Mahbubnagar Election Results 2024: మహబూబ్ నగర్‌లో డీకే అరుణ స్వల్ప మెజారిటీ, బీజేపీ - కాంగ్రెస్ పోటాపోటీ

Mahbubnagar Lok Sabha Election Results 2024: మహబూబ్ నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ స్వల్ప మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది.

Continues below advertisement

Mahbubnagar Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం చూపడం లేదు. మహబూబ్ నగర్‌ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముందంజలో కొనసాగుతున్నారు. ఈమెకు 346137 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి 16292 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. స్వల్ప తేడా మాత్రమే వీరి మధ్య ఉంది. గెలుపుపై వీరిద్దరూ ఉత్కంఠతో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి 233988 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడో స్థానంలోనే కొనసాగుతోంది.

Continues below advertisement
Sponsored Links by Taboola