MP Candidates Assets: గుంటూరు(Guntur) జిల్లాలో లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులు ఒకరికొకకరు ఆస్తుల్లో పోటీపడుతున్నారు. అసెంబ్లీ అభ్యర్థులను మించి ఆస్తులు కూడబెట్టారు. ఇక గుంటూరులో ఇద్దరు కోటీశ్వరుల మధ్య పోటీ నువ్వానేనా అనేట్లు ఉంది...


కోట్లకు పడగలెత్తిన ఎంపీ అభ్యర్థులు
వైసీపీ(Ycp) తరఫున గుంటూరు లోక్‌సభకు పోటీచేస్తున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు( Kilaru Rosaiah) 81 కోట్ల ఆస్తి ఉండగా...15 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయి. ఐదున్నర కోట్ల విలువైన బాండ్లు, షేర్లు ఉండగా..మూడుకోట్లు పర్సనల్‌ లోన్‌ ఎమౌంట్ ఉంది. మొత్తం చరాస్తుల విలువ 12 కోట్లు ఉంది. అలాగే 4 కోట్ల విలువైన వ్యవాయ భూములు ఉండగా...30కోట్ల విలువైన ఇల్ల స్థలాలు ఉన్నాయి. గుంటూరులో ధియేటర్లు, గోదాములు, దుకాణాలు అన్నీ కలిపి కమర్షియల్ బిల్డింగ్‌ల ఆస్తి విలువ మరో 26 కోట్లకు ఉంది. గుంటూరు(Guntur)లో ఉన్న ఇళ్ల విలువై మరో 8 కోట్లు ఉంటుంది. మొత్తం స్థిరాస్తుల విలువ 70 కోట్లు ఉంది. అలాగే వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 15 కోట్లుగా ఉంది. ఆయనపై పోటీపడుతున్న తెలుగుదేశం అభ్యర్థి ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌(Pemmasani Chandrashekar) సైతం కోట్లకు పడగలెత్తినవాడే. ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీపడుతుండటంతో ఆయన ఆస్తుల వివరాలు తెలియలేదు.


గుంటూరు జిల్లాలోనే మరో లోక్‌సభ నియోజకవర్గం నరసరావుపేట(Narasaraopet) నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీపడుుతున్న సిట్టింగ్ ఎంపీ లావు(Lavu Srikrishna Devarayulu) శ్రీకృష్ణదేవరాయులు...విజ్ఞాన్ విద్యాసంస్థలు పేరిట తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఆయన పేరిట 17 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా....కోటి రూపాయల విలువైన అప్పులు ఉన్నాయి. బ్యాంకులో డిపాజిట్లు, బాండ్లు రూపేణా 3కోట్ల 68 లక్షల విలువైన ఆస్తులు ఉండగా...కోటి రూపాయల విలువైన వ్యవసాయ భూమి, 10 కోట్లు విలువైన ప్లాట్లు, మరో మూడున్నర కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 14 కోట్ల వరకు ఉంది. ఇక లావు శ్రీకృష్ణదేవరాయులపై పోటీపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌(Anil Kumar Yadhav)కు 6 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా... కోటి రూపాయల అప్పు ఉంది. బ్యాంకులో డిపాజిట్లు,పర్సనల్‌ లోన్లు, బంగారం, వాహనాలు అన్నీ కలిపి 2 కోట్ల 80 లక్షల చరాస్తులు ఉండగా...వ్యవసాయ భూమి, ప్లాట్లు కలిపి మూడు కోట్ల విలువ ఉంటుంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు మరో కోటి రూపాయల వరకు ఉంది.


గుంటూరు జిల్లాలోని మరో లోక్‌సభ నియోజకవర్గం బాపట్ల(Bapatla) నుంచి ఈసారి వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేశ్(Nandhigum Suresh) పోటీపడుతున్నారు. ఆయన ఆస్తులు కేవలం 41 లక్షలే ఉండగా...అప్పులు రెండున్నర లక్షలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపారు. బ్యాంకులో క్యాష్‌, బాండ్లు, కార్లు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి 28 లక్షలు ఉండగా...ఐదు లక్షల విలువైన వ్యవసాయ భూమి, మరో 8 లక్షల విలువైన ప్లాట్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 13 లక్షలు ఉంది. బ్యాంకులో తీసుకున్న గోల్డ్‌ లోను 2లక్షల 69 వేలు మాత్రమే ఉంది. బహుళా ఎంపీలుగా పోటీపడుతున్న వారిలో అత్యంత తక్కువ ఆదాయం, అప్పు కలిగి వ్యక్తి నందిగం సురేశ్ అయ్యి ఉంటారు. ఈసారి ఈయనపైకి తెలుగుదేశం మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌(Krishna Prasad)ను ప్రయోగించింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన డీజీపీ హోదాలో పదవీవిరమణ చేశారు. ఈయన మాజీమంత్రి శమంతకమణి అల్లుడు. తొలిసారి ఎన్నికల్లో పోటీపడుతున్నందున ఆయన ఆస్తులు కూడా తెలియకపోయినా...డీజీపీ స్థాయిలో పదవీవిరణమ చేసిన వ్యక్తి కాబట్టి బాగానే ఆస్తులు కూడబెట్టె అవకాశం ఉంది.