలి 4 గంటల వరకూ 20.64 - అత్యధికం ఈ జిల్లాలోనే!

తెలంగాణలో తొలి 4 గంటల వరకూ 20.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.65 శాతం ఓటింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ లో 12.39 శాతం నమోదైంది. భద్రాద్రి 22, హన్మకొండ 21.43, జగిత్యాల 22.5, జనగాం 23.25, కామారెడ్డి 24.70, గద్వాల్ 29.54, కరీంనగర్ 20.09, ఖమ్మం 26.03, ఆసిఫాబాద్ 23.68, మహబూబాబాద్ 28.05 శాతంగా నమోదైంది.

ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న వృద్ధులు - వీరే ఆదర్శం

తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో పలువురు వృద్ధులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. పలువురు దివ్యాంగ ఓటర్లు వీల్ ఛైర్స్ లో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, గచ్చిబౌలి GPRA క్వార్టర్స్ పోలింగ్ స్టేషన్ వద్ద శేషయ్య అనే వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో ఓటెయ్యడానికి వచ్చాడు. లివర్ సిరోసిస్ తో బాధ పడుతున్న శేషయ్య (75),  1966 నుంచి కచ్చితంగా ఓటేస్తున్నట్లు చెప్పారు.





సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ - స్వగ్రామంలో సందడి

సిద్ధిపేట మండలం చింతమడకలో సీఎం కేసీఆర్ సతీ సమేతంగా సొంత గ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ఆయన కామారెడ్డి, గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. 





చింతమడక చేరుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఓటేసేందుకు చింతమడక చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఆయన తన సతీమణితో కలిసి ఓటేసేందుకు వచ్చారు.

ఓటేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బంజారాహిల్స్ లోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ దంపతులు, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి కుమార్తెతో కలిసి ఓటేశారు.

ఉదయం 11 గంటల వరకు 20.64 శాతం పోలింగ్ - స్వల్ప ఘర్షణల మినహా పోలింగ్ ప్రశాంతం

రాష్ట్రంలో స్వల్ప ఘర్షణల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 20.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అటు, హైదరాబాద్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకూ 12.39 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. నాంపల్లిలో అత్యల్పంగా 5 శాతం, ముషీరాబాద్, ఎల్బీనగర్ లో 10 శాతం, ఛార్మినార్ లో 10 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు, నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంతో సహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణ ఓటర్లు, యువత ఓటింగ్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. 

హైదరాబాద్‌లోనే తక్కువ పోలింగ్

హైదరాబాద్‌లో పోలింగ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. 11 గంటల సమయానికి కేవలం 12.39% పోలింగ్‌ నమోదైంది. 

11 గంటల నాటికి పోలింగ్ ఎంతంటే..?

ఉదయం 11 గంటల నాటికి తెలంగాణ వ్యాప్తంగా 20.64% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 





చౌడపూర్ లో ఉద్రిక్తత - పోలీసుల లాఠీఛార్జ్

వికారాబాద్ జిల్లా చౌడపూర్ లో పోలింగ్ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల ముందే ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.  

Polling Stopped: ఈవీఎంపై ఇంక్ - నిలిచిన పోలింగ్

మహబూబాబాద్ మండలం గంగారం మండలం కోమట్లగూడెంలో పోలింగ్ నిలిచిపోయింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎం బ్యాలెట్ పై ఇంక్ అంటించాడు. దీంతో ఓ గుర్తు సరిగ్గా కనిపించకపోవడంతో అధికారులు పోలింగ్ నిలిపేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ - కర్రలతో దాడి, పలువురికి గాయాలు

అచ్చంపేట నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పదర మండలం వంకేశ్వరంలో ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలింగ్ కేంద్రం వద్ద విషాదం - గుండెపోటుతో విధుల్లో ఉన్న ఉద్యోగి మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద విషాదం నెలకొంది. ఎన్నికల విధుల్లో ఉన్న సుధాకర్ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. గత రాత్రి గుండెపోటు రాగా, తోటి సిబ్బంది సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో సుధాకర్ వెటర్నరీ విభాగంలో సహాయకుడిగా పని చేస్తున్నారు. ఈ ఉదయం సుధాకర్ మృతదేహాన్ని బంధువులకు ఎన్నికల అధికారులు అప్పగించారు.

ముథోల్ వద్ద ఉద్రిక్తత - బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం

నిర్మల్ జిల్లా ముథోల్ వద్ద పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కాషాయరంగు దుస్తుల్లో వచ్చిన ఇద్దరు ఓటర్లను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప వివాదం నెలకొనగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు.

Violation of Code: కోడ్ ఉల్లంఘన - బీఆర్ఎస్ కండువాతో ఓటు వేసిన ఎమ్మెల్యే

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం వెంకటాపూర్ లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఆయన బీఆర్ఎస్ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటెయ్యడంతో విమర్శలు వస్తున్నాయి. 

Polling Percentage in Hyderabad: తొలి 2 గంటల్లో హైదరాబాద్ లో 4.57 శాతం పోలింగ్ - అత్యధికంగా ఇక్కడే

తొలి 2 గంటల్లో హైదరాబాద్ లో 4.57 శాతం పోలింగ్ నమోదైంది. రాజేంద్రనగర్ లో అత్యధికంగా 15 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా  నాంపల్లి లో 0.5 శాతం, సనత్ నగర్ లో 1.2 శాతం, కూకట్పల్లి 1.9 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ నేపథ్యం - హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

ఎన్నికల నేపథ్యంలో స్వస్థలాలకు రాకపోకలు సాగించే ఓటర్లతో హైదరాబాద్ - విజయవాడ హైవే రద్దీగా మారింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

రాష్ట్రంలో మహిళా పోలింగ్ కేంద్రాలు - రాష్ట్ర ఎన్నికల అధికారి ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మహిళా పోలింగ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటిని ఎన్నికల కోసం సుందరంగా తీర్చిదిద్దారు. వీటి్లోల బేగంపేట సెయింట్ ఫ్రావిన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పోలింగ్ కేంద్రాల చిత్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.





కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత - ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పోలింగ్ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. షట్పల్లి పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గుమిగూడారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Clash Between Congress Leaders and Police: కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం - బీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణ

గద్వాల జిల్లా ఐజ ప్రభుత్వ పాఠశాల వద్ద పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అటు, జనగామ జిల్లా 245వ నెంబర్ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని వాళ్లను చెదరగొట్టారు.

Musical Band on Polling Booth: పోలింగ్ బూత్ వద్ద మ్యూజికల్ బ్యాండ్ - ఓటర్లను ప్రోత్సహించేలా వినూత్న యత్నం

తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఓటర్లను ఓటు వేసేందుకు ప్రోత్సహించేలా అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ ఏరియాలో గల ఓ పోలింగ్ బూత్ బయట మహిళలతో కూడిన మ్యూజికల్ బ్యాండ్ ఏర్పాటు చేశారు.





Polling Percentage: ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ - నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇదే

రాష్ట్రంలో ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం 8.11 శాతం, ఎల్బీనగర్ 5.6 శాతం, మహేశ్వరం 5, రాజేంద్రనగర్ 15, శేరిలింగంపల్లి 8 శాతం, చేవెళ్ల (ఎస్సీ) 5, కల్వకుర్తి 5, షాద్ నగర్ 7.2 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

Clash in The Polling: బోధన్ లో ఉద్రిక్తత - పోలీసుల లాఠీఛార్జ్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం నెలకొంది. విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Attack on Congress Supporters: పోలింగ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత - కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి

నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మన్ననూర్ లో  ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అలాగే, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోనూ పోలింగ్ నేపథ్యంలో వివాదం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 

KTR Comments: తెలంగాణ పౌరులంతా తమ బాధ్యత నిర్వర్తించాలి - అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వారికి ఓటు వేశానన్న కేటీఆర్

తెలంగాణలో ప్రతి పౌరుడు తమ బాధ్యతను నెరవేర్చాలని, ఓటు వేసేందుకు యువత తరలి రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ లో ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వారికే ఓటు వేశానని తెలిపారు

Rajamouli Vote: ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకధీరుడు రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆయన సతీమణి రమతో కలిసి షేక్ పేట ఇంటర్నేషనల్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటి పూనమ్ కౌర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమ ఓటు హక్కు వినియోగుంచుకున్నారు.

Boycott of Voting: ఆ గ్రామంలో ఓటింగ్ కు దూరం - పంచాయతీ చేయకపోవడంపై నిరసన

బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలం వరిపేట గ్రామస్థులు ఓటింగ్ బహిష్కరించారు. తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయకపోవడానికి నిరసనగా ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. ఉదయం 9:30 వరకూ కేవలం 12 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

Telangana Polling Updates Live 2023: ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ - ప్రశాంతంగా ఓటింగ్

తెలంగాణలో ఉదయం 9 గంటల వరకూ 7.78 శాతం పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. ఖానాపూర్, జనగాంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదం సద్దుమణిగేలా చేశారు.

ఖానాపూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ - పోలీసుల లాఠీఛార్జ్

ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. విజయమేరి పోలింగ్ కేంద్రం వద్ద వివాదం నెలకొనగా, ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. ఓటు వేసిన సమయంలో ఆమె బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. దీనిపై ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

జనగామలో ఉద్రిక్తత - బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

జనగామలో ఉద్రిక్తత నెలకొంది. 244వ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. పోలింగ్ సరళి పరిశీలిస్తున్న క్రమంలో తోపులాట జరిగింది.

ఓటు వేయని వారు గుర్తింపు కార్డు రద్దు చేయాలి - నటుడు శివాజీ రాజా

ఓటు వేయని వారి గుర్తింపు కార్డు రద్దు చేయాలని ప్రముఖ నటుడు శివాజీరాజా అన్నారు. 'ఈ రోజు సెలవు దినంగా వాడుకోవడం అన్యాయం. రెండుసార్లు ఓటు వేయని వ్యక్తుల పాస్ పోర్ట్ దగ్గరి నుంచి ప్రభుత్వ గుర్తింపు కార్డు రద్దు చేయాలి. వృద్ధులు ఉత్సాహంగా ఓటెయ్యడానికి వస్తున్నారు. యువత కూడా ముందుకు రావాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం అభివృద్ధి కొనసాగుతుందని ఆశిస్తున్నా.'  అని పేర్కొన్నారు.

అది ప్రభుత్వ స్ట్రాటజీ - నాగార్జున సాగర్ వివాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి

నాగార్జున సాగర్ వివాదం ప్రభుత్వ స్ట్రాటజీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కావాలనే పోలింగ్ ముందు ఇలా సృష్టించారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సమస్యను అర్థం చేసుకున్నారని అన్నారు. 'సాగర్ డ్యామ్ ఎక్కడికీ పోదు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వివాదం పరిష్కరిస్తాం.' అని పేర్కొన్నారు. 

ఓటేసిన ప్రముఖులు - కొన్నిచోట్ల ఈవీఎంల మొరాయింపు

తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సనత్ నగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో నటుడు చిరంజీవి ఆయన భార్యతో కలిసి ఓటు వేశారు. నటుడు వెంకటేశ్, దర్శకుడు తేజ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పిలుపునిచ్చారు. 

Nagarjuna Sagar Dam Issue: నాగార్జున సాగర్ డ్యాం వ్యవహారంపై స్పందించిన వికాస్ రాజ్

నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరుగుతున్న హైటెన్షన్ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పందించారు. రాజకీయ నేతలు ఎవరూ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. డ్యాం దగ్గర జరుగుతున్న వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని చెప్పారు.

Telangana Elections News Live: ఓటు వేయడానికి ముందు పొన్నం ప్రభాకర్ సందేశం

తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఓటు వేయడానికి ముందు పొన్నం ప్రభాకర్ సందేశాత్మకంగా వ్యవహరించారు. గ్యాస్ సిలిండర్ కి పూజలు చేశారు. రూ.500 పెట్టి అలంకరణతో పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ వస్తే రూ.500/- కే సిలిండర్ వస్తుందనే సందేశం వచ్చేలా పొన్నం ప్రభాకర్ వ్యవహరించారు.





DGP Anjani Kumar on Elections: 70 వేల మంది పోలీసులతో ఎన్నికల కోసం భద్రత - డీజీపీ

‘‘తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశాం. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హోంగార్డ్ సిబ్బంది, కేంద్ర బలగాలతో బందోబస్త్ ఏర్పాటు చేశాం. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. నేను నా భార్య ఇద్దరం మా ఓటు హక్కును వినియోగించుకున్నాము. మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పిలుపు ఇచ్చారు.


Telangana Elections Live: కండువాతో పోలింగ్ బూత్లోకి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ బిఅర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ కు కండువాతో వెళ్లడం ఏంటని, ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

Adilabad Elections News Live: ఓటు హక్కును వినియోగించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి 

నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లపల్లిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు అనేది ప్రతి సామాన్యుని హక్కు అని, భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడింది. టాటా బిర్లా కు అయిన సామాన్యులకైన ఓటు హక్కు ఒకటే అని, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకావాలన్నారు. 

Telangana Elections News Live: బర్కత్ పురలో ఓటు వేసిన జి.కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. హైదరాబాద్ బర్కత్ పురలోని ఓ కేంద్రంలో కిషన్ రెడ్డి ఓటు వేశారు.





Allu Arjun Voting: జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ సెంటర్‌లో ఓటు వేసిన అల్లుఅర్జున్ ఫ్యామిలీ

జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45 సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌లో అల్లుఅర్జున్, భార్య స్నేహా రెడ్డి, అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులు ఓటు వేశారు.





MLC Kalvakuntla Kavitha: బంజారాహిల్స్ ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని నంది నగర్ సమీపంలో ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.





ప్రజాస్వామ్య పండగలో భాగమవుదాం.. తెలంగాణ ప్రజలకు మోదీ పిలుపు









ప్రజాస్వామ్యం పండగలో ఓటు మన బలాన్ని మరింత పెంచుతుంది. అక్కచెల్లెమ్మలు, సోదరులు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి. అని తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు కూడా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు వినియోగించుకోవాలన్నారు. 









ఓటేసిన నటుడు ఎస్‌ఎస్‌ కంచి

Jr NTR Voted in Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ దంపతులు జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారి వెంట ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా ఉన్నారు. ఓటు వేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, షాలిని కాసేపు క్యూలైన్ లో నిలబడ్డారు.


Telangana Polling Live Updates: సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసే ప్రాంతాలు ఇవే..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా ప్రాంతాల్లో 5 గంటల వరకూ ఉంటుంది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతాల్లో మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది.

Telangana Assembly election 2023: తెలంగాణలో పోలింగ్ ప్రారంభం

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, అంతకుముందు నుంచే కొన్ని చోట్ల ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. 

Telangana Election Live News: దుబ్బాకలో అర్ధరాత్రి రఘునందన్ రావు ఆందోళన

తెలంగాణలో పోలింగ్‌ మరికొద్ది గంటల్లో మొదలు అవుతుందనగా దుబ్బాక పట్టణ పోలీస్ స్టేషన్‌ ఎదుట అర్ధరాత్రి దాటాక బీజేపీ స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు నిరసన చేశారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. దుబ్బాకలోని 16వ వార్డులో బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నించిన బీజేపీ నేతలపై దాడి చేశారని ఆరోపించారు. దీంతో సిద్దిపేట సీపీ శ్వేత అక్కడికి చేరుకున్నారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

Telangana Elections Polling: మొత్తం బరిలో ఉన్న అభ్యర్థులు వీరే..

119 నియోజకవర్గాల్లో మొత్తం బరిలో ఉన్న అభ్యర్థులు - 2,290
పురుషులు - 2,068
మహిళా అభ్యర్థులు - 221
ట్రాన్స్‌జెండర్ - 1


మొత్తం ఓటర్లు - 3,26,18,205 మంది
పురుషులు - 1,62,98,418
మహిళలు - 1,63,01,705


మొత్తం బీఆర్ఎస్ పోటీ చేస్తున్న స్థానాలు - 119
బీఆర్ఎస్ అభ్యర్థులు - 118 (కేసీఆర్ రెండు చోట్ల)
ఎంఐఎం స్థానాలు - 9


మొత్తం కాంగ్రెస్ పోటీ చేస్తున్న స్థానాలు - 118
కాంగ్రెస్ అభ్యర్థులు - 117 (రేవంత్ రెడ్డి రెండు చోట్ల)
సీపీఐ - 1


మొత్తం బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలు - 111
బీజేపీ అభ్యర్థులు - 110 (ఈటల రాజేందర్ రెండు చోట్ల నుంచి)
జనసేన స్థానాలు - 8


బీఎస్పీ పోటీ చేస్తున్న స్థానాలు - 107
అభ్యర్థులు - 107
సీపీఎం పోటీ చేస్తున్న స్థానాలు - 19

Background

Telangana Assembly Election 2023 LIVE updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేడు (నవంబరు 30) ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయం చింతమడకకు వెళ్తున్నారు. చింతమడక గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో తన సతీమణితో కలిసి సీఎం కేసీఆర్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం ఉదయం 7.30 గంటలకు SR నగర్‌లో నారాయణ జూనియర్ కళాశాల, పోలింగ్ స్టేషన్ నంబర్ 188లో కుటుంబ సమేతంగా ఓటు వేయనున్నారు. మంత్రి హరీష్ రావు దంపతులు సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లో ఉదయం 7-8 గంటల మధ్యలో ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.


కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లోని zphsలోని పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు..
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు కోదాడ లోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్ లో ఓటు వేయనున్నారు..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర పట్టణంలోని సుబ్దరయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేయనున్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పట్టణంలో వేయనున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో Both No - 160లో ఓటు వేయనున్నారు. 
ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి గారు సంగారెడ్డి పట్టణంలో ఓటు వేయనున్నారు.


అలాగే సెలబ్రిటీలు రేపు (నవంబర్ 30) ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తున్నారనే విషయాలు బయటికి వచ్చాయి.


జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ 
(పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌ 
ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌ 
పోలింగ్‌ బూత్‌ (160):  విశ్వక్‌సేన్‌ 
పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు
జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌ 
ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ (పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ 
ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి
బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ 
వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ (పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌
మణికొండ: హైస్కూల్ ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం 
షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: రాజమౌళి రామారాజమౌళి 
రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌
యూసఫ్‌ గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి


ఈసీ తెలిపిన వివరాల ప్రకారం..  తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1,62,98,418 మంది పురుషులు ఉన్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.  ట్రాన్స్ జెండర్లు ఓటరు 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 15,406, ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. కొత్త వారి సంఖ్య 9,99,667. రాష్ట్రంలో మొత్తం 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఎల్బీనగర్‌లో 4 బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. 56,592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తున్నారు.  2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాలను గెలుచుకుంది, 19 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, AIMIM 7 సీట్లు, టీడీపీ 2, బీజేపీ ఒక్క సీటు నెగ్గాయి. AIFB, ఒక స్వతంత్ర అభ్యర్థి సైతం గెలుపొందారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.