Elections 2024 :  తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరడంతో  బీజేపీ పోటీ చేసే స్థానాల సంఖ్య పరిమితంగా ఉంది. పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ సీట్లలో పోటీ చేస్తున్నారు. అయితే పలువురు సీనియర్లకు టిక్కెట్లు లభించలేదు. దాంతో వారంతా అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరిగింది. వారంతా ప్రచారానికి దూరంగా ఉన్నారని సోషల్ మీడియాలో కొన్ని పార్టీల సానుభూతిపరులు చెప్పుకుంటున్నరాు.  కానీ వారంతా పార్టీ విజయం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. బీజేపీ వారికి ప్రత్యేకమైన ప్రచార బాధ్యతలు ఇచ్చింది . వారి బాధ్యతల్ని వారు నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు. 


పార్టీలో స్థాయి, అనుభవాలను బట్టి ప్రచారం, ఎలక్షనీరింగ్ బాధ్యతలు అప్పగించారు. ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు జీవీఎల్ నరసింహారావు వంటి వారు ప్రచారం చేస్తున్నారు. రాయలసీమలో బీజేపీ పోటీ చేస్తున్న ధర్మవరం, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోనూ ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానమంత్రి పర్యటనలోనూ పాల్గొన్నారు. 


విజయవాడలో ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన రోడ్ షోలో  కీలకమైన సమన్వయం బాధ్యతలను విష్ణువర్దన్ రెడ్డికి పార్టీ అప్పగించింది. ఆయన సమర్థంగా వాటిని నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం మోదీ చేరుకున్నప్పుడు..ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుని హోదాలో స్వయంగా స్వాగతం పలికారు. 


 





 


టిక్కెట్లు లభించలేదన్న అసంతృప్తిని ఒక్క రోజుకే సీనియర్లు మర్చిపోయారు. పార్టీ గెలుపు కోసం పార్టీ అప్పగించిన విధుల్ని సీరియస్ గా నిర్వహిస్తున్నారు. బీజేపీలో  పార్టీ నేతలకు స్పష్టమైన పని విభజన, ప్రచార బాధ్యతలు ఉంటాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున.. సీనియర్ల ప్రచారానికి మీడియాలో పెద్దగా ప్రచారం దక్కడం లేదు. అందుకే వారు ఇంకా  ప్రచారంలో యాక్టివ్ గా లేరని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం మాత్రం ఏపీ బీజేపీ నేతలంతా కూటమి అభ్యర్థుల కోసం .. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. విష్ణువర్దన్ ెడ్డి లాంటి సీనియర్ నేతలకు హెలికాఫ్టర్ సౌకర్యాన్ని కూడా కల్పించారు.