Exit Polls 2022 LIVE: ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ కమల వికాసమే- కానీ సమాజ్‌వాదీతో గట్టి పోటీ

ABP Cvoter Exit Polls 2022 Results LIVE Updates: ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏబీపీ దేశంలో ఇలా చూడండి.

ABP Desam Last Updated: 07 Mar 2022 08:58 PM
ఓటింగ్ శాతం

ఓటింగ్ శాతానికి వస్తే సమాజ్‌వాదీ పార్టీకి 33%, భాజపాకు 40% ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. 

యూపీలో మళ్లీ భాజపా

ఉత్తర్‌ప్రదేశ్‌లో మళ్లీ భాజపా అధికారం చేపట్టబోతున్నట్లు ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్‌లో తేలింది. అయితే గతంలో వచ్చినంత మెజారిటీ మాత్రం రాదని తెలుస్తోంది.


భాజపాకు 228-240,


సమాజ్‌వాదీ పార్టీ 132-148


బీఎస్పీ 14-21


కాంగ్రెస్ 6-10


ఇతరులు 3-8

మణిపుర్‌లో

మణిపుర్‌లో ఏబీపీ- సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూద్దాం. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 12 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని తేలింది. భాజపాకి 23 నుంచి 27 స్థానాలు ప్రజలు కట్టబెట్టి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ప్రజలు నిలబెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు, ఎన్ పీఎఫ్ 3 నుంచి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులు 2-6 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. 



గోవాలో కింగ్ ఎవరు?

గోవాలో కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు ఎగ్జిట్ పోల్‌లో తేలింది. భాజపా కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని అంచనా. భాజపా 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చు. ఆప్‌ స్థానాలు ఐదు వరకు పెరగవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. ఆప్‌ ఒకటి నుంచి ఐదు స్థానాల్లో పాగా వేసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఈసారి మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ ఇప్పుడు కీలకం కానున్నట్టు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకోనుందని అంచనా. ఇదే జరిగితే ఈ పార్టీవైపు ప్రధాన పార్టీలు చూస్తాయి. ఇతరలు కూడా ఒకట్రెండు స్థానాల్లో గెలవ వచ్చని సర్వే చెబుతోంది.  



ఓటు శాతం

ఓటు శాతం


ఓవరాల్‌గా ఓట్ షేర్‌ ప్రకారం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి 39.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 26.7 శాతం ఓట్ల దగ్గరే ఆగిపోనుంది. అకాలీదళ్‌కు 20 శాతం.. బీజేపీ కూటమికి 9.6 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పంజాబ్‌లో

ఊడ్చేస్తోన్న ఆప్


కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి  ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపించబోతోందని ABP-C voter సర్వేలో తేలింది. పంజాబ్‌లో 20వ తేదీన సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ABP-C voter నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు కనిపించింది.


మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో తాజా అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 51 నుంచి 61 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 28  సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.



ఓటింగ్ శాతం
ఉత్తరాఖండ్‌లో ఓటింగ్ శాతం గురించి చూస్తే భాజపాకు 40.8, కాంగ్రెస్‌కు 39.3 శాతం ఓట్లు రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 8.7, ఇతరులకు 11.2 శాతం ఓట్లు రాబట్టుకునే అవకాశం ఉంది.

 

ఉత్తరాఖండ్‌లో

హోరాహోరీ



ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP-సీ ఓటర్ చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భాజపా 26- 32 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 32-38 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఆమ్‌ఆద్మీ 0-2 స్థానాలు గెలవొచ్చు. ఇతరులకు 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉంది.



 

ముగిసిన పోలింగ్

ఉత్తర్​ప్రదేశ్ చివరి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడతలో పూర్వాంచల్​లోని 54 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 54.18 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

యోగిదే పైచేయి

ఫిబ్రవరిలో నిర్వహించిన ఏబీపీ-ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో 43.6 శాతం ప్రజలు యోగి ఆదిత్యనాథ్ మళ్లీ సీఎం కావాలని కోరుకున్నారు. 33.7 శాతం అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని తెలిపారు.


పంజాబ్‌లో

CVoter-ABP ఫిబ్రవరిలో నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. పంజాబ్‌లో విజయం దిశగా ఆప్ పయనిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తప్పేలా లేదు. మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నయో కాసేపట్లో చూడండి.


Background

ABP Cvoter Exit Polls 2022 Results LIVE Updates:


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఈరోజుతో ముగిసింది. మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఏడో విడత పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్ ముగిసిన 3 రోజులకే మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 


అయితే ఫలితాల కన్నా ముందే ABP News- సీఓటర్ సర్వే సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. మరి గెలుపెవరిదో ముందే తెలుసుకోవాలంటే ఎగ్జిట్ పోల్స్ చూసేయండి.


హోరాహోరీ పోరు


ABP News- సీఓటర్ సంయుక్తంగా అంతకుముందు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాదే పైచేయిగా కనిపించింది. అయితే సమాజ్‌వాదీ పార్టీ నుంచి భాజపాకు పోటీ ఉంది.


మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆమ్‌ఆద్మీ ఝలక్ ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఒపినీయన్ పోల్స్ ఫలితాల ప్రకారం ఆప్ పార్టీ మేజిక్ ఫిగర్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.


దేవభూమి ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, భాజపా మధ్య నువ్వా-నేనా అన్నట్లు హోరాహోరీ పోరు నెలకొన్నట్లు ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో తేలింది.


మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో కాసేపట్లో మీరే చూడండి. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. మరి గెలుపెవరిదో చూద్దాం.


ఎక్కడ, ఎప్పుడు?


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కచ్చితమైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఏబీపీ అందించనుంది. 'ABP దేశం'లో మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ABP News TV లో కూడా ఫలితాలు ప్రసారమవుతాయి.


సోషల్ మీడియాలో


టీవీ, యాప్‌తో పాటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ABP కి సంబంధించిన వివిధ సోషల్ మీడియాలో హ్యాండిల్స్‌లో కూడా చూడొచ్చు. హాట్‌స్టార్ లో  కూడా లైవ్ చూడొచ్చు. దీంతో పాటు ABP దేశం, ABP న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా లైవ్ వస్తుంది.


Live TV: https://news.abplive.com/live-tv 


ABP దేశం website: https://telugu.abplive.com/


English website: https://news.abplive.com/


Hindi website: https://www.abplive.com/


YouTube:https://www.youtube.com/user/abpnewstv


సోషల్ మీడియాలో


ABP దేశం ఫేస్‌బుక్‌: facebook.com/ABPDesam


ABP English Facebook: facebook.com/abplive


ABP Hindi Facebook: facebook.com/abpnews


ABP News Twitter: twitter.com/abpnews


ABP News Instagram:  https://www.instagram.com/abpnewstv/


- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.