AP Election Results 2024 Winners LIVE: వైసీపీ ఘోర పరాభవం - కేవలం 10 స్థానాల్లోనే విజయం
AP Assembly Election Results 2024 Winners LIVE: ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 64 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందగా.. 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ గెలిచింది! ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గెలిచారు అని ట్వీట్ చేశారు. ఈరోజు నా గుండె కృతజ్ఞతతో నిండిపోయింది. తమ కూటమి విజయం కోసం అఖండ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ భవిష్యత్తు పట్ల పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమ నిబద్ధత చూపించారని కొనియాడారు. కూటమి నాయకులు, కార్యకర్తల కృషి, అంకిత భావం, ధైర్యంగా పోరాడిన ఫలితం ఎన్నికల్లో అఖండ విజయం. ఈ అద్భుతమైన విజయాన్ని అందించిన అందర్నీ అభినందించారు.
AP Election Results 2024 Winners LIVE: విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భారీ మెజార్టీ సాధించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 94,058 ఓట్ల మెజార్టీతో.. వైసీపీ అభ్యర్థి, మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై గెలుపొందారు. ఇక ఇదే జిల్లాలోని భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇది రాష్ట్రంలోనే రెండో అత్యదిక మెజార్టీ.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - 2024 ఫలితాల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 10 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పులివెందుల - వైఎస్ జగన్, పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బద్వేల్ (ఎస్సీ) - దాసరి సుధ, మంత్రాలయం - వై.బాలనాగిరెడ్డి, ఆలూరు - బూసినే విరుపాక్షి, యర్రగొండపాలెం (ఎస్సీ) - తాటిపర్తి చంద్రశేఖర్, అరకు (ఎస్టీ) - రేగం మత్స్యలింగం, పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రాజంపేట - ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి - పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలుపొందారు.
AP Assembly Election Results 2024: ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలతో పాటు, వివిధ అంశాలపై వారు చర్చించారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూసింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకున్న ఆ పార్టీ ఈసారి కేవలం 10 స్థానాలకే పరిమితమైంది.
AP Assembly Election Results 2024: ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఘన విజయం సాధించారు. 'ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా గౌరవిస్తున్నాను. ఈ ఫలితాలు చూస్తుంటే ప్రజలు మనసుతో అలోచించి ఓటు వేసి తీర్పు ఇచ్చారు. ఈ విజయం చాలా ఆనందంగా ఉంది. వైసీపీ నాయకులు ఓడిపోతున్నామని తెలిసి కూడా ప్రగల్భాలు పలికారు. గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.' అని పేర్కొన్నారు.
AP Assembly Election Results 2024: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి పి.ఉమాశంకర్ గణేష్ పై 23,860కి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అయ్యన్న.. ఇప్పటివరకూ 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఏడుసార్లు గెలుపొందారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని.. సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథంవైపు సాగుదామని పిలుపునిచ్చారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన వేళ.. సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను పంపారు.
AP Election Results 2024 Winners LIVE: చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని 42,557 ఓట్ల మెజార్టీతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై విజయం సాధించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రాంనారాయణరెడ్డి, చిత్తూరు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు.
AP Election Results 2024 Winners LIVE: ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి 1,080 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కందూరు నాగార్జునరెడ్డిపై గెలుపొందారు.
AP Election Results 2024 Winners LIVE: టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. గత ఆగస్టులో ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి లేఖ రాశారు.
AP Election Results 2024 Winners LIVE: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రికార్డు సృష్టించారు. మంగళగిరిలో 91 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్నారు. 39 ఏళ్ల తర్వాత అక్కడ టీడీపీ జెండాను ఎగురవేశారు. 1985లో టీడీపీ తరఫున కోటేశ్వరరావు గెలిచారు. ఇప్పటివరకూ మంగళగిరిలో అత్యధిక మెజారిటీ 17,265 మాత్రమే. ఆ రికార్డును తిరగరాసిన లోకేశ్ వైసీపీ అభ్యర్థి ఎం.లావణ్యపై 91 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సంపూర్ణ విజయం సాధించింది. ఆ పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది.
AP Election Results 2024 Winners LIVE: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘన విజయం సాధించారు. ఆయన సమీప వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్‌పై 48,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీలో కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థులు 116 స్థానాల్లో విజయం సాధించారు. జనసేన అభ్యర్థులు 19, బీజేపీ అభ్యర్థులు 7 స్థానాల్లో విజయం సాధించారు.
AP Election Results 2024 Winners LIVE: చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు.. బొత్సపై ఘన విజయం సాధించారు.
AP Assembly Election Results 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థుల విజయ పరంపర కొనసాగుతోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ప్రభుత్వ ఏర్పాటు కోసం 88 స్థానాలు అవసరం కాగా.. ఎన్డీయే కూటమి ఆ ఫిగర్ దాటేసింది. ప్రస్తుతం టీడీపీ 82, జనసేన 17, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించింది. అటు వైసీపీ 4 స్థానాల్లోనే గెలుపొందింది. ప్రస్తుతం టీడీపీ 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వైసీపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
AP Assembly Election Results 2024: మంగళగిరిలో 39 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. 1985లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థి కోటేశ్వరరావు గెలుపొందగా.. 39 ఏళ్ల తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘన విజయం సాధించారు.
AP Election Results 2024 Winners LIVE: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. రాజంపేట వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.. సమీప టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంపై గెలుపొందారు.
AP Election Results 2024 Winners LIVE: హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలుపొంది ఆయన హ్యాట్రిక్ కొట్టారు.
AP Assembly Election Results 2024: పులివెందుల నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ విజయం సాధించారు. 59 వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. గతంలో 90 వేలకు పైగా ఓట్ల మెజార్టీ రాగా ఈసారి 30 వేల ఓట్లు తగ్గిపోయాయి. టీడీపీ తరఫున రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి పాలైనా భారీగా ఓట్లు కొల్లగొట్టారు.
Background
Andhra Pradesh Assembly Election Results 2024 Winners LIVE: ఏపీలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. మొత్తం 64 స్థానాల్లో విజయం సాధించగా.. 72 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అటు ఎంపీ స్థానాల్లోనూ 16 చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం 71 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం విజయం సాధించారు. అటు, పులివెందులలో సీఎం జగన్ 59 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఫలితాలతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -