Elections 2024 : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి విషప్రచారం చేస్తున్నారన్నారని తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు. 2019లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు టీడీపీ మద్దత్తిచ్చిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రాష్ట్రంలో అసత్యలు ప్రచారం చేసి భయభ్రాంతులను సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందన్ని వీళ్లు మనుషులా పిశాచాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని బాబు జిరాక్స్ కాపీలంటున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని ప్రశ్నించారు. స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదు?.
చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూములు సమస్యను సీఎం జగన్ పరిష్కరించారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కూడా భూములు కొన్నారు. మరి పత్రాలు జిరాక్స్ కాపీలేనా అని ప్రశ్నించారు. భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తి అయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుందని ఇంకా అమల్లోకి రాలేదన్నారు. మొత్తం సర్వే పూర్తయిన తర్వాతనే అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే ఈ చట్టం విషయంలో టీడీపీ పేర్కొన్న ప్రధాన అభ్యంరతారలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించలేదు. అసెంబ్లీలో చట్టం పెట్టినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ గా ఎవరు ఉండాలన్న ది వేరుగా ఉందని.. తర్వాత చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. హడావుడిగా చట్టంలో మార్పులు చేసి ఏ వ్యక్తినైనా నియమించవచ్చునని మార్చారని అంటున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రాష్ట్రంలోని భూములను సీఎం జగన్ దోచుకుంటారని వారు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ ఇల్లు మీది కాదు.. మీ భూములు మీవి కావంటూ లోకేశ్ కూడా ఆరోపణలు చేశారు. ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఈ చట్టం ద్వారా జగన్ మోహన్ రెడ్డి మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టే అవకాశముందని లోకేశ్ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.