Sajjala On EC :  కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదని.. కానీ  కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నామని..   ఇప్పటికైనా  ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచిందని సలహా ఇచ్చారు. కౌంటింగ్ ప్రక్రియ  సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందని ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాారు.


ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం !                 


ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నామన్నారు.  తెలుగుదేశం కూటమి వలనే హింస జరిగిందని ఆరోపించారు. ఈసీ ద్వారా బదిలీ చేయించి వారు చెప్పిన అధికారుల్ని  నియమించారని.. వారే ఘర్షణలకు కారణమయ్యారన్నారు.  ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేనన్నారు.  


ఓటింగ్ పెరిగితే వైసీపీ ఓడిపోతుందని టీడీపీ అనుకుంటోంది !                                        


ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని సజ్జల తెలిపారు.  గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామన్నారు. తమ సంప్రదాయ ఓటు  బ్యాంక్ చెక్కు చెదలేదని..  పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే  వైసీపీ  ఓడిపోతుందన్న భ్రమలో టీడీపీ ఉందన్నారు.  మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు.  ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదన్నారు.  వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా అని ప్రశ్నించారు. 


తనను చూసి ఓటు వేయాలని  జగన్ అడిగారు !                                  


సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. తనను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారన్నారు.  చంద్రబాబు పూర్తిగా నెగిటివ్‌ క్యాంపెన్‌ చేశారని విమర్శించారు.  ల్యాండ్‌ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారని.. విమర్శించారు.  పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయమని..  దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.   వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు  రాస్తున్నారని ఆరోపించారు.