Telangana Politics :   2021 లో దేశ జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.   మోడీ అమిత్ షా లు జనగణన చేయకుండా అడ్డు కుంటున్నారని..  జనాభా లెక్కింపు జరిగితే పెరిగిన జనాభా కు అనుకూలంగా కులాలకు రిజర్వేషన్లు పెంచాలి కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేయలేదన్నారు.  400 సీట్లు వస్తే పార్లమెంటు లో పూర్తి మెజారిటీ వుంటుంది కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారుని ఆరోపించారు. అసిఫాబాద్ లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా రేవంత్ రెడ్డి  ప్రచారం నిర్వహించారు.  మీ ఓటు తో... సీటు గెలిచి మీ రిజర్వేషన్లు రద్దుచేయాలని బీజేపీ పార్టీ మోడీ చూస్తున్నారని ఆరోపించారు.  కాబట్టి ప్రజలు ఆలోచించు కోవాలన్నారు.  ఇవన్నీ నేను అడిగితే ఢిల్లీ పోలీసుల తో నరేంద్ర మోడీ నాకు నోటీసులు పంపించిండని..  ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు రేవంత్ రెడ్డి భయపడడని ప్రకటించారు.  బీజేపీ కుట్ర రాజకీయాలను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునచ్చారు. 
 
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని రేవంత్ రెడ్డి  అన్నారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం అభివృద్ధి కోసం నిధులు కేటాయించామన్నారు. ఆదిలాబాద్‌లో సీసీఐ మూతపడినా ఏనాడూ ప్రధాని మోడీ, కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్న పదేళ్లలో ఆదిలాబాద్‌కు మోడీ, కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు.  తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. తప్పించుకునే ప్రయత్నం తాము చేయలేదని.. బాధ్యతగా భావించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అన్నారు. బలహీన వర్గాల కులగణను చేస్తున్నట్లు ప్రకటించారు. 

  
కాంగ్రెస్ పార్టీ నుంచి 8 రాష్ట్రాలను బీజేపీ బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. దేశంలో 15 రాష్ట్రాలు ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు అని చెప్పారు. ఆ కుట్రలో భాగంగానే 8 రాష్ట్రాలను లాక్కుందని అన్నారు.పేద ఆదివాసీ బిడ్డ ఆత్రం సుగుణ కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గా అవకాశం ఇచ్చిందని..  మొదటిసారి ఆదిలాబాద్ ఎంపీ గా పోటీ చేసే అవకాశం మహిళ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు.  మంత్రి సీతక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజల కోసం అహర్నిశలు కష్ట పడుతున్నారని..  గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యలను కేసీఆర్ ఎన్నడు పట్టించుకోలేదని..  ఆదివాసీ పట్ల గోండ్ ల పట్ల కొమురం బీం పట్ల బీజేపీ చిన్నచూపు చూసిందన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ కు సమస్యల పట్ల అవగాహన ఉందని గెలిపిస్తే ఆదివాసీల కోసం నిరంతరం శ్రమిస్తారన్నారు. 


రేవంత్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. అసిఫాబాద్ సభలోనే అదే ప్రచారం చేస్తారు. బీజేపీ ఏమిచ్చిదంటే.. గాడిద గుడ్డు ఇచ్చిందని ప్రజలతో నినాదాలు చేయించారు.