Counting Review : కౌంటింగ్‌కు రెడీ అవుతున్న అధికారులు - కీలక ఆదేశాలిచ్చిన సీఈసీ

Andhra News : కౌంటింగ్ ఏర్పాట్లపై సీఈసీ అన్ని రాష్ట్రాల సీఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లపై ఏపీ సీఈవోకి ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు.

Continues below advertisement

Elections :  దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఒకటో తేదీన చివరి దశ ఎన్నికలు పూర్తవతాయి. నాలుగో తేదీన ఓట్ల లెక్కింపుఉంటుంది.   4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్  రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సూచించారు.  రాష్ట్రాల సీఈవో లు, ఆయా నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు  వీడియో కాన్పరెన్సు  ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. 

Continues below advertisement

సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుచున్నదని సీఈీస అభినందించారు. అదే స్పూర్తితో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల  లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు.  ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎం లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద  క్రౌడ్ మేనేజ్మంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేప్టీ పరికరాలను సిద్దంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుకోవాలన్నారు. 

ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపుకు సంబందించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి  ముందస్తుగానే సరైన శిక్షణ నివ్వాలని ఆదేశించారు.  సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐ.టి. పరికాలను ముందస్తుగా ఓట్ల  లెక్కింపు కేంద్రాల సిద్దంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎం లను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్దతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి “లెక్కింపు పూర్తి అయినట్లుగా”  ఆయా ఈవీఎం లపై మార్కుచేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమపద్దతిలో సురక్షితంగా భద్రపర్చాలన్నారు.  అనవసరంగా ఈవీఎం లను అటూ ఇటూ కదిలించవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ETPBMS) ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబందించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.  ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రము ఆలశ్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటి కప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు.                                           

ఐదు దశలో ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా మరియు సిక్కిం అసెంబ్లీలతోపాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు / డి ఈ ఓ మరియు ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలెక్టోరల్  అధికారులు  వారి వారి ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా  కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి సీఈవోకు వివరించారు. 

 

Continues below advertisement