Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికలు నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్ ఆఫ్టర్. నోటిఫికేషన్ రాక ముందు నుంచే పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ఎన్నికల సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజున మొదలైన కొట్లాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికార మార్పిడీ జరగడంతో కొన్ని చోట్ల ఉత్సాహంతో మరికొన్ని చోట్ల పగతో ఇంకొన్ని ప్రాంతాల్లో గెలవలేదన్న ఆగ్రహంతో గొడవలు జరుగుతున్నాయి. 


ఘర్షణ ఎలాంటిదైనా నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ అన్ని వేళ్లు మాత్రం ప్రభుత్వంవైపే చూపిస్తున్నాయి. అందుకే ఇలాంటి వాటికి తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జరిగిన ఘర్షణలపై సిట్ వేయాలని ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం. 


ఆంధ్రప్రదేశ్‌లోని సీనియర్ అధికారి ఆధ్వర్యంలో ముఖ్యమైన అధికారులతో కలిసి అసలేం జరిగింది, గొడవలకు కారణమేంటీ, నిజంగా పార్టీ కక్షలోతనే ఘర్షణలు జరిగాయా లేకుండా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట్ దర్యాప్తు సాగనుందనట. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని సమాచారం. ప్రస్తుతానికి ఆర్థిక వనరుల సమీకరణ, బడ్జెట్‌ కూర్పుపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్డ్‌గా ఉన్నారు. వీటిపై క్లారిటీ వచ్చిన తర్వాత సిట్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. 


వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఒకట్రెండు ఘర్షణలను పార్టీలకు ఆపాదించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణనిస్తోంది. అదే టైంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో ప్రజల్లో అనుమానాలు రాకుండా ఉండేలా సిట్ ఏర్పాటుతో వైసీపీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఎన్నికల టైంలో జరిగిన ఘర్షణలపై ఎన్నికల సంఘం ఒక సిట్ వేసింది. ప్రాథమికంగా ఓ నివేదిక ఇచ్చినప్పటికీ ఆ తర్వాత సిట్ ఏమైందో ఎవరూ చెప్పడం లేదు. 


నేతలతో సమావేశమైన ప్రతిసారీ ప్రతికార రాజకీయాలు వద్దని చంద్రబాబు నేతలతో చెబుతున్నారట. అలాంటి రాజకీయమే వైసీపీని దెబ్బ తీసిందని ఎట్టి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు వద్దని ప్రజలతో మమేకమయ్యే చర్యలు మాత్రమే చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ మధ్య జరిగిన రెండు పరిణామాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. తిరువూరు ఎమ్మెల్యే దూకుడుగా వైసీపీ నేత ఇంటిపైకి వెళ్లడంతో చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట. పోలీసులతో మంత్రి రామ్‌ప్రసాద్ భార్య వ్యవహరించిన తీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి రిపీట్ చేస్తే బాగోదని క్లాస్‌తీసుకున్నారు. 


ఇంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ స్థానికంగా ఉండే విభేదాలతో జరిగిన ఘర్షణలను పార్టీకి ఆపాదించడంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. దీని లెక్క తేల్చేందుకే సిట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ.