Assembly Election Results 2024 LIVE: అరుణాచల్‌లో జోరు ప్రదర్శిస్తున్న బీజేపీ, సిక్కింలో ఆ పార్టీదే అధికారం - లైవ్ అప్ డేట్స్
Arunachal Pradesh Sikkim Assembly Election Results 2024 LIVE: అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో నేడు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది. అరుణాచల్ లో ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది.
Background
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు (జూన్ 2) విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఉదయం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా.. ఇప్పటికే...More
BJP in Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగనుంది. అక్కడ మొత్తం 60 స్థానాలు ఉండగా.. 31 స్థానాలు గెల్చుకుంటే అధికారం చేజిక్కించుకోవచ్చు. అలాంటిది పది స్థానాలు ఎన్నికల ముందే అక్కడ ఏకగ్రీవం అయ్యాయి. నేడు జరుగుతున్న మిగిలిన స్థానాల ఓట్ల లెక్కింపులో మెజార్టీ మార్కుకు అవసరమైన 31 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అధిగమించింది. ఏకగ్రీవమైన 10 స్థానాలు కలుపుకొని కనీసం 33 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు. మరో 14 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీనే జోరు ప్రదర్శిస్తోంది.