Janasena Chief Pawan Kalyan Powerful Speech At Tadepalligudem : టీడీపీతో పొత్తుల్లో భాగంగా 24 సీట్లు తీసుకోవడంపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై కూడా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ప్రజలను గెలిపించడానికే పొత్తుపెట్టుకున్నామని.. తాను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తనకు బాగా తెలుసన్నారు. సరైన వనరులు లేకపోవడం వల్లే అన్ని స్థానాల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తనతో కలిసి నడవాలనుకునే వాళ్లు సలహా ఇవ్వడం కంటే యుద్ధం చేయడానికే సిద్ధపడాలన్నారు. 


కోట్లు వదులుకొని నా వాళ్లు నా నేల అనుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు పవన్. అలాంటి  నన్ను రెండుసార్లు నా అభిమానులే  ఓడించారు. మీ పరీక్ష పోతే ఎంత ఉంటుందో రెండు చోట్ల ఓడిపోతే అంతకంటే ఎక్కువ బాధపడ్డాను అన్నారు. అవమానాలు లేకుండా పార్టీని నడపలేనని గ్రహించి ఇవాళ నిలబడ్డాను. ఉద్యోగానికి మన ప్రవర్తన సర్టిపికేట్ కావాలి. వీసా కావాలంటే కాండాక్ట్‌ సర్టిఫికేట్ కావాలి. అలాంటి ముఖ్యమంత్రికి కాండాక్ట్ సర్టిఫికేట్‌ వద్దా.  ఎమ్మెల్యే ఎంపీలకు కాండాక్ట్ సర్టిపికేట్ అవసరం లేదా... జగన్‌ ఆయన వెంట ఉండే దాష్టిక సమూహానికి కాండాక్ట్ సర్టిఫికేట్‌ వద్దా. మనకు కాండాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండాలి. దోపిడీగాళ్లను దొంగలను ఎన్నుకంటే మన మనమే బాధపడాలి. పొద్దున్న సాయం కింద డబ్బులు ఇస్తాడు.. సాయంత్రానికి సారా కింద ఎత్తుకుపోతాడు. జగన్ ఇచ్చేది చేయూత కాదు చేతివాటం. 


ఎన్ని అవమానాలు ఎదురైనా నిబడ్డానికి ప్రజలు బాగుండాలనే. నేను సినిమాల్లో కూడా అందరి హీరోలు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నేను తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజల బాగు కోసమే. ఇప్పుడు పొత్తుల కూడా ప్రజల కోసమే అన్నారు. ఇప్పుడు 24 టికెట్లు తీసుకుంటే మనోళ్ల కంటే అవతలి వాళ్లే ఎక్కువ బాధపడుతున్నారు. ఇంతేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడి కోరిక చూసి ఇంతేనా అన్నాడు. చివరకు ఆయన తలపై కాలు పెట్టి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని అన్నారు.  జగన్ గుర్తుపెట్టుకో... నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నేను పవన్ కల్యాణే కాదు.. మా పార్టీ జనసేనే కాదు. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ వాళ్లకు తెలుస్తుంది మేమెంతో. ఎందుకంటే నెత్తిపై కాలు వేసి తొక్కుతాం కదా అప్పుడు తెలిసి వస్తుంది. 


ఒక్క సీటు గెలిస్తేనే తాను రాజమండ్రి పర్యటనకు వస్తుంటే రాత్రికి రాత్రి చదివే విద్యార్థి లాగ నైట్ అవుట్ చేసి రోడ్లు వేశారు. అలాంటిది మేం 24 సీట్లలో పోటీ చేస్తున్నాం. గెలుస్తున్నాం... మా సత్తా ఏంటో చూపిస్తాం. గాయిత్రి మంత్రం 24 అక్షరాలే. అంకెలు లెక్కపెడితే పవన్ వంక కూడా చూడలేరని చెప్పండి. వేల కోట్లు వారసత్వంగా తినేయలేదు. వాళ్లలా వేల కోట్లు లేవు కదా అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి. టీడీపీ మాదిరిగా అంత పకడ్బందీ వ్యవస్థ ఏమైనా ఉందా ఏమున్నాయి. మెతుకూ మెతుకూ వెతుకున్నాం. ఇటుకూ ఇటుకూ పేర్చుకుంటూ జనసేన ఇల్లు కడుతున్నాం. కోట కూడా కడతాం... జగన్ తాడేపల్లి కోటను కూడా బద్దలు కొడతాం. సామాన్యుడు రాజకీయం చేస్తే ఫ్యాక్సనిస్టులు తట్టుకోలేరు. కానీ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలానే ఉంటుంది. ఇలాంటి రాజకీయా పార్టీకి సలహాలు ఇచ్చే వాళ్లు వద్దు. యుద్ధం చేసే యువకులు కావాలి. కుతకుతలాడే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని ఎదురించే వ్యక్తులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతే కానీ నాకు సలహాలు ఇచ్చేవాళ్లు వద్దు. సొంత బాబాయినే నరికి చంపిన వాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాష్టికం చేసే వాడు యుద్దం చేస్తే తగ్గుతాడు. కింద కూర్చుంటాడు.