Lok Sabha Election 2024 LIVE Updates: ఏపీలో రిజల్ట్ ఆలస్యమయ్యే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు ఇవే
Lok Sabha Election 2024 LIVE: దేశ వ్యాప్తంగా జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటిగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి విజేతల్ని ఈసీ ప్రకటించనుంది.
కౌంటింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో డ్రోన్లతో పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 నుంచి 9 సీట్లు నెగ్గుతుందని, బీజేపీ 7 నుంచి 9 స్థానాల్లో గెలవగా, ఇతరులు ఒక సీటు నెగ్గుతారని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ లో తేలింది.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశంలో జరిగిన ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని వెల్లడించారు. ఈ ఓటర్ల సంఖ్య G7 కూటమి దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్‌లో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన వివరించారు.
ఏపీలో అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే 1) భీమిలి, పాణ్యంలలో అత్యధికంగా 26 రౌండ్స్‌లో కౌంటింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపునకు దాదాపు 9 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది. అత్యల్పంగా కొవ్వూరు, నరసాపురంలో అత్యల్పంగా 13 రౌండ్స్ జరుగుతుంది. దాదాపు 5 గంటలపాటు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో చూస్తే నరసాపురం, రాజమండ్రిలలో కేవలం 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. దాదాపు 5 నుంచి 6 గంటల్లో కౌంటింగ్ పూర్తి కానుంది.
ఏపీలో పార్లమెంట్ విషయానికొస్తే అమలాపురంలో అత్యధికంగా 27 రౌండ్స్ కౌంటింగ్ జరుగుతుంది. దాదాపు 9 నుంచి 10 గంటలపాటు ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం ఉంది.
Background
ఎవరి భవిష్యత్ ఏంటో మంగళవారం నాడు తేలిపోనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు, ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా అనేది రేపటితో తేలిపోతుంది. ఏపీలో మరో ఐదేళ్లు ఎవరి పాలించనున్నారో స్పష్టం కానుంది. ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు ఆ రహస్యాన్ని బహిర్గతం కానుంది. ఏ గట్టున ఎవరో మంగళవారం తెలిసిపోనుంది. ప్రజల మనసులు గెలుచుకుంది ఎవరు... అధికారాన్ని స్థాపించేది ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది.
ఏపీతో పాటు తెలంగాణ లోక్‌సభ ఫలితాలు
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల క్రతువు ఒక ఎత్తు అయితే మంగళవారం (జూన్ 4న) జరిగే ప్రక్రియ మరో ఎత్తు. ఇది చాలా కీలకం అందుకే ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే పోలింగ్, అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు, తిరుపతి, అనంతపురం మూడు ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగాయి. దీంతో ఈసీ, పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అసలు అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నిఘా నీడలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అడుగడుగడునా బారికేడ్లు దర్శనమిస్తున్నాయి. ఖాకీలు దర్శనమిస్తున్నాయి. పది మంది కలిసి తిరుగుతున్నా ప్రశ్నిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మరింత సెక్యూరిటీ కల్పించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను పెట్టారు. అధికారిక అనుమతి లేని వ్యక్తులను ఆ పరిసరాల్లోకి రానివ్వడం లేదు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కౌంటింగ్ రోజైన మంగళవారం 144 సెక్షన్ విధించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, హింసను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అసలే కౌంటింగ్ సమయం కావడంతో ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా సలహా ఇస్తున్నారు. పార్టీలను కూడా రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అనవసరమైన రచ్చ చేస్తే బాగోదని చెబుతున్నారు. పార్టీలు, పార్టీల నాయకులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రంలోని శాంతి భద్రతలు కాపాడటం ఒక్క టాస్క్ అయితే... కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో పరిస్థితి చేయిదాటిపోకుండా చూడటం కూడా పోలీసులకు, అధికారులకు బిగ్ టాస్క్, ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌పై వివాదం నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకొని కచ్చితంగా నిలదీస్తామంటూ అధికారి పార్టీ ప్రకటించేసింది. చిన్న మిస్టేక్ జరిగినా వదిలేయొద్దని తమ పార్టీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చింది.
ఈసారి కౌంటింగ్ కేంద్రంలో భారీగా ఏజెంట్లు ఉండబోతున్నారు. గుర్తింపు పొందిన పార్టీల ఏజెంట్లతోపాటు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రంలో ఉంటారు. ఒక్కో అభ్యర్థి తరఫున ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటు ఉంటారు. ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లాల్లో భారీగా ఏజెంట్లు గుర్తింపు పొందిన పార్టీ నుంచి హాజరవుతారు. అదే టైంలో స్వతంత్ర అభ్యర్థి తరఫున కూడా ఏజెంట్లు లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారు.
తెలంగాణ అభ్యర్థులు వీళ్లే..
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల విజేతలుగా ప్రజలు ఎవర్నీ డిసైడ్ చేశారో మంగళవారం మధ్యాహ్నం వరకు తేలిపోతుంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వీళ్లే
నియోజకవర్గం పేరు | కాంగ్రెస్ అభ్యర్థి పేరు | బీజేపీ అభ్యర్థి పేరు | బీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు | |
1 | ఆదిలాబాద్ | సుగుణ కుమారి | గెడ్డెం నగేష్ | ఆత్రం సక్కు |
2 | పెద్దపల్లి | గడ్డం వంశీకృష్ణ | మాసగోని శ్రీనివాస్ | కొప్పుల ఈశ్వర్ |
3 | కరీంనగర్ | వెలిచర్ల రాజేందర్రావు | బండి సంజయ్ | వినోద్‌కుమార్ |
4 | నిజామాబాద్ | జీవన్ రెడ్డి | ధర్మపురి అరవింద్ | బాజిరెడ్డి గోవర్దన్ |
5 | జహీరాబాద్ | సురేష్‌కుమార్ | బీబీపాటిల్ | గాలి అనిల్ కుమార్ |
6 | మెదక్ | నీలంమధు | రఘునందన్ రావు | వెంకట్రామిరెడ్డి |
7 | మల్కాజిగిరి | సునీతా మహేందర్‌రెడ్డి | ఈటల రాజేందర్ | రాగిడి లక్ష్మారెడ్డి |
8 | సికింద్రాబాద్ | దానం నాగేందర్ | కిషన్ రెడ్డి | పద్మారావు గౌడ్ |
9 | హైదరాబాద్ | అసదుద్దిన్ ఓవైసీ | మాధవీలత | గడ్డం శ్రీనివాస్ యాదవ్ |
10 | చేవెళ్ల | రంజిత్ రెడ్డి | కొండా విశ్వేశ్వర్‌రెడ్డి | కాసాని జ్ఞానేశ్వర్ |
11 | మహబూబ్‌నగర్ | చల్లా వంశీచంద్‌రెడ్డి | డీకే అరుణ | మన్నె శ్రీనివాస్ రెడ్డి |
12 | నాగర్ కర్నూలు | మల్లురవి | భరత్ ప్రసాద్ | ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ |
13 | నల్గొండ | రఘువీర కుందూరు | శానంపుడి | సైదిరెడ్డి కంచర్ల కృష్ణారెడ్డి |
14 | భవనగిరి | కిరణ్‌కుమార్ రెడ్డి | బూర నర్సయ్య | క్యామ మల్లేష్ |
15 | వరంగల్ | కడియం కావ్య | ఆరూరి రమేష్ | మారేపల్లి సుధీర్ కుమార్ |
16 | మహబూబాబాద్ | బలరాం నాయక్ | సీతారాంనాయక్ | మాలోత్ కవిత |
17 | ఖమ్మం | రామసహాయం రఘురామ్ రెడ్డి | వినోద్‌రావు | నామా నాగేశ్వరరావు |
- - - - - - - - - Advertisement - - - - - - - - -