Elections 2024 :  రేవంత్ రెడ్డి   దమ్ముంటే నువ్వు ముందుకురా  నువ్వు సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జ‌రి.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అని కేటీఆర్ స‌వాల్ చేశారు.బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌తో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంచ‌ల్‌గూడ జైల్లో ములాఖ‌త్ అయ్యారు. మ‌న్నె క్రిశాంక్‌ను కలిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నిజానిజాలు తేల్చిన తర్వాత ఎవరు చంచల్ గూడ జైలులో కూర్చోవాలో కూడా తేలుద్దామన్నారు.             


 





            


ఇక‌నైనా బుద్ది, సిగ్గు తెచ్చుకొని వెంట‌నే క్రిశాంక్‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.   క్రిశాంక్ పోస్టు చేసిన స‌ర్క్యుల‌ర్ త‌ప్పు కాదన్నారు.  చేయ‌ని త‌ప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. రేవంత్ స‌ర్కార్ చేసిన వెధ‌వ ప‌నికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. క్రిశాంక్‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్ల‌ర రాజ‌కీయం చేస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.                                 


మే ఒకటో తేదీన  బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నే క్రిశాంక్  ను పోలీసులు అరెస్ట్ చేశారు.  సూర్యాపేట టోల్  గేట్ వద్ద బీఆర్ఎస్ నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సర్కులర్ ను ఎడిట్ చేసి.. వాట్సప్, ఫేస్బుక్ ట్విట్టర్లలో ప్రచారం చేస్తున్నారని ఓయూ అధికారుల ఫిర్యాదు అందింది.  గతేడాది జారీచేసిన సర్క్యూలర్ కు బదులుగా ఫేక్ సర్క్యూలర్ ను తయారుచేసి సోషల్ మీడీయాలో పోస్టు చేసి ఓయూ ప్రతిష్టను దెబ్బ తీసేలా న్యూస్​ స్ప్రెడ్​ చేసినందుకు క్రిషాంక్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సర్క్యూలర్ పై నంబరు కూడా పెన్నుతో రాశారని  తన సంతకాన్ని సైతం కాపీ చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ రావు తెలిపారు.                  


దాంతో Ipc 466,468 ,469 ,505 (1)(C) కింద పోలీసులు కేసు నమోదు చేసి క్రిషాంక్ తప్పు చేశాడని నిర్దారించి అరెస్టు చేశారు.  కోర్టు ఆయనకు రిమాండ్ ప్రకటించింది. అప్పట్నుంచి చంచల్ గూడ జైల్లో ఉన్నారు. అయితే  బీఆర్ఎస్ నేతలు మాత్రం మన్నె క్రిషాంక్ సోషల్ మీడియాలో పెట్టిన సర్క్యూరల్ నిజమైనదేనని బీఆర్ెస్ చెబుతోంది. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. అలాంటి సర్క్యులర్ ఎలా ఇచ్చారో తెలుసుకుని ఫేక్ సర్క్యూలర్ అని చెప్పడంతో.. ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. అయితే రేవంత్ పెట్టిందే ఫేక్ అని.. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.