Parliament Election Schedule : లోక్‌సభ ఎన్నికల విషయంలో వస్తున్న వార్తలపై ఢిల్లీ (Delhi)ఎన్నికల సంఘం (Ceo) క్లారిటీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 16న లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయంటూ... తామిచ్చిన తేదీ తాత్కాలికమేనని స్పష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల (General election 2024) కు ముందస్తు కార్యకలాపాలను పూర్తి చేసేందుకు... ఏప్రిల్ 16ను టార్గెట్ గా పెట్టుకున్నామని వివరణ ఇచ్చింది. ఏప్రిల్‌లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఎక్స్ వేదికగా ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి... జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. కేవలం ఎన్నికల అధికారుల ఒక సూచనగా ఉత్తర్వులు జారీ చేశామని... లోక్‌సభ ఎన్నికల తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల ముందస్తు ప్రణాళిక కోసమే
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు అనేక పనులు ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు...దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఓటర్ల జాబితా వంటి అంశాలపై సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న దానిపై ముందుగానే సన్నద్దత కావాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటిని పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ తాత్కాలిక తేదీని నిర్ణయిస్తుంది. దీనికి అనుగుణంగా మిగిలిన కార్యక్రమాల ప్రారంభ, ముగింపు తేదీలు నిర్ణయించుకుని ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేస్తుంది. 2024 ఏప్రిల్ 16న తాత్కాలిక తేదీగా నిర్ణయిస్తూ...2024 జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీ లోక్‌సభ ఎన్నికల ముందస్తు ప్రణాళిక కోసం మాత్రమేనని స్పష్టం చేసింది.
గత సార్వత్రిక ఎన్నికలు అటు ఇటు ఎన్నికలు
2019 మార్చి 10న గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29, మే 6, మే 12, మే 19 తేదీల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలు వచ్చాయి. ఈ సారి కూడా గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు అటు, ఇటుగానే...ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.