Election 2022 Voting Live: యూపీలో ప్రశాంతంగా పోలింగ్- 5 గంటల వరకు 57.79% ఓటింగ్

యూపీలో తొలి విడత పోలింగ్‌లో భాగంగా 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 11 గంటల వరకు 20 శాతం పోలింగ్ నమోదైంది.

Continues below advertisement

LIVE

Background

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఈ పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీకి మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుంది.

11 జిల్లాల్లో..

తొలి విడత పోలింగ్‌లో భాగంగా యూపీలోని 11 జిల్లాలకు చెందిన 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. షామిలి, మథుర, ఆగ్రా, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మేరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హపుర్, బులంద్‌షహర్, అలీగఢ్.. జిల్లాల్లో ఈ పోలింగ్ సవ్యంగా సాగుతోంది.

ఉదయం 11 గంటల వరకు 20.03% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

తొలి విడత ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. 7 విడతల యూపీ ఎన్నికల పోలింగ్ మార్చి 7న ముగియనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

భారీ భద్రత..

పోలింగ్ సందర్భంగా ఎలాంచి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్)కు చెందిన 412 కంపెనీల నుంచి దాదాపు 50 వేల బలగాలను పశ్చిమ యూపీ వ్యాప్తంగా మోహరించింది. 

యూపీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. గురువారం పోలింగ్ జరగనున్న 58 నియోజకవర్గాల్లో పోలీసులు నిఘా పెట్టారు.

ముఖ్యంగా ముజాఫర్‌నగర్, ఆలీగఢ్, మేరట్‌లో ఎక్కువమందిని మోహరించాం. ఒక్క మథురలోనే 75 కంపెనీల బలగాలను భద్రతగా ఉంచాం. ఈ నియోజకవర్గంలోనే 21 వేల మంది బలగాలు పహారా కాస్తున్నాయి.                                                   "
-భద్రతా అధికారులు

వాహనాల తనిఖీ..

హరియాణా, రాజస్థాన్ సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లను పోలీసులు కట్టుదిట్టంగా చెక్ చేస్తున్నారు. అటుగా వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 48 గంటల పాటు లిక్కర్ షాపులను మూసివేయనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల లోపుల ఎక్కడైనా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సంబంధించిన పోస్టర్, బ్యానర్, హోర్డింగ్ కనిపిస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద పరిగణిస్తామని హెచ్చరించారు.

Continues below advertisement
18:39 PM (IST)  •  10 Feb 2022

5 గంటల వరకు

యూపీలో సాయంత్రం 5 గంటల వరకు 57.79% పోలింగ్ నమోదైంది.


జిల్లాల వారీగా


ఆగ్రా- 56.52 %
అలీగఢ్ - 57.25%
బఘ్‌పట్- 61.25%
బులంద్‌షహర్- 60.57%
గౌతమ్ బుద్ధ్ నగర్- 53.48 %
ఘజియాబాద్- 52.43%
హపుర్- 60.53%
మథుర- 58.12%
మేరట్- 47.74%
ముజఫర్‌నగర్- 62.09%
షామిలి- 61.75%

17:04 PM (IST)  •  10 Feb 2022

3 గంటల వరకు


ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం ఓటింగ్ నమోదైంది. 


జిల్లాల వారీగా


ఆగ్రా- 47.51%
అలీగఢ్ -  45.91%
బఘ్‌పట్- 50.13%
బులంద్‌షహర్- 50.84
గౌతమ్ బుద్ధ్ నగర్- 47.25%
ఘజియాబాద్- 43.10%
హపుర్- 51.63%
మథుర- 48.91%
మేరట్- 47.74%
ముజఫర్‌నగర్- 52.17%
షామిలి- 53.13%


14:16 PM (IST)  •  10 Feb 2022

35.03% ఓటింగ్..

ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి విడత పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 35.03% ఓటింగ్ నమోదైంది.





12:43 PM (IST)  •  10 Feb 2022

ఎస్పీ- ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి..


మంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి సంజయ్ లాథర్ మథురలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.