Chandra Babu Met With Amit Shah In Delhi: ఢిల్లీలో ఉన్న టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు అర్థరాత్రి కేంద్ర హోం మంత్రి(Central Home Minister) అమిత్‌షాతో సమావేశమయ్యారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యేలా ఉంది. 


ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పొత్తుల విషయంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అర్థరాత్రి అమిత్‌షాతో మంతనాలు జరిపారు. 11.25 గంటలకు అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఉన్నారు. ఈ సమావేశం 12.16 నిమిషాలకు ముగిసింది. 


 ఈ సమావేశంలో ఏం చర్చకు వచ్చాయి. దేనిపై మాట్లాడుకున్నారో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. బీజేపీకి దేశాభివృద్ధి ముఖ్యమని... తమకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏం చేసినా రాష్ట్రం కోసమే చేస్తామని పేర్కొన్నారు. దూరమైపోయిన ఎన్డీఏ భాగస్వామలును మళ్లీ దరి చేర్చుకుంటోంది బీజేపి. అందులో భాగంగా ఇప్పటికే నితీష్‌ లాంటి వ్యక్తితో మళ్లీ జత కట్టింది. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధిస్తుందని చెబుతున్నప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటోందని అంటున్నారు. 


అందులో భాగంగానే చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఆయన సాయంత్రం ఏడున్నర గంటలకు అమిత్‌షాతో సమావేశమవుతారని ప్రచారం జరిగింది. అయితే పార్లమెంట్‌ సమావేశాలు ఆలస్యంగా ముగియడంతో చంద్రబాబు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతకు ముదు సాయంత్రం ఆరున్నరకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత గల్లా జయదేవ్‌ ఇంటికి వెళ్లారు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశమై కీలకమైన మంతనాలు చేశారు. తర్వాత అర్థరాత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.


నేడు పవన్‌తో మంతనాలు 
జనసేన అధినేత కూడా ఢిల్లీ పయనమయ్యారు. బీజేపీ అధిష్ఠానంతో మంతనాలు జరుపనున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. సీట్ల విషయంలో చర్చ నడుస్తున్నాయి. ఇంతలో బీజేపీ నుంచి పిలుపురావడంతో ఇరువురు నేతలు ఢిల్లీ వెళ్లారు.