Secunderabad Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం చూపలేదు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి గెలుపొందారు. ఈయన దాదాపు 49,944 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం ఓట్లు కిషన్ రెడ్డికి 473012 ఓట్లు పోలవగా.. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ 423068 ఓట్లు సాధించారు. వీరి మధ్య ఓట్ల తేడా దాదాపు 49944 గా ఉంది. మూడో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ కు 129586 ఓట్లు వచ్చాయి.
గెలుపు పత్రం అందజేత
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన కిషన్ రెడ్డికి రిటర్నింగ్ ఆఫీసర్ హేమంత్ కేశవ్ పటేల్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. మంగళవారం రాత్రి ఈ పత్రాన్ని ఆయన నుంచి కిషన్ రెడ్డి అందుకున్నారు.