Elections 2024 :  వైసీపీ అధినేత , సీఎం జగన్ మానసిక స్థితిపై షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. అద్దం పంపిస్తున్నానని అందులో చూసుకోవాలని సలహా ఇచ్చారు. అద్దంలో మీకు మీ మొహం కనిపిస్తుందా ? చంద్రబాబు కనిపిస్తుందా ? చెప్పాలన్నారు.  తాను చంద్రబాబు తో చేతులు కలిపినట్లు ..కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయా ..  ఒక్క సాక్ష్యం అయినా...ఒక్క ఆధారం అయినా చూపించ గలరా అని సవాల్ చేశారు.  జగన్ ఒక భ్రమలో ఉన్నాడు... జగన్ ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉంది..  జగన్ వైఖరి మాలోకం ను తలపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


నా జన్మకు చంద్రబాబును ఒక్క సారే కలిశాను ! 


నా జన్మ కి నేను చంద్రబాబు ను ఒక్కసారి మాత్రమే కలిశానని.. నా కొడుకు పెళ్లి కి పిలవడానికి మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు.  ఆనాడు YSR కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడని గుర్తు చేసుకున్నారు.  ఆ స్ఫూర్తి తోనే నేను చంద్రబాబు ను పిలవడానికి వెళ్లానని.. నేను 5 నిమిషాలు కూడా ఏనాడూ చంద్రబాబుతో మాట్లాడలేదన్నారు.  చంద్రబాబు చెప్తే నీకోసం 3200 KM పాదయాత్ర చేశానా  అని జగన్ ను నిలదీశారు.  బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ ఆయన చెబితే చేశానా అని మండిపడ్డారు. 


అందరూ చంద్రబాబు చెప్పినట్లే వింటారా ? 


సునీత, రేవంత్ రెడ్డి  కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట అని షర్మిల ఎద్దేవా చేశారు.  బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మ్యానేజ్ చేశాడట .. చంద్రబాబు ఎంత పవర్ ఫుల్ అయ్యారో...ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలని జగన్ కు సూచించారు. జగన్ మానసిక పరిస్థితి పై నాకు ఆందోళన గా ఉందన్నారు.   


వివేకా హత్యలో న్యాయం కోసం పోరాటం ! 


తండ్రి పేరుని సీబీఐ ఛార్జిషీటులో చేర్చాలంటూ మూడు కోర్టులు తిరిగిన వ్యక్తికి ఏఏజీ పదవిని అప్పజెపుతారా అని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆయన సోదరి, ఏపీసీసీ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తన ప్రశ్నకు జగన్  సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పదవిని ఇచ్చారని. ఈ నిర్ణయం జగన్ మేరకు జరగకపోతే పొన్నవోలుకు ఈ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆమె అన్నారు. జగన్ ఆదేశాల మేరకే పొన్నవోలు కోర్టులకు తిరిగారని చెప్పడానికి ఈ పదవే ఒక రుజువని షర్మిల వ్యాఖ్యానించారు. తన తండ్రి పేరుని సీబీఐ ఛార్జిషీటులో చేర్చాలంటూ కోర్టులకు తిరిగిన వ్యక్తికి తానైతే అలాంటి పదవిని ఇవ్వబోనని ఆమె స్పష్టం చేశారు.  ‘‘ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి చెబుతున్నాను. రాజశేఖర్ రెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఛార్జిషీటులో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్ పట్టుబట్టి చేర్చారు. అయితే ఇప్పుడు నేను మాటలు మార్చినట్టుగా పొన్నవోలు నా పాత వీడియోలను వెతికి మరీ చూపిస్తున్నారు. నన్ను ఊసరవెళ్లిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ రోజు నిజం తెలియక మేము అలా మాట్లాడాం. ఈ రోజు నిజం తెలిసింది కాబట్టి ఈ మాట మాట్లాడుతున్నామన్నారు. 


వైఎస్ హత్యపైనా జగన్ తప్పుడు ప్రచారాలు 


YSR మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని  జగన్ కూడా ఆరోపణలు చేశారని రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేశారని గుర్తు చేశారు.  జగన్ సిఎం అయ్యాక రెలియన్స్ చెప్పిన వాళ్లకు రాజ్యసభ ఇచ్చారని..   తాను చెప్పింది అబద్ధం అని నిరూపించుకున్నారన్నారు. వివేకా హత్య తర్వాత చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణ చేశాడు .. CBI విచారణ చేయాలని డిమాండ్ చేశాడన్నారు.  సీఎం అయ్యాక CBI విచారణ వద్దు అన్నారని..   నిజంగా చంద్రబాబు హస్తం ఉంటే ఎందుకు CBI విచారణ వద్దు అన్నారని ప్రశ్నించారు.   నేను YSR బిడ్డను....నేను ఎంత మొండి దాన్నో జగన్ కి తెలుసని..   నేను ఎవరో కంట్రోల్ చేస్తే తిరిగే వ్యక్తి కాదని..   నాకు ఎవరో ఏదో చెప్తే నమ్మే వ్యక్తిని కాదని షర్మిల స్పష్టం చేశారు.