Election Results 2022 Live: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి భాజపా సర్కార్- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయకేతనం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేయండి.

ABP Desam Last Updated: 08 Dec 2022 05:32 PM
ప్రధాని స్పందన

గుజరాత్ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పార్టీ కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు


" మా పార్టీకి నిజమైన బలం అయిన మా కార్యకర్తల అసాధారణమైన కృషి లేకుండా ఈ చారిత్రక విజయం ఎప్పటికీ సాధ్యం కాదు.     "
-       ప్రధాని మోదీ





సీఎం రాజీనామా

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ మార్కు దాటింది.

సీఎం అభ్యర్థి ఓటమి

ఆమ్‌ఆద్మీ గుజరాత్‌ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గద్వీ 19 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

కొనసాగుతోన్న కౌంటింగ్

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటివరకు 16 స్థానాలను గెలుచుకుని.. 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించగా. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.





సీఎం రాజీనామా

మరికొద్ది సేపట్లో గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు.





భారీ ఆధిక్యంలో డింపుల్

ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్.. 2,40,322 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ కొనసాగుతోంది.





జడేజా రోడ్‌ షో

జామ్‌నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రివాబా జడేజా తన భర్త, క్రికెటర్ రవీంద్ర జడేజాతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈసీ లెక్కల ప్రకారం రివాబా AAP అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్మూర్‌పై 50,456 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.





అఖిలేశ్‌కు బూస్ట్

శివపాల్ సింగ్ యాదవ్.. తన పార్టీని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.






" మేము ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)ని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేశాం. 2024లో ఐక్యంగా పోరాడతాం. నేటి నుంచి సమాజ్‌వాదీ పార్టీ జెండానే కారుపై ఉంటుంది. "
- శివపాల్ సింగ్ యాదవ్

కాంగ్రెస్‌లో జోష్

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ మెజారిటీ 35 స్థానాలను అధిగమించడంతో కార్యకర్తలు పార్టీ దిల్లీ కార్యాలయం ముందు బాణసంచా పేల్చారు.





హిమాచల్ ప్రదేశ్

కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచి 39 చోట్ల ఆధిక్యంలో ఉంది. భాజపా 4 స్థానాల్లో గెలిచి 21 చోట్ల ఆధిక్యంలో ఉంది. లెక్కింపు కొనసాగుతోంది.





వెనుకంజ

AAP సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ ఖంబలియా నియోజకవర్గం నుంచి 14761 ఓట్లు వెనుకబడి ఉన్నారు.





స్వింగ్‌లో కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 40 స్థానాల్లో, బీజేపీ- 24 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. భాజపా ఇప్పటికే 1 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు -3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.





సంబరాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేస్తున్న సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర BJP చీఫ్ CR పాటిల్ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తన నియోజకవర్గం ఘట్లోడియా నుంచి 1,07,960 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.





లీడ్‌లో ములాయం కోడలు

ఉత్తర్‌ప్రదేశ్‌ మెయిన్‌పురి లోక్‌సభ స్థానంలో ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ ఇప్పటి వరకు మొత్తం 1,58,485 ఓట్లు సాధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.





ఓ స్థానం బీజేపీ కైవసం

హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఓ స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ 37 స్థానాల్లో లీడ్‌లో ఉండగా...బీజేపీ 27 చోట్ల ముందంజలో ఉంది. స్వతంత్ర అభ్యర్థులు మూడు చోట్ల లీడ్‌లో ఉన్నారు. 





కాంగ్రెస్ లీడ్

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ 37 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ ఒక స్థానంలో గెలిచి 27 చోట్ల ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్కు 35. 





లీడ్‌లో కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ ఒక చోట గెలిచి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.





లీడ్‌లో రివాబా జడేజా

ఎర్లీ ట్రెండ్స్‌లో వెనుకబడిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా.. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నారు. కౌంటింగ్ కొనసాగుతోంది.

లోక్‌సభ ఉప ఎన్నికలు

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన మొయిన్‌పురి లోక్‌సభ స్థానంలో SP అభ్యర్థి డింపుల్ యాదవ్ 54,797 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు; లెక్కింపు కొనసాగుతోంది





భాజపా సంబరాలు

గుజరాత్‌లో భాజపా అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో గాంధీనగర్‌లో మహిళా బీజేపీ కార్యకర్తలు డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.


 





150 కొట్టిన భాజపా

ఈసీ అధికారిక లెక్కల ప్రకారం 182 స్థానాలకు గాను 152 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ -18; AAP - 7; ఇతరులు -5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.





భాజపా జోరు

గుజరాత్‌లో కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం భాజపా 149 స్థానాల్లో, కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.





ఉత్కంఠ

హిమాచల్ ప్రదేశ్‌లో మెజారిటీ మార్కు 35 కాగా ప్రస్తుతం కాంగ్రెస్ 33, బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.





మోర్బీలో భాజపా

మోర్బీలో భాజపా అభ్యర్థి కాంతిలాల్ అమృతియా మొత్తం 10,156 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అక్టోబరులో మోర్బి వంతెన కూలిన సమయంలో ఆయన చాలా మంది ప్రాణాలను రక్షించారు.





లీడ్‌లో కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 32 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో & ఇండిపెండెంట్‌లు-4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.





భాజపా 142

ఎన్నికల సంఘం ప్రకారం.. గుజరాత్‌లో భాజపా 142 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ఎర్లీ ట్రెండ్స్ చూపిస్తున్నాయి. కాంగ్రెస్ 20 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.





నువ్వా-నేనా

68 మంది స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో భాజపా-30, కాంగ్రెస్-30 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు రెండు పార్టీలు పోట్లాడుతున్నాయి.





సీఎం ముందంజ

హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తన నియోజకవర్గం సెరాజ్‌లో మొత్తం 14,921 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.





లీడ్‌లో సీఎం

గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన నియోజకవర్గం ఘట్లోడియాలో మొత్తం 23,713 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.





హార్దిక్ పటేల్

భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ పాటిదార్ నేత హార్దిక్ పటేల్ వెనుకంజలో ఉన్నారు.

ఆప్ సీఎం అభ్యర్థి

ఎర్లీ ట్రెండ్స్‌లో భాజపా హవా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. మరోవైపు ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గధ్వి ఖంభాలియా స్థానం నుంచి వెనుకంజలో ఉన్నారు.

2022లో గుజరాత్లో కాంగ్రెస్ ఓటమి

గుజరాత్ ట్రెండ్స్‌ తమకు వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్ మొదటిసారి అంగీకరించింది. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ ఏబీపీ న్యూస్ తో మాట్లాడుతూ ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ప్రజల తీర్పును అంగీకరిస్తాం' అని పేర్కొన్నారు.

Election Results 2022 : హిమాచల్ ఫలితాల అధికారిక గణాంకాలు

ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఓటు షేర్ ఇప్పటి వరకు 45 శాతానికి పైగా ఉంది.

Election Results 2022 : 150 సీట్లు దాటిన బీజేపీ

గుజరాత్ లో బీజేపీ బలం 150 దాటింది. ప్రస్తుతం కాంగ్రెస్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానం ట్రెండ్స్ లో 9కి పెరిగింది.

ఆధిక్యంలో రవీంద్రజడేజా భార్య రివాబా జడేజా

గుజరాత్ లోని జామ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా క్రికెటర్ రవీంద్రజడేజా భార్య రివాబా జడేజా పోటీ చేస్తున్నారు. దక్షిణ గాంధీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు.

బీజేపీ కార్యాలయాలు, అభ్యర్థుల ఇంటి వద్ద సంబరాలు

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ దూసుకెళ్లింది. ఈసారి కూడా ప్రభుత్వంలో బీజేపీ కొలువుదీరనుంది. దీంతో గుజరాత్‌లో బీజేపీ కార్యాలయాలు, అభ్యర్థుల ఇంటి వద్ద సందడి నెలకొంది. 

Election Results 2022 : గుజరాత్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

గుజరాత్ లో బీజేపీ 139 స్థానాల్లో ముందంజలో ఉంది. ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ సీట్లు 32కు పడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది.

హిమాచల్ ప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఘోరమైన ఓటు శాతం

హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఇప్పటివరకు ఓటు వాటా 1 శాతం కంటే తక్కువ. అదే సమయంలో బీజేపీకి 50 శాతం, కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి

Election Results 2022: ఆమ్ ఆద్మీ పార్టీకి 19 శాతం ఓట్లు

గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బీజేపీకి 52 శాతం, కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు వచ్చాయి.

Election Results 2022 : ఆధిక్యంలో సీఎం భూపేంద్ర పటేల్

గుజరాత్ ట్రెండ్స్ లో బీజేపీ ముందంజలో ఉంది. ఘట్ లోడియా స్థానం నుంచి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ముందంజలో ఉన్నారు. గుజరాత్ లో బీజేపీ 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సూరత్ లో బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Election Results 2022: గుజరాత్-హిమాచల్‌లో అన్ని సీట్ల ట్రెండ్స్ ఎలా ఉందంటే?

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లోని అన్ని స్థానాల్లో ట్రెండ్స్ వచ్చాయి. గుజరాత్ లో బీజేపీ 128, కాంగ్రెస్ 49, ఆప్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కాంగ్రెస్, బీజేపీ చెరో 33 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులకు రెండు సీట్లు దక్కాయి.

Background

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒక దశలో, గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.


గుజరాత్లోని 37 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా... బీజేపీ దూసుకెళ్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో బీజేపీకి ఆధిక్యం లభించింది. 182 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 92. ఈసారి ఓటింగ్ శాతం 2012 కంటే తక్కువగా ఉంది. 2017లో గుజరాత్‌లో 68.39 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి 64.33 శాతం పోలింగ్ నమోదైంది. ద్రవ్యోల్బణం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడం, పెద్ద ప్రాజెక్టులకు భూసేకరణ, రైతుల సమస్యలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇషుదన్ గధ్వీ, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ సహా 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది. 


గత 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి విజయం సాధిస్తామన్న ధీమాతో బీజేపీ ఉంది. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం గుజరాత్ లో బీజేపీదే విజయం అని అంచనా వేశాయి. గుజరాత్‌లో బీజేపీకి 128-140 సీట్లు, కాంగ్రెస్‌ 31-43 సీట్లు, ఆప్‌కు 3-11 సీట్లు, ఇతరులకు 2-6 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సీ-వోటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.


హిమాచల్ ప్రదేశ్ లో 10 వేల మంది భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు, ఇతర సహాయక సిబ్బంది పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో 76.44 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది, కానీ హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది.


హిమాచల్ ప్రదేశ్ లో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ బిజెపి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 33 నుంచి 41 సీట్లు, కాంగ్రెస్ కు 24 నుంచి 32 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 0-4 సీట్లు, ఇతరులకు 0-4 సీట్లు వస్తాయని ఏబీపీ సర్వే అంచనా వేసింది.


'గుజరాత్లో బీజేపీ తన రికార్డును బద్దలు కొడుతుంది'



గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోడీ మాట్లాడుతూ, "గుజరాత్ అంతటా బిజెపి తన రికార్డును బద్దలు కొడుతుంది. బీజేపీకి అత్యధిక శాతం వస్తుంది. ఈ మధ్యాహ్నం నాటికి మాకు ఫలితాలన్నీ తెలుస్తాయి. బీజేపీ పెద్ద ఎత్తున గెలుస్తుంది. బీజేపీ అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేస్తోందని అన్నారు.


 ఎగ్జిట్ పోల్స్ విఫలం అవుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అన్నారు.



గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ వేవ్ ఉందని జిగ్నేష్ మేవానీ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్ కు, దేశానికి కొత్త దిశను ఇస్తాయని, రాష్ట్రంలో మార్పు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు నిరంకుశత్వానికి, నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీకి 120 సీట్లు వస్తాయి. అన్నారు. 



- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.