Maganti Sunitha Reaction on Defeat:  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత వ్యాఖ్యానించారు. ప్రతిచోట రిగ్గింగ్‌ చేయడం వల్లనే కాంగ్రెస్‌ గెలిచిందని తెలిపారు. కాంగ్రెస్‌ది గెలుపే కాదని.. నైతిక విజయం తనది, బీఆర్‌ఎస్‌దే అని ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.  అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని  ఈసీ విఫలమయిందని  అన్నారు.   పోలింగ్‌ రోజున ఎంతో అరాచకం సృష్టించారని  ఒక మహిళపై అంతమంది రౌడీయిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని తాను..  ఏం మాట్లాడినా.. కార్యకర్తలను పరామర్శించినా తప్పుగా ప్రచారం చేశారన్నారు.  గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటో ప్రజలు గమనించారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

Continues below advertisement