Delhi Election Results 2025 LIVE Updates: ఆప్‌కు షాక్ ఢిల్లీని కైవసం చేసుకున్న బీజేపీ- MLA గా కూడా ఓడిన కేజ్రీవాల్- ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు..?
Delhi Election Results LIVE Updates | ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు తేలుతున్నాయి. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని 27 ఏళ్ల తర్వాత బీజేపీ దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తాజా ఎన్నికల ఫలితాలు ఇక్కడ చూడండి:
ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. గడచిన పదేళ్లలో విద్య, వైద్య సౌకర్యాలు, మౌళిక సదుపాయాల కల్పనకు ఆప్ విశేషంగా కృషి చేసిందని చెప్పారు. బీజేపీకి అభినందనలు చెప్పిన ఆయన.. ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహించడంతో పాటు.. నిత్యం ప్రజల్లోనే ఉంటామని చెప్పారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధి సుపరిపాలనను కోరుకున్నారని బీజేపీ అది అందించగలదని నమ్మే పట్టం కట్టారని ప్రధాని నరేంద్రమోదీ X లో పోస్ట్ చేశారు. బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ఢిల్లీ సోదర సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన వారు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు.
ఎన్నికల్లో ఓటమిపాలైనా ఢిల్లీ బాగు కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఢిల్లీ ఆపద్దర్మ సీఎం అతీషీ అన్నారు. బీజేపీ రాజకీయ గూండాయిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. Kalkaj స్థానంలో తాను గెలిచినప్పటికీ సంబరాలు చేసుకునే పరిస్థితిలో లేనన్నారు. కల్కజ్ నుంచి ఆమె 3500 ఓట్ల ఆధిక్యంలో చివరి నిమిషంలో బీజేపీ నేత రమేష్ బదూరిపై గెలిచారు. బాహుబలి లాంటి ఆయనపై పోటీలో తన టీమ్ ఎంతో కష్టపడ్డారని, తన నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ సంబరాలు జరుపుకున్నారు. ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ తనయుడు. ఢిల్లీకి కాబోయే సీఎం అన్న ప్రచారం కూడా ఉంది.
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేన్ వర్మ సాహిబ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన విజయం ఖరారు అయిన వెంటనే అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ సీఎం పీఠం కోసం పోటీ పడుతున్న ముఖ్యనేతల్లో పర్వేష్ కూడా ఒకరు. ఈయన ఢిల్లీ మాజీ సీఎం (బీజేపీ) సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేన్ వర్మ సాహిబ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఆయన విజయం ఖరారు అయిన వెంటనే అమిత్ షా నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ సీఎం పీఠం కోసం పోటీ పడుతున్న ముఖ్యనేతల్లో పర్వేష్ కూడా ఒకరు. ఈయన ఢిల్లీ మాజీ సీఎం (బీజేపీ) సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఓటమి చెందారు.
Delhi Election Results 2025 LIVE Updates: ఢిల్లీ ఎన్నికల్లో విజయం ఖాయం కావడంలో బీజేపీ కార్యాలయం ఎదుట సంబరాలు మొదలయ్యాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ రాష్ట్ర పీఠంపై బీజేపీ గద్దెనెక్కుతుండటంతో కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. రోడ్డుపైన బాణాసంచ కాల్చి సంబరాలు చేశారు.
Anna Hajare On Delhi Results: ఆమ్ ఆద్మీ పార్టీ మద్యంలో మునిగిపోయిందని, అందుకే ఈ ఫలితాలనీ సామాజిక వేత్త, అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి గురువు అన్నా హజారే వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కేరక్టర్, నడవడిక ముఖ్యమైని తాను ఎప్పుడూ చెబుతుంటానని కానీ వాళ్లు తన పార్టీకి మద్యం మకిలి అంటించుకున్నారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిత్వానికి మచ్చ పడిందని ఆ పార్టీ అవినీతిమయం అయిందని గుర్తించారు కనుకే ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు.
పాార్టీ ఓటమితో షాక్‌లో ఉన్న ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి ముంగిట ఉన్నారు. ఆయన పోటీ చేసిన న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆయన ప్రత్యర్థి పర్వీష్ వర్మ 1100 ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరిగింది. కేజ్రీవాల్ పై ఇద్దరు మాజీ సీెఎంల కుమారులు పోటీ పడ్డారు. బీజేపీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వీష్ మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ మాజీ సీఎం (కాంగ్రెస్) షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ మూడో స్థానంలో ఉన్నారు
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినవేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. అవినీతి ఆప్‌ను ప్రజలు చీపురుతో ఊడ్చేశారని కామెంట్ చేశారు. ఆప్ అవినీతిని సహించలేక మేధావి వర్గాలన్నీ బీజేపీకి సపోర్ట్ చేశాయన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీలో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి లీడింగ్ లో ఉంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలలో ఆధిక్యంలో ఉందంటే..
బీజేపీ మేజిక్ ఫిగర్ దాటడంపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ సంతోషం వ్యక్తం చేశారు. అవినీతి ఆప్‌కు ప్రజలు సరైన సమాధానం చెప్పారన్నారు. "ట్రెండ్స్ ను స్వాగతిస్తున్నాం. అంతిమ ఫలితం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారని భావిస్తున్నాం. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషీ.. మనీశ్ సిసోడియా ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఇవాళ ఓడిపోతారు. "
ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి తనకేం తెలీదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. ఉదయం నుంచి ఎన్నికల ఫలితాలు వస్తుండగా తాను రిజల్ట్స్ చూడలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం వైపు వెళుతుండగా.. అధికార పార్టీ ఆప్ వెనుకబడింది. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది.
ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ స్థానంలో పోటీ తీవ్రంగా ఉంది. లీడ్ బీజేపీ- ఆప్ మధ్య మారుతూ వస్తోంది. తాజాగా కేజ్రీవాల్ వెనుకబడ్డారు. 8వ రౌండ్ ఫలితాలు తర్వాత ఆయన ప్రత్యర్థి Parvesh Verma 300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు
ఈ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్‌నే ఇస్తున్నాయి. ప్రస్తుత ఢిల్లీ సీఎం అతీషీ వెనుకంజలో ఉన్నారు. ఆమె ప్రత్యర్థి రమేష్ బిదూరీ 1142 ఓట్ల ఆధిక్యంలోే ఉన్నారు. ఓవరాల్ ఫలితాలే కాదు. ముఖ్యమైన నేతలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ సీఎం ఓటమి బాటలో ఉండగా.. ఆప్ సుప్రీం కేజ్రీవాల్ గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ పార్టీనే కాదు... స్వయంగా ఆయన కూడా గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేవలం 300 పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్ ఉన్నారు.
ఎర్లీ ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. దాదాపు 40 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించగా, ఆప్ కేవలం 20 స్థానాలలో ముందంజలో నిలిచింది.
Background
Delhi Election Results 2025 LIVE Updates | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. పోరాటం హోరాహోరీగా సాగినా భారతీయ జనతా పార్టీకే ఎడ్జ్ ఉందని ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. నేడు ఢిల్లీలో అదే సీన్ రిపీట్ అయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 42 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోండగా, ఆప్ 25 స్థానాలలో హవా కొనసాగిస్తోంది.
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 32 -37
బీజేపీకి -35-40
కాంగ్రెస్ -0-1
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -28
బీజేపీకి -39-44
కాంగ్రెస్ -02-03
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 10-19
బీజేపీకి -51-60
కాంగ్రెస్ 00-00
పీ మార్గ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 21 -31
బీజేపీకి -39-49
కాంగ్రెస్ -00-01
పోల్ డైరీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 18 -25
బీజేపీకి -42 - 50
కాంగ్రెస్ -00-02
పోల్స్ ఇన్ సైట్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 25 -29
బీజేపీకి -40 - 44
కాంగ్రెస్ -00-01
వీ ప్రిసైడ్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 46-52
బీజేపీకి - 18-23
కాంగ్రెస్ -00-01
టైమ్స్ నౌ జేవీసీ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 22 - 31
బీజేపీకి -39-45
కాంగ్రెస్ -00-02
మైండ్ బ్రింక్ ఎగ్జిట్ పోల్స్ :
ఆమ్ ఆద్మీ పార్టీ - 44-49
బీజేపీకి -21-25
కాంగ్రెస్ -00-01
ఆబ్సల్యూట్ పొలిటికో అంచనా ఇదే
హైదరాబాద్ సంస్థ ఆబ్సల్యూట్ పొలిటికో కూడా బీజేపీదే విజయం అని తేల్చింది. ఈ ఎన్నికల్లో కాషాయం విజయం ఏకపక్షమేనని ప్రకటించింది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం బీజేపీకి 43 నుంచి 52 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆమ్‌ఆద్మీ పార్టీకి 15-27 సీట్లే లభిస్తాయని అంచనాలు వేస్తోంది. కాంగ్రెస్‌కు అతికష్టమ్మీద రెండు సీట్ల వరకు వచ్చే అవకాాశం ఉందని తేల్చింది.
ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకూ బీజేపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. రెండు ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఎనిమిదో కౌంటింగ్ జరగనుంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -