Janasena became the strongest party after TDP  :  జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీ కన్నా బలమైన పార్టీగా నిలిచింది. వైసీపీ  కన్నా నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ సాధించడం ద్వారా వైసీపీ చేస్తున్న విమర్శలకు సరైన సమాదానం చెప్పింది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే జనసేన ఇరవైకిపైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే వైసీపీ కేవలం పదిహేను స్థానాల్లోపు సరిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. 


వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసింది. కానీ జనసేన పార్టీ 21 చోట్ల మాత్రమే పోటీ చేసింది. దాదాపుగా 95 శాతం స్ట్రైక్ రేట్‌తో  జనసేన పార్టీ విజయం సాధించింది. అభ్యర్థులకు వచ్చిన మెజార్టీలు కూడా ఊహించని రీతిలో ఉన్నాయి.