Andhra Pradesh : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులు సమరోత్సాహంతో ఎన్నికలకు సై అంటున్నారు. అధికార వైసీపీతోపాటు కూటమిలోని పార్టీలు కూడా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని, లెక్కలు వేసి మరీ అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ స్థానాలు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆసక్తిని కలిగిస్తున్న నియోకజవర్గాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే..

తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం(P.Gannavaram) నియోజకవర్గంలో అధికార వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్‌(Venugopal) పోటీ చేస్తుండగా, కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ(Giddi Satyanarayana) బరిలో నిలిచారు. అమలాపురం(Amalapuram) నుంచి మంత్రి పినెపే విశ్వరూప్‌(Pinepe Viswarup) పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన అయితాబత్తుల ఆనందరావు (Aythabattula Ananda Rao)పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. రాజోలు (Razole Assembly constituency)నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు(Gollapally Surya Rao) వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. కొద్దిరోజులు కిందట వరకు టీడీపీలో ఉన్న ఈయనకు ఆ పార్టీ టికెట్‌ నిరాకరించడంతో వైసీపీలో చేరారు. ఆయనకు వైసీపీ అధిష్టానం రాజోలు సీటును కేటాయించింది. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వరప్రసాదరావును అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి అభ్యర్థిగా దేవ వరప్రసాద్‌(Dev Varaprasad) పోటీ చేస్తున్నారు. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులు 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌ ఎన్డీఏ కూటమి
పి గన్నవరం వేణుగోపాల్‌ గిడ్డి సత్యనారాయణ( జనసేన)
అమలాపురం పినెపే విశ్వరూప్‌ అయితాబత్తుల ఆనందరావు( టీడీపీ )
రాజోలు గొల్లపల్లి సూర్యారావు దేవ వరప్రసాద్‌( జనసేన)

ముమ్మిడివరం(Mummidivaram) నుంచి వైసీపీ అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌(Ponnada Venkata Satish Kumar) కుమార్‌ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన దాట్ల సుబ్బరాజు(Datla Subbaraju) పోటీ చేస్తున్నారు. కొత్తపేట(Kottapeta) నుంచి వైసీపీ అభ్యర్థిగా చిర్ల జగ్జిరెడ్డి(Chirla Jaggireddy) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన బండారు సత్యానందరావు(Bandaru Satyananda Rao) పోటీ చేస్తున్నారు. రాజానగరం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేనకు చెందిన బత్తుల బలరామకృష్ణ బరిలో ఉన్నారు. రామచంద్రాపురం (Ramachandrapuram)నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌(Pilli Surya Prakash) పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన వాసంశెట్టి సుభాష్‌(Vasamshetty Subhash) బరిలో ఉన్నారు. ప్రత్తిపాడు(Prattipadu) నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు(Varupula Subbarao) పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ(Varupula Satyaprabha) పోటీ చేస్తున్నారు. తుని(Tuni) నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా(Dadisetti Raja) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య(Yanamala Divya) బరిలోకి దిగుతున్నారు. 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌ ఎన్డీఏ కూటమి
ముమ్మిడివరం  వెంకట సతీష్‌ కుమార్‌ దాట్ల సుబ్బరాజు( టీడీపీ )
కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానంద రావు( టీడీపీ )
రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్‌ వాసంశెట్టి సుభాష్‌ (టీడీపీ )
ప్రత్తిపాడు వరుపుల సుబ్బారావు వరుపుల సత్యప్రభ(టీడీపీ )
తుని దాడిశెట్టి రాజా యనమల దివ్య(టీడీపీ )

తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్‌ తెలుగు ప్రజలకు ఆసక్తిని కలిగిస్తున్న నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. అనేక అంశాలు, లెక్కలను పరిగణలోకి తీసుకున్న తరువాత పవన్‌ కల్యాణ్‌ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈయనపై అధికార వైసీపీ నుంచి అమలాపురం సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న వంగా గీత పోటీ చేస్తున్నారు. పెద్దాపురం నుంచి అధికార వైసీపీ నుంచి దావులూరి దొరబాబు పోటీ చేస్తుండగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రాజమండ్రి రూరల్‌ నుంచి మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తున్నారు. అనపర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి రామకృష్ణంరాజు పోటీ చేస్తున్నారు. 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌ ఎన్డీఏ కూటమి
పిఠాపురం వంగ గీత పవన్‌ కల్యాణ్‌(జనసేన)
పెద్దాపురం దావులూరి దొరబాబు నిమ్మకాయల చినరాజప్ప(టీడీపీ )
రాజమండ్రి రూరల్‌ చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి(టీడీపీ )
అనపర్తి సత్తి సూర్యనారాయణ రామకృష్ణంరాజు(బీజేపీ )

జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నర్సింహం బరిలోకి దిగుతున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ) పోటీ చేస్తున్నారు. మండపేట నుంచి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీకి చెందిన వేగుళ్ల జోగేశ్వరరావు పోటీ చేస్తుండగా, అధికార వైసీపీ నుంచి మాజీ మంత్రి తోట త్రిమూర్తులు పోటీ చేస్తున్నారు. కాకినాడ రూరల్‌ నియోకజవర్గం నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పోటీ చేస్తున్నారు. కూటమమి అభ్యర్థిగా జనసేనకు చెందిన పంతం నానాజీ పోటీ చేస్తున్నారు. రాజమండ్రి అర్బన్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న మార్గాని భరత్‌ వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఈ వాసు. కాకినాడ అర్బన్‌ నియోకజవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. రంపచోడవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన మిర్యాల శిరీష పోటీ చేస్తున్నారు. 

నియోజకవర్గం  వైఎస్‌ఆర్‌ ఎన్డీఏ కూటమి
జగ్గంపేట తోట నర్సింహం జ్యోతుల వెంకట అప్పారావు(టీడీపీ)
మండపేట తోట త్రిమూర్తులు వేగుళ్ల జోగేశ్వరరావు(టీడీపీ)
కాకినాడ రూరల్‌ కురసాల కన్నబాబు  పంతం నానాజీ(జనసేన)
రాజమండ్రి అర్బ మార్గాని భరత్‌ ఆదిరెడ్డి వాసు(టీడీపీ)
కాకినాడ అర్బన్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి వనమాడి వెంకటేశ్వరరావు(టీడీపీ)
రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి మిర్యాల శిరీష(టీడీపీ)