Andhra Pradesh News: ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం అరకు వ్యాలీ. ప్రస్తుతం ఈ నియోజకవర్గ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో ఒకసారి టిడిపి రెండుసార్లు, వైసిపి విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో 1,87,357 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష వాటర్ లో 91,412 మంది కాగా, మహిళా ఓటర్లు 95,934 మంది ఉన్నారు. 


గత ఎన్నికల ఫలితాలు ఇవే


2009లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా అరకు నియోజకవర్గం ఏర్పాటు అయింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ టిడిపి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సివేరి సోమ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వి కాంతమ్మపై 402 ఓట్ల తేడాతో ఈయన విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయం సాధించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన కిడారి సర్వేశ్వరరావు విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి నుంచి పోటీ చేసిన శివేరి సోమపై 34,053 ఓట్ల తేడాతో సర్వేశ్వరరావు గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన శెట్టి ఫల్గుణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేసిన దొన్ను దొరపై 25,441 ఓట్ల తేడాతో శెట్టి ఫల్గుణ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో దొన్ను దొర ఇక్కడ నుంచి బరిలోకి దిగనున్నారు.


వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గము నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన అరకులో వైసీపీ బలంగా ఉంది. గడిచిన రెండు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోను వైసీపీ విజయం ఎలక్షన్ గా అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన దొన్ను దొర బలమైన నేత కావడంతో.. వైసీపీ అధిష్టానం అందుకు అనుగుణంగానే బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో అధినాయకత్వం ఉంది. వైసీపీలో ఈ సీటును ఆశిస్తున్న వారి సంఖ్య ఐదుగురు వరకు ఉంది. వీరిలో ఎవరికి అధిష్టానం సీటును కేటాయిస్తుందో అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అరకు ఎంపీ బొడ్డేటి మాధవిని తొలుత సమన్వయకర్తగా నియమించిన అధిష్టానం ఆ తర్వాత మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పై స్పష్టత రావాల్సి ఉంది.