Bihar Election Result 2025: బిహార్ ఎన్నికల్లో మంచి స్కోరు చేస్తారని ప్రత్యర్థుల గెలుపోటములకు కారణమవుతారని విశ్లేషణలు వినిపించినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. తన పార్టీ విజయం కోసం కానీ, ప్రత్యర్థుల గెలుపును మార్చడంలో కానీ వ్యూహాన్ని రూపొందించలేకపోయారు. చాలా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల విజయానికి తన వ్యూహాలే కారణమని చెప్పుకున్న పీకే బిహార్‌లో బోల్తాపడ్డారు. సొంతంగా బరిలోకి దిగినప్పుడు లెక్కలన్నీ తారుమారయ్యాయి. సొంత రాష్ట్రం బిహార్‌లో ఆయన ప్రభావం చూపించలేకపోయారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (2025) ఆయన పార్టీ జన సురాజ్ చాలా దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తోంది. అసలు ఈ ఫలితాలకు కారణమేంటీ, ప్రశాంత్ కిషోర్ ఎక్కడ తప్పు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి?

Continues below advertisement

ప్రశాంత్ కిషోర్ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. రాజకీయ నిపుణులు దీన్ని వివిధ కోణాల్లో చూస్తున్నారు. కుల సమీకరణాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు జరిగిన పొరపాట్లు కూడా ఇందులో భాగమేనని భావిస్తున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం.

'పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు లేదు'

రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ శోభిత్ సుమన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్‌పైనే ప్రజలకు ఎక్కువ ఆసక్తి ఉందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇది మూడో ఫ్రంట్‌గా అభివర్ణించుకున్నారు, ఎందుకంటే ఎన్నికల ప్రారంభంలో ప్రశాంత్ కిషోర్ లేవనెత్తిన అంశాలు నేరుగా ప్రజలతో సంబంధించినవై ఉండటంతో చాలా మందిని ఆలోచనలో పడేశాయి.  జన సురాజ్ ఓటమికి అతిపెద్ద కారణం ఏమిటంటే, మొత్తం ఎన్నికల వ్యూహం సోషల్ మీడియా, యువతపై ఆధారపడి ఉంది. బిహార్‌లో పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టు లేదు.

Continues below advertisement

శోభిత్ సుమన్ మాట్లాడుతూ, "బూత్ నిర్వహణ కోసం కూడా పార్టీకి బీఎల్ఏలు లేరు. స్థానిక స్థాయిలో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, తమ వనరులను ఖర్చు చేసినప్పటికీ టికెట్ దక్కని వారు కూడా అసంతృప్తికి గురయ్యారు. ఇలాంటప్పుడు వారి ఎన్నికల ప్రచారం మొత్తం పేమెంట్‌ కార్యకర్తలు  సోషల్ మీడియా ద్వారానే జరిగింది."

తాను పోటీ చేయకుండా ప్రజలను నిరాశపరిచారు - శోభిత్

మరోవైపు, ప్రశాంత్ కిషోర్ ఇమేజ్‌ను ప్రారంభంలో బీజేపీకి బీ టీమ్‌గా తయారు చేస్తున్నారని శోభిత్ సుమన్ అన్నారు. అయితే, నితీష్ కుమార్, జేడీయూ పనితీరుపై ప్రశాంత్ కిషోర్ ఎన్ని విమర్శలు చేశారో, ఎన్నికల ఫలితాల్లో అందుకు పూర్తి విరుద్ధంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో జేడీయూకే ఎక్కువ ప్రయోజనం చేకూరింది. ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజలను నిరాశపరిచారు, ఎందుకంటే తాను ఓడిపోతే తన ఇమేజ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయనకు తెలుసు.

ఆయన మాట్లాడుతూ, "పార్టీలో అంతర్గత విభేదాలు కూడా చాలాసార్లు బయటపడ్డాయి, దీనివల్ల కార్యకర్తల మనోధైర్యం కూడా దెబ్బతింది. ప్రశాంత్ కిషోర్ స్వభావం కారణంగా కూడా ఆయన పార్టీ నాయకులే ఆయనతో ఉండలేమనే భావనకు వచ్చారు. అంసతృప్తి వ్యక్తం చేశారు. ఆయన చేసిన వాగ్దానాలన్నీ గాలిమాటలుగానే మిగిలిపోయాయి.

ప్రశాంత్ కిషోర్ ఓటమికి 5 ప్రధాన కారణాలు

1) కుల సమీకరణాలను అందుకోలేకపోవడం

2) సోషల్ మీడియా, ఇన్‌ఫ్లూయెన్స్‌ర్స్‌పై ఆధారపడి ఎన్నికల్లో పోటీ చేయడం

3) స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం

4) అసెంబ్లీ బూత్‌లలో పార్టీకి పట్టు లేకపోవడం

5) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సక్రమంగా లేకపోవడం