Election 2022 LIVE Updates: యూపీలో ప్రశాంతంగా పోలింగ్- సాయంత్రం 5 గంటల వరకు 57.45% ఓటింగ్
UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
యూపీ నాలుగో విడత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 57.45% పోలింగ్ నమోదైంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.89 శాతం పోలింగ్ నమోదైంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.45 శాతం ఓటింగ్ నమోదైంది.
లఖింపుర్ ఖేరీలో కడిపుర్ సాని గ్రామంలో ఈవీఎంలు మోరాయించాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్కి ఈవీఎంలో ఫెవికిక్ వేయడం వల్లే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలా సేపు ఓటింగ్ నిలిచిపోయింది.
లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంబీర్‌పుర్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలీసులు ఆయనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ.. లఖ్‌నవూలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఖ్‌నవూలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Background
UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
లఖ్‌నవూ, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ, లఖింపుర్ ఖేరీ వంటి నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్ ఒకచోట గెలుపొందాయి.
మాయావతి
బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లఖ్‌నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు.
9 గంటల వరకు
ఉదయం తొమ్మిది గంటల వరకు 9.10 శాతం పోలింగ్ నమోదైంది.
ఆంక్షల సడలింపు
కరోనా వ్యాప్తి వేళ ప్రచారాలపై ఆంక్షలు విధించిన ఈసీ వాటిని క్రమంగా సడలిస్తోంది. సమావేశాలు, రోడ్‌షోలపై ఉన్న పరిమితులను సడలించింది. రాజకీయ పార్టీలు, నేతలు 50 శాతం సామర్థ్యంతో సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది.
ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే ఉన్న ఇతర నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో జనవరి 8న పాదయాత్ర, రోడ్‌షోలు, ర్యాలీలు, సభలపై ఈసీ ఆంక్షలు విధించింది. అయితే దేశంలో కొవిడ్ కేసులు భారీగా తగ్గిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించిన ఈసీ ఆంక్షలను సడలించింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -