KCR Announced first list of BRS candidates: 


2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడు చోట్లే అభ్యర్థులను మర్చినట్టు కేసీఆర్ తెలిపారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, వైరా, మెట్ పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చినట్లు చెప్పారు. ఏడుగురిని మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయని, ఎక్కువ మార్పులు ఉండవని చెప్పినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. 


వేములవాడ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు నిరాశ ఎదురైంది. హుజూరాబాద్‌ టికెట్ కౌశిక్‌రెడ్డికి ఇచ్చారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. పౌరసత్వం సమస్య ఉన్న కారణంగా వేములవాడలో చెన్నమనేని రమేష్ కు అవకాశం ఇచ్చారు. ఆయన స్థానంలో వేరే లీడర్‌కు చోటు కల్పించారు. కోరుట్లలో విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు సంజయ్ కు అవకాశం ఇస్తున్నారు. వయోభారంతో విద్యాసాగర్‌రావు తప్పుకుంటున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి టికెట్ ఇవ్వగా, మాజీ మంత్రి టి. రాజయ్యకు నిరాశే ఎదురైంది.  బోథ్ నుంచి రెండు సార్లు కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కుకు మత్రమే.. కానీ టిక్కెట్ నిరాకరించారు. 


ఈసారి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గా నుంచి కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో లాస్య నందితకు ఛాన్స్ ఇచ్చారు. అక్టోబర్ 16న వరంగల్ లో పెద్ద ర్యాలీకి బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అదే రోజు మ్యానిఫెస్టో విడుదల చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఈసారి 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిలో ఉన్న మొత్తం 29కి 29 స్థానాల్లో బీఆర్ఎస్, ఎంఐఎం ఘన విజయం సాధిస్తాయని ఆకాంక్షించారు.


అభ్యర్థుల లిస్ట్ ఇదే 












కొల్లాపూర్‌లో మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. దీంతో అక్కడ హర్షవర్థన్ రెడ్డికి పోటీ లేదు.  ఇక ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి.. మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డికి పార్టీ లోని ఇతర సీనియర్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా..తమకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టినా  కేసీఆర్ సిట్టింగ్‌లకే ఓకే చెప్పారు.  2018లో అచ్చొచ్చిన ఫార్ములానే కేసీఆర్ రిపీట్  చేస్తుననారు.  ప్రజా వ్యతిరేకత, వర్గ విబేధాలు, క్యాడర్‌తో ఇబ్బందులు ఇలా అన్నీ బేరీజు చేసుకున్న తర్వాత సర్వే చేయించగా.. కేసీఆర్ టిక్కెట్లను ఖరారు చేశారు. 


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య,  అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వరరావు గెలిస్తే .. ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరే ముందే వారికి కేసీఆర్ టిక్కెట్ల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీని నిలుపుకునేందుకు వారికి టిక్కెట్లను ప్రకటించారు.      


అభ్యర్థులను మార్చిన నియోజక వర్గాలు 


వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్, వైరా, మెట్ పల్లి, ఉప్పల్ 


నాలుగు నియోజక వర్గాలకు త్వరలో అభ్యర్థుల ప్రకటన 
జనగామ
నర్సాపూర్
నాంపల్లి
గోశామహల్