Chandrababu will take oath in Amaravati itself : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని విజయం సాధించడంతో చంద్రబాబు ప్రమాణస్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. ఈ నెల తొమ్మిదో తేదీన అమరావతిలో ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. వైసీపీ గెలుస్తుందని తొమ్మిదో తేదిన విశాఖలో జగన్ ప్రమణస్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని.. చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన విజయం సాధించడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు.
Andhra Pradesh Assembly Election Results : 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం - అమరావతిలోనే వేదిక
ABP Desam
Updated at:
04 Jun 2024 12:32 PM (IST)
Assembly Elections 2024 : అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొమ్మిదవ తేదీన ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది.
9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం