Karnataka Election Result 2023 Live: చేయెత్తి జై కొట్టిన కర్ణాటక

Karnataka Election Result 2023 Live: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 కచ్చితమైన తాజా ఫలితాల కోసం ఈ పేజ్ చూడండి .

ABP Desam Last Updated: 13 May 2023 05:36 PM
కాంగ్రెస్ పార్టీకి కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






 

కర్ణాటక డీకే శివకుమార్ భావోద్వేగం- ప్రజలకు కృతజ్ఞత చెబుతూ కంటతడి 

కర్ణాటకలో సాధించిన విజయం సోనియా, రాహుల్‌కు అంకితం చేశారు పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్. కార్యకర్తల కష్టానికి ఫలితం తగ్గిందని అంటూనే ప్రజలకు కృతజత తెలుపుతూ కంటతడి పెట్టుకున్నారు. 

Karnataka Election Results 2023: 16 స్థానాల్లో 1000 కంటే తక్కువ ఆధిక్యంలో అభ్యర్థులు

5 కంటే తక్కువ తేడా ఉన్న 1000 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.


5 కంటే తక్కువ మార్జిన్ ఉన్న 1000 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.


2 కంటే తక్కువ తేడా ఉన్న రెండు స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో ఉంది.


2 కంటే తక్కువ తేడా ఉన్న 1000 స్థానాల్లో ఇండిపెండెంట్లు ఆధిక్యంలో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థి సుధాకర్ ఓటమి

సినీనటుడు బ్రహ్మానందం ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి సుధాకర్ ఓటమి పాలయ్యారు

Karnataka Election Result 2023: జగదీష్ షెట్టార్‌కు షాక్

హుబ్లి ధార్వాడ్‌ సెంట్రల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్‌ షెట్టార్ ఓటమి పాలయ్యారు. ఆయన బీజేపీ అభ్యర్థి మహేష్ చేతిలో ఓడిపోయారు. 

హిమాలయాల నుంచి సముద్రం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం: బఘేల్

చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మాట్లాడుతూ హిమాచల్ ఇప్పుడు కర్ణాటకలో గెలిచిందని, అంటే హిమాలయాల నుంచి సముద్రం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఓడిపోతామని బీజేపీ గ్రహించిందన్నారు. దీన్నిబట్టి మోదీ మ్యాజిక్ పని చేయడం లేదని అర్థమవుతుందన్నారు. ఈ విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు బజరంగబలి కాంగ్రెస్ వైపే ఉందని స్పష్టం చేసింది. బీజేపీ నుంచి పెద్ద రాష్ట్రాలను లాక్కున్నామన్నారు.

Karnataka Election Results 2023: ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తన మద్దతుదారులతో సమావేశమయ్యారు.

కాంగ్రెస్ 115, బీజేపీ 73, జేడీఎస్ 29 స్థానాల్లో ఆధిక్యాలు

ప్రస్తుతం ట్రెండ్స్ ప్రాంతాల వారీగా చూస్తే... 

ప్రస్తుతం ట్రెండ్స్ ప్రాంతాల వారీగా చూస్తే...





































































ప్రాంతం స్థానాలుబీజేపీకాంగ్రెస్ జేడీఎస్ OTH 
బెంగళూరు    28/28189 1  0
సెంట్రల్ కర్ణాటక 25/25    7  142  2
కోస్టల్ కర్ణాటక19/19  14 4 0
హైదరాబాద్ కర్ణాటక 41/41 11  23 4  3
నార్త్ కర్ణాటక  50/50 16 31 2  1
మైసూరు  61/61  31 22  2
మొత్తం22474112239

 

Karnataka Election Results 2023: 170 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

కాంగ్రెస్ - 85 సీట్లు, 43.8 శాతం ఓట్లు


బీజేపీ - 62 సీట్లు, 37 శాతం ఓట్లు


జేడీఎస్ 18 సీట్లు, 11.2 శాతం ఓట్లు


ఇతరులు - 5 సీట్లు

కర్ణాటక ఎన్నికలు 2023: ఓట్ల శాతంలో ట్రెండ్స్



    • కాంగ్రెస్ - 45.36%







    • బీజేపీ - 38.19%






  • జేడీఎస్ - 8.66%


కర్ణాటకలో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ, చాలా దూరంలో ఆగిపోయిన బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ మెజారిటీని దాటింది. బీజేపీ చాలా వెనుకబడి ఉంది. బీజేపీ 68, కాంగ్రెస్ 137, జేడీఎస్ 17, ఇతరులు 2

Karnataka Election Results 2023: ప్రస్తుతం ట్రెండ్స్ ప్రాంతాల వారీగా చూస్తే...

ప్రస్తుతం ట్రెండ్స్ ప్రాంతాల వారీగా చూస్తే...





































































ప్రాంతం స్థానాలుబీజేపీకాంగ్రెస్ జేడీఎస్ OTH 
బెంగళూరు    28/281213  2  1
సెంట్రల్ కర్ణాటక 25/25    11  92  3
కోస్టల్ కర్ణాటక19/19  12 6 0
హైదరాబాద్ కర్ణాటక 41/41 18  20 1  2
నార్త్ కర్ణాటక  50/50 12 37 0  1
మైసూరు  61/61  33 17  2
మొత్తం22474118239
చాలా మంది ప్రముఖులు ఆధిక్యాలు ఇలా ఉన్నాయి

షిగ్గావ్‌లో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత సీఎం బస్వరాజ్‌ బొమ్మె ఆధిక్యంలో ఉన్నారు. 
వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్దరామయ్య ఆధిక్యంలో ఉన్నారు. 
హోళెనర్సీపూర్‌లో జేడీఎస్‌ అభ్యర్థి రేవన్న  ఆధిక్యంలో ఉన్నారు 
గాంధీనగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దినేష్‌ గుండూరావు ఆధిక్యంలో ఉన్నారు. 
గాలి జనార్ధన్ రెడ్డి దంపతులు ఆధిక్యంలో ఉన్నారు. 
గంగావతి స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 
బళ్లారిలో గాలి లక్ష్మీ అరుణ ఆధిక్యంలో ఉన్నారు. 
చిక్కబళ్లాపూర్‌ లో బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ ఆధిక్యంలో ఉన్నారు. 
బళ్లారి రూరల్‌ స్థానంలో బీజేపీ తరఫు అభ్యర్థి శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు
హుబ్బళి ధార్వాడ్  సెంట్రల్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టర్ ఆధిక్యంలో ఉన్నారు. 
చిక్కమంగుళూరులో సీటీ రవి బీజేపీ తరఫున ఆధిక్యంలో ఉన్నారు. 
చిత్తాపూర్‌లో మల్లికార్జున ఖర్జే కుమారుడు ప్రియాంక్‌ ఖర్గే ఆధిక్యంలో ఉన్నారు
సొరబ స్థానంలో కుమార బంగారప్ప బీజేపీ తరఫున పోటీ చేసి వెనుకంజలో ఉన్నారు. 

Karnataka Election Results 2023: 100 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే కాంగ్రెస్ సెంచరీ కొట్టింది. బీజేపీ బలం 100 లోపే ఉంది.



బీజేపీ - 90


కాంగ్రెస్ - 112


జేడీఎస్ - 19


ఇతరులు - 0

Karnataka Election Results 2023: బీజేపీ-కాంగ్రెస్ మధ్య సమ పోటీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల కమిషన్ ఫలితాల ప్రకారం బీజేపీ, కాంగ్రెస్ చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ప్రముఖుల ఆధిక్యాలు ఇలా ఉన్నాయి

చన్నపట్నణలో కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు


రామ్‌నగర్‌లో కుమార స్వామి కుమారుడు నిఖిల్ ముందంజలో ఉన్నారు


హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్‌లో షెట్టర్ వెనుకంజలో ఉన్నారు


బళ్లారి రూరల్‌ లో శ్రీరాములు ముందంజలో ఉన్నారు


కనకపురలో డీకే శివకుమార్ ఆధిక్యం ఉన్నారు


బళ్లారిలో గాలి జయలక్ష్మి వెనుకంజలో ఉన్నారు


 


 


 

Karnataka Election Results 2023: కర్ణాటకలో ప్రతి క్షణం మారుతున్న ట్రెండ్స్ 

మొదట్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్‌కు మెజారిటీ రాగా, ఇప్పుడు కాంగ్రెస్ ఆధిక్యం ఒక్కసారిగా పడిపోయింది. అదే సమయంలో బీజేపీ చాలా వెనుకబడి ఉంది.

Karnataka Election Results 2023: కర్ణాటకలో కాంగ్రెస్ సెంచరీ

కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు 200 సీట్లలో ట్రెండ్స్ వచ్చాయి. కాంగ్రెస్ 100 మార్కును దాటింది. బీజేపీ చాలా వెనుకబడి ఉంది. జేడీఎస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, స్వతంత్రులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

కర్ణాటకలో బీజేపీ ఆధిక్యం, కాంగ్రెస్‌కు గట్టి పోటీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య సమపోటీ నెలకొంది. ఓసారి బీజేపీ, ఓసారి కాంగ్రెస్ ముందంజలోకి వస్తున్నాయి. 100కుపైగా సీట్లలో ఈ ట్రెండ్ వచ్చింది.






    • బీజేపీ - 51







    • కాంగ్రెస్ - 57







    • జేడీఎస్ - 8






  • ఇతరులు - 4


ముందస్తు ట్రెండ్ర్‌లో ఎవరు ముందంజలో ఉన్నారంటే?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.






    • బీజేపీ - 32







    • కాంగ్రెస్ - 32







    • జేడీఎస్ - 7






  • ఇతరులు - 4


కర్ణాటక ఎన్నికల లైవ్ రిజల్ట్స్: 50కిపైగా స్థానాల్లో ట్రెండ్

50కి పైగా స్థానాల్లో ట్రెండ్స్ వచ్చాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 





    • బీజేపీ - 25







    • కాంగ్రెస్ - 30







    • జేడీఎస్ - 6






  • ఇతరులు - 4


కర్ణాటక లైవ్ ఫలితాలు

కర్ణాటక లైవ్ ఫలితాలు





    • బీజేపీ - 10







    • కాంగ్రెస్ - 10







    • జేడీఎస్ - 4






  • ఇతరులు - 4


Background

Karnataka Election Result 2023:


ఉదయం 8 నుంచి కౌంటింగ్ 


దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election 2023) గురించి ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఈ సారి కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ప్రచారం కూడా గతంలో కన్నా వాడివేడిగా సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పాటు అక్కడే పర్యటించారు. అటు రాహుల్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేశారు. సౌత్‌లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. ఇక్కడ గెలిస్తే....ఇక్కడి నుంచే సౌత్ మిషన్‌ను అమలు చేయాలని చూస్తోంది కాషాయ పార్టీ. కానీ...ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్‌కు మొగ్గు చూపుతున్నాయి. అయినా...బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగానే ఉంది. అందుకే..ఈ సారి ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తం 73.18% మేర పోలింగ్ నమోదైంది. ఈ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నానికే ట్రెండ్‌ తెలిసిపోతుంది. ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయన్నది తేలిపోతుంది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  



ట్రెండ్ మారుతుందా? 


కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు అవసరం. కాంగ్రెస్ తమకు 120కి పైగా సీట్లు వస్తాయని ధీమాగా ఉంది. అటు బీజేపీ కూడా 125 సీట్లు వస్తాయని జోస్యం చెబుతోంది. కర్ణాటకను రాజకీయపరంగా 5 ప్రాంతాలుగా విభజించి చూస్తే...దాదాపు అన్ని చోట్లా కాంగ్రెస్‌కే ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే...అప్పుడు JDS కింగ్ మేకర్ అవుతుంది. ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ ఇస్తే..ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో "హంగ్" వచ్చే అవకాశమూ ఉందని తేలడం వల్ల టెన్షన్ మరింత పెరిగింది. తాము లేనిదే ప్రభుత్వం ఏర్పాటు కాదని గట్టిగానే చెబుతోంది జేడీఎస్. కాంగ్రెస్ మాత్రం అలాంటిదేమీ లేదని, తామే మెజార్టీ సీట్లు సాధిస్తామని స్పష్టం చేస్తోంది. అయితే..కర్ణాటక ఎన్నికల ట్రెండ్‌ని చూస్తే...కన్నడిగులు ఎప్పుడూ ప్రస్తుత ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇచ్చిన దాఖలాల్లేవు. ఇలా చూస్తే...బీజేపీని కాదని కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. 1985 నుంచి రాష్ట్రంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 


బరిలో నిలిచిన కీలక అభ్యర్థులు వీళ్లే..


కర్ణాటక ఎన్నికల బరిలో పలు కీలక అభ్యర్థిలో బరిలోకి దిగారు. వీళ్లు గెలుపోటములపైనా ఉత్కంఠ నెలకొంది. 


బసవరాజు బొమ్మై (బీజేపీ) - షిగ్గావ్ 
సిద్దరామయ్య (కాంగ్రెస్) - వరుణ 
డీకే శివకుమార్ (కాంగ్రెస్) - కనకపుర
హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్) - చెన్నపట్న 
నిఖిల్ కుమారస్వామి (జేడీఎస్) - రామనగర 
జగదీశ్ షెట్టర్ (కాంగ్రెస్) - హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ 



ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్


ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మొగ్గు కనిపించింది. ఆ పార్టీకి 100 నుంచి 112 సీట్లు వరకూ రావొచ్చని ఎగ్దిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే మెజార్టీకి కావాల్సింది 113 స్థానాలు. బీజేపీకి 83-95 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జేడీఎస్‌కు 21-29, ఇతరులకు 2-6 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. 


          


- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.