Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు విజయ్‌దేనంటున్న యాక్సిస్ మై ఇండియా సర్వే
Exit Poll Results Live Updates: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలవుతున్నాయి. ఆరున్నర నుంచి వివిధ సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తాయి.
KhageshLast Updated: 29 Apr 2026 07:53 PM

Background
Assembly Elections 2026 Exit Poll Results Live Updates: భారత్ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించే కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమెంబగాల్లో చివరి దశ పోలింగ్ ముగియడంతో అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్‌పై పడ్డాయి....More
Assembly Elections 2026 Exit Poll Results Live Updates: భారత్ రాజకీయ ముఖచిత్రాన్ని నిర్ణయించే కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. పశ్చిమెంబగాల్లో చివరి దశ పోలింగ్ ముగియడంతో అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్‌పై పడ్డాయి. తమిళనాడు, పశ్చమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్ల నాడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అటు రాజకీయ పార్టీల్లోనూ ప్రజల్లో ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. ఇంకా లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తున్నందున మరో అరగంటను గ్రేస్ పిరియడ్‌గా ఇస్తారు. అందుకే ఆరున్నర నుంచి వివిధ ఏజెన్సీలు సీట్ల అంచనాలను ఓట్ల శాతాన్ని ప్రకటించడం ప్రారంభిస్తాయి. వీటి కోసం ఏబీపీ దేశం వెబ్‌సైట్‌తోపాటు నెట్వర్క్ సైట్లను చూడవచ్చు. తమిళనాడులో 234 స్థానాలకు జరిగిన పోరులో ప్రధానంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే మధ్య గట్టి పోటీ ఉంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొలత్తూరు నుంచి ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళని స్వామి ఎడప్పాడి నుంచి పోటీ చేశారు. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమళగ వెట్రి కజగం ఈసారి ఎన్నికల్లో కొత్త సమీకరణాలను సృష్టించింది. గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133 సీట్లు సాధించింది. దాని కూటమి 159 సీట్లు సాధించింది. అన్నా డీఎంకే 66 సీట్లకే పరిమితమైంది. పశ్చిమ బెంగాల్ టైగర్ ఎవరు పశ్చిమ బెంగాల్ 294 సీట్ల కోసం జరిగిన హోరాహోరీ పోరులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, బీజేపీ మధ్య పోరు సాగింది. భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. టీఎంసీ తన సంక్షేమ పథకాలపై నమ్మకం పెట్టుకోగా, బీజేపీ ఉత్తర బెంగాల్లో తన పట్టును నిపులుకుంటుూ దక్షిణ బెంగాల్లో కొత్త స్థానాల్లో పట్టు సాధించాలని చూస్తోంది. బెంగాల్లో తొలి దశలోనే రికార్డు స్థాయిలో 93.19 శాతం ఓటింగ్ నమోదు అయింది. రెండో విడత పోలింగ్‌లో కూడా అదే స్థాయి రికార్డు నమోదు అవుతుంది. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. అక్కడ హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ కసితో ఉంది. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోరు ఉంది. ఇక్కడ బీజేపీ కూడా ఉనికి చాటుకోవాలని ట్రై చేసింది. పుదుచ్చేరీలో ఇక్కడ ఎన్డీఏ, ఇడీ కూటమి మధ్య పోటీ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటీ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు పడితే అప్పుడు విడుదల చేయడానికి లేదు. సెక్షన్ 126ఏ ప్రకారం దశలవారీగా ఎన్నికలు జరుగుతున్న టైంలో చివరి దశ పోలింగ్ ముగిసిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రజల నాడిని తెలియజేసినప్పటికీ తుది ఫలితాలు మాత్రం మే 4న వెల్లడవుతాయి. అప్పటి వరకు ఈ అంచనాలపై చర్చలు, విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి.
Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు విజయ్‌దేనంటున్న యాక్సిస్ మై ఇండియా సర్వే
Assembly Elections 2026 Exit Poll Results Live Updates: తమిళనాడు రాజకీయాల్లో యాక్సిస్ మై ఇండియా సర్వే సంచలనం సృష్టిస్తోంది. ఆ సంస్థ ఇచ్చిన సర్వాలో విజయ్ పార్టీకి 98 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటాడని చెబుతోంది. ఇప్పటి వరకు అన్ని సర్వే సంస్థలు డీఎంకేదే పీటమని చెబుతుంటే ఇప్పుడు తాజాగా వచ్చిన యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రభంజనం సృష్టిస్తోంది.