Jagan sent  resigning letter For The post of CM to the governor :  ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ పంపారు. సిట్టింగ్ సీఎం ఎన్నికల్లో ఓడిపోతే నేరుగా గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పించడం సంప్రదాయం . అయితే జగన్ గవర్నర్ ను కలవడానికి ఇష్టపడలేదు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపినట్లుగా తెలుస్తోంది. రాజీనామా లేఖను ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని కోరుతూ రాజ్ భవన్ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వరకూ జగన్ ఆపద్ధర్మ సీఎంగా ఉంటారు.