Elections 2024 :  పోలింగ్ అనంతరం ఏపీలో ఏర్పడిన అల్లర్లతో కౌంటింగ్ తర్వాత మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరికలు చేయడంతో పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాు.  ఎలాంటి కఠిన పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా మాబ్ ఆపరేషన్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే బలగాలు సిద్ధమయ్యాయి. పహారా కూడా కాస్తున్నారు. పలు చోట్ల ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి సన్నాహాలను పోలీసులు ప్రారంభఇంచారు. 


పామూరు సెంటర్‌లో మాక్ డ్రిల్ నిర్వహించిన పోలీసులు                                                    


సార్వత్రిక ఎన్నికలు -2024 కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించటమే ధ్యేయంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐపియస్ ఆదేశాల మేరకు ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఆధ్వర్యంలో ఆర్ముడ్ రిజర్వు పోలీస్ సిబ్బంది సోమవారం కనిగిరిలోని పామూరు బస్టాండ్ జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బందితో "మాబ్ ఆపరేషన్"మాక్ డ్రిల్ నిర్వహించారు.  


అల్లర్లకు పాల్పడితే అణిచివేత          


ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో ఎలా స్పందించాలి అనే అంశంపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు.   జన సమూహాలను కంట్రోల్ చేయుటకు మొదటగా వార్నింగ్ ఇవ్వడం,  అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించడం,  ఉద్రిక్త పరిస్థితుల్లో తమను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్ చేయడం,  ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించడం,  ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి  ఫైరింగ్ చేయుట వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు.   


అత్యవసర పరిస్థితిని అదుపులోకి  తెచ్చేందుకు ప్రత్యేక టీములు  


జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరిమూకలను అణచి వేసేందుకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా  పోలీసులు  నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు.  


సున్నితమైన ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహణ                                  


ఇలాంటి  మాక్ డ్రిల్స్ పలు చోట్ల నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ అనంతరం ఎలాంటి చిన్న ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అల్లర్లపై సిట్ దర్యాప్తు  జరుపుతోంది. ఇందులో ఉద్దేశపూర్వకంగా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని తేలడంతో అనేక మంది అధికారులపైనా  కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కౌంటింగ్ అనంతర పరిస్థితులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయంచారు.