Medak Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరుగా ఉన్నాయి. మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందంజలో దూసుకుపోతున్నారు. ఈయనకు 236757 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు 25253 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 43,150 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనిపించకపోవడం లేదు. పైగా ప్రతి చోటా మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలుత ఇక్కడ బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. తర్వాత బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. 26 వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది.