AP Election Results 2024 Winners LIVE: ఏపీలో కూటమి అభ్యర్థుల ప్రభంజనం - 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు
AP Lok Sabha Election Results 2024 Winners LIVE: ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మొత్తం 25 స్థానాలకు గాను 16 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించారు. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జనసేన 2 చోట్ల, బీజేపీ 2 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ ఒక స్థానంలో విజయం సాధించగా.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
AP Election Results 2024 Winners LIVE: కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డిపై 69,050 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల 1.34 లక్షల ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోయారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు. మరో 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జనసేన ఒక చోట, బీజేపీ ఒక చోట విజయం సాధించాయి. వైసీపీ ఒక స్థానంలో విజయం సాధించగా.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచింది. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, గుంటూరు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు, హిందూపురం ఎంపీ అభ్యర్థి పార్థసారథి విజయం సాధించారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీలో కూటమి అభ్యర్థుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ ఎంపీ అభ్యర్థులు 3 చోట్ల విజయం సాధించగా.. 13 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ 1 స్థానంలో విజయం సాధించగా.. 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 1 స్థానంలో విజయం సాధించగా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన ఎంపీ అభ్యర్థులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ అసెంబ్లీతో పాటే లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2.. వైసీపీ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
AP Loksabha Election Results 2024: టీడీపీ ఎంపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని 1.58 లక్షల ఓట్లు, అమలాపురం - హరీష్ (1.54 లక్షల ఓట్లు), విశాఖ -శ్రీభరత్ (1.69 లక్షల ఓట్లు), శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు (1.70 లక్షలు), ఒంగోలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి (8,223 ఓట్ల ఆధిక్యం), హిందూపురం - పార్థసారథి (50 వేల ఓట్లు), అనంతపురం - లక్ష్మీనారాయణ (88 వేల ఓట్ల ఆధిక్యం), ఏలూరు - మహేష్ కుమార్ (86 వేల ఓట్లు), విజయనగరం - అప్పలనాయుడు (81 వేల ఓట్లు), నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు (80 వేల ఓట్లు), చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ (81 వేల ఓట్లు), నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (లక్ష ఓట్లు) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Background
AP Lok Sabha Election Results 2024 Winners LIVE: ఏపీలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఎంపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ కూటమి అభ్యర్థులు 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ 4, జనసేన 2, బీజేపీ 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాలతో టీడీపీ బీజేపీ జనసేన శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -