AP Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే

Andhra Pradesh Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Ganesh Guptha Last Updated: 04 Jun 2024 01:33 PM
ఏపీలో టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నది వీరే

AP Loksabha Election Results 2024: టీడీపీ ఎంపీ అభ్యర్థులు భారీ ఆధిక్యాలతో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని 1.58 లక్షల ఓట్లు, అమలాపురం - హరీష్ (1.54 లక్షల ఓట్లు), విశాఖ -శ్రీభరత్ (1.69 లక్షల ఓట్లు), శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు (1.70 లక్షలు), ఒంగోలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి (8,223 ఓట్ల ఆధిక్యం), హిందూపురం - పార్థసారథి (50 వేల ఓట్లు), అనంతపురం - లక్ష్మీనారాయణ (88 వేల ఓట్ల ఆధిక్యం), ఏలూరు - మహేష్ కుమార్ (86 వేల ఓట్లు),  విజయనగరం - అప్పలనాయుడు (81 వేల ఓట్లు), నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు (80 వేల ఓట్లు), చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ (81 వేల ఓట్లు), నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (లక్ష ఓట్లు) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రభంజనం - 1.5 లక్షల ఓట్ల లీడ్ లో పెమ్మసాని

AP Loksabha Election Results 2024: గుంటూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 1.5 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకూ 3,44,736 ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఈయన.. ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై స్పష్టమైన ఆధిక్యం కొనసాగుతున్నారు.

భారీ ఆధిక్యంలో రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి

AP Loksabha Election Results 2024: రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌పై 2 లక్షల ఆధిక్యంలో ఉన్నారు.

ఏపీలో కూటమి ఎంపీ అభ్యర్థుల ప్రభంజనం - 16 స్థానాల్లో లీడింగ్

AP Loksabha Election Results 2024: ఏపీలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మొత్తం 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. వైసీపీ 3 స్థానాలు, జనసేన 2, బీజేపీ 4 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.

విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యం

AP Loksabha Election Results 2024: విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై 31,574 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాలు - లీడ్ లో కూటమి అభ్యర్థులు

AP Loksabha Election Results 2024: ఏపీలో కూటమి ఎంపీ అభ్యర్థులు లీడ్ లో దూసుకెళ్తున్నారు. అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మచిలీపట్నం - బాలశౌరి గౌడ్ (జనసేన), నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ), బాపట్ల - టి.కృష్ణప్రసాద్ (టీడీపీ), కర్నూల్, హిందూపూర్, అమలాపురం, కాకినాడ, శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు, నరసాపురం, గుంటూరు, విజయవాడ, చిత్తూరు, అనంతపురం, విజయనగరం స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధిక్యం

AP Loksabha Election Results 2024: కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. తొలుత టీడీపీ ఎంపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగగా.. నాలుగో రౌండ్ ముగిసేసరికి 13,182 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి వెనుకంజ - టీడీపీ అభ్యర్థి ముందంజ

కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున షర్మిల బరిలో నిలిచారు. దీంతో ఈ స్థానం మరింత ఆసక్తిగా మారింది.  తొలుత అవినాష్ ఆధిక్యంలో కొనసాగగా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. కూటమి అభ్యర్థి భూపేష్ రెడ్డి ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు.

విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్న ఆధిక్యం

విజయవాడలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ముందంజలో ఉన్నారు.

కడపలో షర్మిలకు షాక్ - వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజ

కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. అవినాష్‌కు 4,362, భూపేష్ 2088, వైస్ షర్మిల 1101 ఓట్లు వచ్చాయి.

నెల్లూరులో వైసీపీకి షాక్ - వెనుకబడ్డ విజయసాయిరెడ్డి

నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో వైసీపీకి ఇప్పటికి షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్‌లలో విజయసాయిరెడ్డి వెనుకబడ్డారు. ఆ స్థానంలో టీడీపీ అభ్యర్థి వేమురెడ్డి లీడ్‌లో ఉన్నారు. 

రాజమండ్రిలో బీజేపీ - నరసరావుపేటలో టీడీపీ ఆధిక్యం

రాజమండ్రిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి 617 ఓట్ల లీడ్ లో ఉన్నారు. అటు, నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు లీడ్ లో ఉన్నారు.

నరసరావుపేటలో లావుకృష్ణదేవరాయులు లీడ్‌

ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో నరసరావుపేటలో టీడీపీ లీడ్‌లో ఉంది. అక్కడి నుంచి పోటీ చేసిన కృష్ణదేవరాయులు ముందంజలో ఉన్నారు. 

ఏపీ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం - క్షణక్షణం లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడండి

ఏపీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ఉదయం 8:30కు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Background

Andhra Pradesh Lok Sabha Election Results 2024 Live Updates: ఏపీ లోక్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి దాదాపు 4 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా.. వీటి లెక్కింపునకు ప్రత్యేక కౌంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏపీవ్యాప్తంగా మొత్తం 454 ఎంపీ అభ్యర్థులు బరిలో నిలవగా.. అత్యధికంగా విశాఖ పార్లమెంట్ బరిలో 33 మంది అభ్యర్థులు.. అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది. ఈ ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అటు, రాజమహేంద్రవరం, నర్సాపురం లోక్ సభకు సంబంధించి 13 రౌండ్లు లెక్కింపు జరగనుండగా.. ఫలితం వచ్చేసరికి 5 గంటల సమయం పడుతుంది.


పటిష్ట భద్రత


రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ రోజు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తాడిపత్రి, మాచర్ల, తిరుపతి నియోజకవర్గాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూండంచెల భద్రత ఉంటుందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. మొత్తం 119 మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన ఫోన్ల వరకూ తీసుకెళ్లవచ్చని సూచించారు. 


నరాలు తెగే ఉత్కంఠ


రాష్ట్రవ్యాప్తంగా 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. 26,473 మంది హోం ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తం కాగా ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై అధికార వైసీపీ సహా, టీడీపీ కూటమి నేతలు సైతం ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికార వైసీపీ 22 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే స్థాయిలో ఎంపీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు, టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి నేతలు సైతం అధిక ఎంపీ స్థానాలు తామే కైవసం చేసుకుంటామని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా కడప ఎంపీ స్థానంపై అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బరిలో నిలిచారు. వైసీపీ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. అటు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం నెల్లూరు స్థానం నుంచి గెలుపుపై ధీమాగా ఉన్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.