Ram Charan: బాబాయ్ పవన్ కు అబ్బాయ్ మద్దతు - ఫ్యాన్స్ కు ఇరువురి అభివాదం, పిఠాపురంలో ఫుల్ జోష్

Andhra Pradesh News: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను శనివారం కలిశారు. చేబ్రోలులోని ఆయన నివాసంలో ఇద్దరూ కలిసి ప్రజలకు అభివాదం చేశారు.

Continues below advertisement

Ram Charan Meet Pawan Kalyan In Pithapuram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తన బాబాయ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలిశారు. శనివారం చేబ్రోలులోని (Chebrolu) పవన్ నివాసానికి వెళ్లిన అనంతరం ఇరువురూ బయటకు వచ్చి బాల్కనీ నుంచి ప్రజలు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం సురేఖ, అల్లు అరవింద్ అంతా అభిమానులకు అభివాదం చేశారు. ఎన్నికల టైంలో తన బాబాయ్ కు ఆయన మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో పవన్ నివాస ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. అంతకుముందు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్, తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అర్జున్ తో కలిసి పిఠాపురం (Pithapuram) బయల్దేరారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ కు అభిమానులు, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా వారికి అభివాదం చేస్తూ రామ్ చరణ్ పవన్ నివాసానికి వచ్చారు. 

Continues below advertisement

అమ్మవారికి ప్రత్యేక పూజలు

అటు, రామ్ చరణ్, తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. శక్తిపీఠం పురూహుతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు వారికి శ్రీ చక్ర దర్శనం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు. కాగా, రామ్ చరణ్ రాకతో ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆలయం వెలుపల వేలాదిగా అభిమానులు వారికి జేజేలు పలికారు. వాహనం నుంచి బయటకు వచ్చిన అనంతరం రామ్ చరణ్ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం చేబ్రోలులోని పవన్ నివాసానికి వెళ్లారు.

Also Read: Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ

Continues below advertisement