Gujarat Results 2022: గుజరాజ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ (భాజపా) దూసుకుపోతుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం ఇప్పటికే మెజారిటీ మార్క్‌ను దాటి లీడ్‌లో కొనసాగుతోంది. కాంగ్రెస్ పూర్తిగా వెనుకంజలో కనిపిస్తోంది. దీంతో ఈ ట్రెండ్స్‌పై గుజరాత్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ స్పందించారు.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 182 మంది కౌంటింగ్ పరిశీలకులు, అనేక మంది ఎన్నికల అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి, మొదటి దశ 89 స్థానాలకు డిసెంబర్ 1న, మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 64.33 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 4 శాతం తక్కువ. 4.9 కోట్ల మంది ఓటర్లలో కేవలం 3.16 కోట్ల మంది మాత్రమే ఓటు వేశారు.